- Home
- Astrology
- Saturn Effects: శని నక్షత్ర స్థానం మార్పు.. ఈ 4 రాశుల వారికి నెల రోజులు ఆర్థిక నష్టం తప్పకపోవచ్చు
Saturn Effects: శని నక్షత్ర స్థానం మార్పు.. ఈ 4 రాశుల వారికి నెల రోజులు ఆర్థిక నష్టం తప్పకపోవచ్చు
Saturn Effects: శని గ్రహం ఉత్తరాభాద్రపద నక్షత్రంలోని నాలుగవ పాదంలోకి ప్రవేశించబోతోంది. ఏప్రిల్ 17న జరిగే ఈ శని సంచారం వల్ల 4 రాశుల వారికి ఆర్థిక నష్టాలు కలిగే అవకాశం ఉంది. మే 17 వరకు ఈ నాలుగు రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి తెలుసుకోండి.

వృషభ రాశి
వృషభ రాశి వారికి ఆర్థికంగా ఒత్తిడి పెరిగిపోతుంది. అలాగే డబ్బుపరంగా కొంత నష్టం వాటిల్లే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. అప్పులు కూడా చేయాల్సి రావచ్చు. అలాగే ఖర్చులు పెరుగుతాయి. కాబట్టి వీరు అనుకున్న బడ్జెట్ తో ముందుకు సాగలేరు. ఇక కెరీర్, వ్యాపారానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. కుటుంబ జీవితంలో విభేదాలు పెరిగిపోతాయి. దీనివల్ల మానసికంగా ప్రశాంతంగా ఉండలేరు. అలాగే పిల్లల నుండి కూడా వీరు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.
కన్యా రాశి
కన్యా రాశి వారు ఆర్థిక వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఈ నెల రోజులు పాటు ఉండాలి. వీరు ఏప్రిల్ 17 నుండి మే 17 వరకు ఎవరి చేతిలోనైనా మోసానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆదాయం తగ్గిపోయి ఖర్చులు పెరిగిపోతాయి. పెట్టుబడి వంటి విషయాలకు దూరంగా ఉంటే ఉత్తమం. ఇక కుటుంబంలో కూడా గొడవలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఓర్పుతో, సహనంతో ఈ నెల రోజులు ఉండాలి. శని మార్పు అనేది మీ జీవితంలో సవాళ్లను పెంచేస్తుంది.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి ఏప్రిల్ 17 నుంచి మే 17 వరకు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అప్పుగా తీసుకున్న డబ్బు చెల్లించలేకపోవచ్చు. ఒప్పందాలకు కుదుర్చుకునే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారు తమ భాగస్వాములను గుడ్డిగా నమ్మకూడదు. కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకుంటే కాస్త మంచి రోజులు వచ్చే వరకు వేచి ఉండడం ఉత్తమం.
కుంభ రాశి
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని పాదం మార్పు కుంభ రాశి వారికి సవాళ్లను తీసుకువస్తుంది. వీరు మానసికంగా అలసిపోతారు. పనిలో తీవ్ర ఒత్తిడికి గురవుతారు. వ్యాపారం చేస్తున్న వారికి నష్టాలు రావచ్చు. ఇక కష్టపడి పనిచేసే వారికి కూడా ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. కానీ మంచి ఫలితాలు ఎప్పటికైనా కనిపిస్తాయి. విద్యార్థులు మాత్రం ఏకాగ్రత కోల్పోకుండా చదవాలి. ఏప్రిల్ 17 నుంచి మే 17 వరకు ఓర్పుతో ఉండడం ఎంతో ముఖ్యం.

