MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Astrology: మీ జాతకంలో ఈ ఒక్క గ్రహం అనకూలంగా ఉన్నా చాలు.. జీవితంలో డబ్బుకు లోటు ఉండదు!

Astrology: మీ జాతకంలో ఈ ఒక్క గ్రహం అనకూలంగా ఉన్నా చాలు.. జీవితంలో డబ్బుకు లోటు ఉండదు!

మనిషి జీవితంలో డబ్బు, సంపద ముఖ్యమైన అంశాలు. కొందరు ఎంత కష్టపడ్డా డబ్బు నిల్వక ఇబ్బంది పడుతుంటే, మరికొందరికి చిన్న ప్రయత్నంతోనే సంపద పెరుగుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ తేడాకు కారణం, ఒకే ఒక్క గ్రహం అనుకూల ప్రభావం. ఆ గ్రహం ఏంటో ఇక్కడ చూద్దాం. 

2 Min read
Author : Kavitha G
Published : Apr 17 2026, 03:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
గురు గ్రహం ప్రభావంతో శుభఫలితాలు
Image Credit : Wikipedia and Getty

గురు గ్రహం ప్రభావంతో శుభఫలితాలు

ఒక వ్యక్తి జీవితంలో సంపద, సౌఖ్యం వంటి అంశాలు ప్రధానంగా గ్రహాల ప్రభావంతో నిర్ణయించబడతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ప్రతి గ్రహానికి ఒక ప్రత్యేక శక్తి, ప్రభావం ఉంటాయి. ముఖ్యంగా గురు గ్రహం అనుకూలంగా ఉంటే, వ్యక్తి జీవితంలో డబ్బుకు పెద్దగా లోటు ఉండదని నమ్మకం. 

గురువు జ్ఞానం, ధనం, శుభ ఫలితాలు, దైవకృపకు సంకేతం. ఒక వ్యక్తి జాతకంలో గురు గ్రహం బలంగా, శుభ స్థానంలో ఉంటే, ఆ వ్యక్తికి ఆర్థికంగా ఎదగడానికి ఎన్నో అవకాశాలు లభిస్తాయి. వారు చేసే పనుల్లో విజయం సాధించడం, మంచి ఆదాయం పొందడం, జీవితంలో స్థిరపడటం సులభమవుతుంది.

24
మంచి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం
Image Credit : Google

మంచి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం

పండితుల ప్రకారం, గురు గ్రహం అనుకూలంగా ఉన్న వ్యక్తులు సాధారణంగా మంచి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కలిగి ఉంటారు. ఆలోచించి ముందుకు సాగుతారు. ఈ లక్షణం వారిని ఆర్థికంగా బలంగా నిలబెడుతుంది. వ్యాపారం, ఉద్యోగం ఏదైనా వారు స్థిరమైన ఆదాయం పొందే దిశగా సాగుతారు. గురువు అనుగ్రహం ఉన్నవారికి మంచి గురువులు, మార్గదర్శకులు కూడా ఉంటారు. ఇది వారి కేరీర్ ఎదుగుదలకే కాకుండా, ఆర్థిక పురోగతికి కూడా తోడ్పడుతుంది.

Related Articles

Related image1
Astrology Predictions: 3 గ్రహాల అరుదైన యోగం.. ఈ 3 రాశులవారికి రాజు లాంటి జీవితం!
Related image2
Mars Blessings: కుజుడి దయతో ఈ 4 రాశులవారికి బంపర్ లాటరీ.. బిందాస్ లైఫ్!
34
వీరికి దైవభక్తి ఎక్కువ
Image Credit : istock

వీరికి దైవభక్తి ఎక్కువ

గురు గ్రహం అనుకూలంగా ఉన్నవారికి దైవభక్తి, ధార్మికత కూడా ఎక్కువగా ఉంటుంది. వారు ధర్మాన్ని పాటిస్తూ, ఇతరులకు సహాయం చేసే స్వభావం కలిగి ఉంటారు. ఈ విధమైన స్వభావం వల్ల సమాజంలో వారికి గౌరవం పెరుగుతుంది. పండితుల ప్రకారం ధర్మం పాటించే వారికి లక్ష్మీ కటాక్షం కూడా లభిస్తుందని నమ్మకం. అందువల్ల గురు గ్రహం బలంగా ఉన్నవారికి డబ్బు నిలకడగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

44
గురు గ్రహం అనుగ్రహం పొందాలంటే?
Image Credit : Asianet News

గురు గ్రహం అనుగ్రహం పొందాలంటే?

జాతకంలో గురు గ్రహం అనుకూలంగా లేకపోయినా, కొన్ని పరిహారాలు, ఆచరణలు పాటించడం ద్వారా దాని ప్రతికూల ప్రభావాన్ని తగ్గించుకోవచ్చని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. గురువారం రోజున ఉపవాసం చేయడం, పసుపు రంగు దుస్తులు ధరించడం, గురు గ్రహానికి సంబంధించిన మంత్రాలు జపించడం, అలాగే... గురువులకు గౌరవం ఇవ్వడం, విద్యకు ప్రాధాన్యం ఇవ్వడం, దానం చేయడం వంటివి గురు గ్రహాన్ని ప్రసన్నం చేస్తాయని పండితులు చెబుతున్నారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Saturn Effects: శని నక్షత్ర స్థానం మార్పు.. ఈ 4 రాశుల వారికి నెల రోజులు ఆర్థిక నష్టం తప్పకపోవచ్చు
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు విలువైన పత్రాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి!
Recommended image3
Jupiter Mars Blessings: త్వరలో ఈ 5 రాశులవారికి తిరగనున్న దశ.. వీరే ఇక డబ్బుకు కేరాఫ్ అడ్రెస్
Related Stories
Recommended image1
Astrology Predictions: 3 గ్రహాల అరుదైన యోగం.. ఈ 3 రాశులవారికి రాజు లాంటి జీవితం!
Recommended image2
Mars Blessings: కుజుడి దయతో ఈ 4 రాశులవారికి బంపర్ లాటరీ.. బిందాస్ లైఫ్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved