Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలను చూస్తే అబ్బాయిలు భయపడతారు..!
దాదాపు అందరూ ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలకు దూరంగా ఉండాలనే అనుకుంటారు. ఇది వారి నైజం. ఈ వ్యక్తిత్వం చాలా మంది అబ్బాయిలకు నచ్చదు. చూస్తేనే పారిపోతారు.

ఈ భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తికి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. వ్యక్తిత్వ లక్షణాలు కూడా భిన్నంగా ఉంటాయి. వారి వ్యక్తిత్వం, లక్షణాలు మనకు నచ్చితే వారితో స్నేహం చేస్తాం.అదే మనకు నచ్చకపోతే వారికి దూరంగా ఉంటాం. మన ఈ వ్యక్తిత్వాన్ని, లక్షణాలను న్యూమరాలజీ ప్రకారం కూడా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా మనం పుట్టిన తేదీ ఆధారంగా వీటిని చెప్పగలుగుతారు. అయితే.. కొన్ని తేదీల్లో పుట్టిన అమ్మాయిలు ప్రేమలో ఎప్పటికీ సక్సెస్ అవ్వలేరట. అంతేకాదు.. వీరికి అబ్బాయిలు ఎప్పుడూ దూరంగా ఉండాలనే అనుకుంటారట. మరి, ఆ తేదీలేంటో చూద్దామా..
న్యూమరాలజీ ప్రకారం ఏ నెలలో అయినా 1, 4, 10, 17, 22 లేదా 31వ తేదీల్లో పుట్టిన మహిళలు ప్రత్యేక స్వతంత్రతను, మొండి పట్టుదల మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వీరికి వ్యక్తిగత స్వేచ్ఛ ఎంతగానో ముఖ్యం. సంబంధాలు వారి స్వతంత్రతను భంగం చేయవచ్చనే అనుమానంతో, కొత్త సంబంధాల పట్ల వారు జాగ్రత్తగా, కొన్నిసార్లు అనుమానంతో వ్యవహరిస్తారు.
వీరి మాట తీరు కూడా చాలా కోపంగా ఉంటుంది. మాట్లాడే మాటలు కూడా చాలా కఠినంగా ఉంటాయి. దీంతో.. దాదాపు అందరూ ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలకు దూరంగా ఉండాలనే అనుకుంటారు. ఇది వారి నైజం. ఈ వ్యక్తిత్వం చాలా మంది అబ్బాయిలకు నచ్చదు. చూస్తేనే పారిపోతారు.
అవమానాన్ని భరించలేరు..
ఏ నెలలో అయినా 1, 5, 23, 26, 29వ తేదీల్లో పుట్టిన మహిళలు కూడా మొండి పట్టుదల వ్యక్తిత్వం కలిగి ఉంటారు. వీరు ఇతరుల మాట విన్నంత మాత్రాన మారిపోయే వ్యక్తులు కాదు. తమ సిద్ధాంతాలపై వీరికి అపారమైన నమ్మకం ఉంటుంది. పొరపాట్లను అంగీకరించడం, రాజీ పడడం వీరి స్వభావంలో తక్కువగా ఉంటుంది. ఇది ఇతరులకు చేరువవ్వడానికి కొంత ఇబ్బంది కలిగిస్తుంది.అంతేకాదు, ఎవరైనా ఏదైనా అన్నా వీరు తట్టుకోరు. అవమానాన్ని తీసుకోరు. అందుకే.. ఇలాంటి వారిని తొందరగా అబ్బాయిలు ఇష్టపడరు. దూరంగా ఉంటారు.
బయటికి వీరు ఎంత దూరంగా కనిపించినా, వీరి లోపల ఉన్న ఆత్మవిశ్వాసం, స్పష్టత ఎంతో గొప్పదిగా ఉంటుంది. సంబంధాల నుంచి తప్పించుకోవాలని వీరు అనుకోరు. కానీ తమ ప్రత్యేకతను గౌరవించే వ్యక్తులను మాత్రమే దగ్గరగా ఒప్పుకుంటారు. ఈ అమ్మాయిలు చాలా నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు.