- Home
- Astrology
- Maha Shivratri 2026 : శివ పురాణంలో చెప్పిన ధనలాభ ఉపాయాలు.. ఈ శివరాత్రికి ట్రై చేశారో ధనవంతులే
Maha Shivratri 2026 : శివ పురాణంలో చెప్పిన ధనలాభ ఉపాయాలు.. ఈ శివరాత్రికి ట్రై చేశారో ధనవంతులే
Maha Shivratri 2026 : శివపురాణంలో ధనలాభం కోసం ఓ సులభమైన మార్గాన్ని వివరించారు. మహాశివరాత్రి రోజున ఈ పరిహారం పాటిస్తే మీకు కూడా ధనలాభం జరిగి ఐశ్వర్యవంతులు కావచ్చు.

మహాశివరాత్రికి ఏ పరిహారాలు చేయాలి?
Maha Shivaratri 2026 : శివుడికి సంబంధించిన ఎన్నో పురాణాలు ఉన్నా, అన్నింటిలోకీ శివపురాణం చాలా ప్రామాణికమైంది. ఇందులో రకరకాల కోరికలు నెరవేరడానికి అనేక ఉపాయాలు చెప్పారు. మీరు ధనలాభం కోరుకుంటే దానికోసం కూడా శివపురాణంలో ఒక సులభమైన పరిహారం ఉంది. ఈ పరిహారాన్ని మహాశివరాత్రి (2026, ఫిబ్రవరి 15, ఆదివారం) రోజున చేస్తే మరింత శుభ ఫలితం దక్కుతుంది. ఆ ఉపాయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
శివపురాణంలో చెప్పిన ధనలాభ ఉపాయం
శివపురాణం ప్రకారం… రోజూ శివలింగంపై బియ్యం సమర్పించే భక్తులకు త్వరలోనే ధనలాభం కలుగుతుంది. ఈ పరిహారాన్ని మహాశివరాత్రి నుంచి ప్రారంభిస్తే మరింత మంచి ఫలితం ఉంటుంది. ధర్మ గ్రంథాలలో బియ్యాన్ని 'హవిష్య అన్నం' అని కూడా అంటారు. అంటే హోమంలో ఉపయోగించే ధాన్యం అని అర్థం. అందుకే బియ్యానికి అంత ప్రాధాన్యం ఉంది.
బియ్యానికి ఎందుకంత ప్రాధాన్యం?
జ్యోతిష్య శాస్త్రంలో బియ్యాన్ని శుక్ర గ్రహంతో ముడిపెట్టి చూస్తారు. శుక్ర గ్రహం వల్లే మన జీవితంలో సుఖసంతోషాలు, సంపదలు కలుగుతాయి. ఎవరి జాతకంలోనైతే శుక్రుడు శుభస్థానంలో ఉంటాడో, వారికి జీవితంలో డబ్బుకు లోటు ఉండదు. రోజూ శివుడికి బియ్యం సమర్పిస్తే శుక్రుడి స్థానం బలపడి, ధనలాభ యోగాలు ఏర్పడతాయి. దీంతో పాటు ఇతర శుభ ఫలితాలు కూడా కలుగుతాయి.
శివలింగంపై బియ్యం సమర్పించేటప్పుడు నియమాలు
1. శివలింగంపై విరిగిన బియ్యాన్ని ఎప్పుడూ సమర్పించకూడదు. పూజలో పూర్తి గింజలనే వాడాలి. అప్పుడే ఈ పరిహారం పూర్తి ఫలం ఇస్తుంది.
2. శివుడి పూజకు వాడే బియ్యాన్ని పవిత్రత కోసం వేరుగా ఉంచాలి.
3. శివలింగంపై బియ్యం సమర్పించేటప్పుడు ఈ మంత్రాన్ని జపించాలి-
అక్షతాశ్చ సురశ్రేష్ఠ కుంకుమాక్తాః సుశోభితాః
మయా నివేదితా భక్త్యాః గృహాణ పరమేశ్వర॥
Disclaimer
ఈ కథనంలోని సమాచారం ధర్మ గ్రంథాలు, పండితులు, జ్యోతిష్యుల నుంచి సేకరించింది. ఈ సమాచారాన్ని కేవలం మీ అవగాహన కోసం అందిస్తున్నాం. పాఠకులు దీన్ని కేవలం సూచనగా మాత్రమే పరిగణించాలి.

