- Home
- Life
- Personality test: మీ ముందు ఎవరైనా ఇలా కాలు మీద కాలేసి కూర్చుంటున్నారా? వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే..
Personality test: మీ ముందు ఎవరైనా ఇలా కాలు మీద కాలేసి కూర్చుంటున్నారా? వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే..
Personality test: మనం చేసే పనులు, కూర్చునే విధానం వంటివి మన వ్యక్తిత్వాన్ని అంచనా వేసి చెప్పగలవు. ఇక్కడ మేము క్రాస్ లెగ్ పొజిషన్లో కూర్చునేవారి వ్యక్తి ఎలా ఉంటుందో తెలుసుకోండి.

క్రాస్ లెగ సిట్టింగ్ పొజిషన్
మనం కూర్చునే విధానం మన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. పర్సనాలిటీ టెస్ట్ ప్రకారం కాళ్ళు క్రాస్ చేసి కూర్చోవడం ఒకరి ఆలోచన విధానాన్ని, భావోద్వేగాలను, వారి స్వభావాన్ని తెలియజేస్తుంది. క్రాస్ లెగ్ పొజిషన్లో కూర్చునే వారి వైఖరి ఎలా ఉంటుందో తెలుసుకోండి. ఇలా కూర్చునే వారు మీకు ఎంతో మంది ఎదురయ్యే ఉంటుంది. వారు ఎలాంటివారో అర్థం చేసుకోండి.
వీరు ఎలా ఉంటారు?
కుర్చీలో కూర్చునేటప్పుడు ఇలా క్రాస్ లెగ్ లేదా కాలు మీద కాలు వేసుకుని కూర్చునే వారి వ్యక్తిత్వం చాలా స్నేహపూర్వకంగా ఉంటుంది. వీరిని చూసినప్పుడు కాస్త పొగరుగా అనిపించినా.. అలా కూర్చునేవారు ఇతరులతో కలవడాన్ని బాగా ఇష్టపడతారు. ఎవరితోనైనా త్వరగా సంబంధాలు ఏర్పరచుకుంటారు. చుట్టుపక్కల ఉన్నవాళ్లు కూడా వీరిని త్వరగా ఇష్టపడతారు. ఈ వ్యక్తులు ఏదైనా విషయాన్ని సరికొత్తగా ఆలోచిస్తారు. కొత్త మార్గాలను అన్వేషించేందుకు ఇష్టపడతారు. వీరి ఆలోచనలు కూడా భిన్నంగా ఉంటాయి. వీరిది విశాలమైన హృదయం.
వీరికి ఏమిష్టం?
ఇలా క్రాస్ లెగ్ పొజిషన్లో కూర్చునే వారికి కొత్త ప్రాంతాలకు ప్రయాణం చేయడం అంటే ఎంతో ఇష్టం. ట్రావెలింగ్ ను కెరీర్ గా మార్చుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటారు. ఇలా కూర్చునే వ్యక్తులకు ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువ. తమను తాము నమ్ముతారు. ఎవరితోనైనా మాట్లాడడానికి ఏమాత్రం సంకోచించరు. గుంపులో ఉన్నా కూడా వారు ప్రత్యేకంగా కనిపించాలన్న కోరికతో ఉంటారు.
ఎవరినీ నమ్మరు
కాళ్లు ముడుచుకుని కూర్చునే వ్యక్తులు మాట్లాడే తీరు కూడా చాలా చురుకుగా ఉంటుంది. వారి మాట తీరుతో ఎవరినైనా ఇట్టే పడేస్తారు. ఎవరైనా అడిగే ప్రశ్నలకు చాలా ఆలోచనత్మకంగా సమాధానాలు ఇస్తారు. అయితే మీరు ఇతరులను తక్కువగా నమ్ముతారు. కానీ తమపైనే పూర్తిగా ఆధారపడి ఉంటారు. ఇతరులపై ఆధారపడి జీవించేందుకు నిర్ణయాలు తీసుకునేందుకు ఏమాత్రం ఇష్టపడరు.

