MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Mangal Gochar: రాహువుతో కుజుడు కలయిక.. ఈ మూడు రాశులకు అనుకోని సమస్యలు

Mangal Gochar: రాహువుతో కుజుడు కలయిక.. ఈ మూడు రాశులకు అనుకోని సమస్యలు

 Mangal Gochar: ఫిబ్రవరి చివరలో కుజుడు, రాహువు సంయోగం ఏర్పడి.. అంగారక యోగాన్ని సృష్టిస్తుంది. దీని కారణంగా, కొన్ని రాశులకు అనుకోని సమస్యలు, చిక్కులు వచ్చే ప్రమాదం ఉంది. 

2 Min read
Author : ramya Sridhar
Published : Feb 10 2026, 12:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Mangal Gochar
Image Credit : AI

Mangal Gochar

వేద జోతిష్యశాస్త్రంలో రాహువును చెడు, నీడ గ్రహంగా పరిగణిస్తారు. అయితే, ఈ గ్రహం మారే ప్రతిసారీ.. 12 రాశుల జీవితాలను ఏదో ఒక విధంగా ప్రభావితం చేస్తుంది. ప్రస్తుతం రాహువు కుంభ రాశిలో ఉన్నాడు. ఆల్రెడీ ఈ రాశిలో శుక్రుడు, బుధుడు, సూర్యుడు ఉన్నారు. ఫిబ్రవరి 23న కుజుడు కూడా ఈ రాశిలో ప్రవేశిస్తాడు. దీంతో.. రాహువుతో కుజుడు సంయోగం ఏర్పడి.. అంగారక యోగాన్ని సృష్టిస్తుంది. ఇది అశుభ కలయికగా పరిగణిస్తారు. దీని కారణంగా.. మూడు రాశుల వారికి అనుకోని సమస్యలు రానున్నాయి. మరి, ఆ రాశులేంటో చూద్దాం...

24
మేష రాశి..
Image Credit : Asianet News

మేష రాశి..

ఈ అంగారక యోగం మేష రాశివారికి అంత అనుకూలంగా ఏమీ ఉండదు.కాబట్టి, ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా అనవసరంగా ఎవరి మీదా కోపం తెచ్చుకోకూడదు. మీ కోపమే మీ పనిని నాశనం చేసేస్తుంది. కాబట్టి, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. అనాలోచిత నిర్ణయాలు ప్రమాదకరం కావచ్చు. మీ కెరీర్ నుండి మీ సంబంధాల వరకు ప్రతిదానిలోనూ ప్రతికూల ప్రభావాలు కనిపిస్తాయి. రాహువు అపారమైన శక్తిని తెస్తాడు. దానిని మీరు సరైన దిశలో నడిపించాలి. ఆర్థిక పరిస్థితి కూడా ప్రభావితమౌతుంది. అనవసరమైన ఖర్చుల వల్ల మీరు ఇబ్బంది పడొచ్చు. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టే ముందు, జూదం ఆడటం లేదా ఏదైనా ఆస్తిని కొనుగోలు చేసే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి.

Related Articles

Related image1
Lunar Eclipse: కుంభ రాశిలో చంద్ర గ్రహణం.. ఈ 3 రాశులకు లైఫ్ టైమ్ సెటిల్మెంట్
Related image2
Birth Date: మొదటి సంతానం ఆడపిల్ల ఈ తేదీల్లో పుడితే..తండ్రికి లక్ష్మీ కటాక్షమే..!
34
కుంభ రాశి..
Image Credit : Asianet News

కుంభ రాశి..

కుంభరాశిలో అంగారక యోగం ఈ రాశివారికి అనుకోని సమస్యలు తెచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో ఈ రాశివారి స్వభావం చాలా దూకుడుగా మారుతుంది. కాబట్టి, జాగ్రత్త అవసరం. మీ అహం కూడా పెరుగుతుంది. మీ ఎమోషన్స్ కంట్రోల్ లో ఉంచుకోవాలి. ముఖ్యంగా, ఆర్థిక సమస్యలు రాకుండా జాగ్రత్తపడాలి. ఆరోగ్యం విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి.యోగా, ధ్యానం వంటివి చేయాలి. సమయానికి నిద్రపోవాలి.

44
వృశ్చిక రాశి...
Image Credit : Asianet News

వృశ్చిక రాశి...

అంగారక యోగం.. వృశ్చిక రాశి వారికి కూడా అంత అనుకూలంగా లేదు. ఈ సమయంలో ఈ రాశివారి సంతోషం తగ్గిపోతుంది. కుటుంబంలో ఏవైనా సమస్యలు రావచ్చు. ముఖ్యంగా, కోపాన్ని, మాటను కంట్రోల్ లో ఉంచుకోవాలి.లేకపోతే.. ఈ సమస్యలు మరింత పెరుగుతాయి.కుటుంబంలో విభేదాలు కొనసాగుతాయి. ఆర్థిక సమస్యలు కూడా రావచ్చు. అటువంటి పరిస్థితిలో, ఓపిక , అవగాహనతో ప్రతిదాన్ని నిర్వహించడానికి ప్రయత్నించండి. ఏ పనీ పూర్తి కాకపోవచ్చు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఏషియానెట్ న్యూస్
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac Compatibility: ఏ రాశి పురుషులు ఏ రాశి మహిళలను పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉంటారు?
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు డబ్బు విషయంలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు!
Recommended image3
AI Horoscope: ఓ రాశివారు ఈ రోజు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు
Related Stories
Recommended image1
Lunar Eclipse: కుంభ రాశిలో చంద్ర గ్రహణం.. ఈ 3 రాశులకు లైఫ్ టైమ్ సెటిల్మెంట్
Recommended image2
Birth Date: మొదటి సంతానం ఆడపిల్ల ఈ తేదీల్లో పుడితే..తండ్రికి లక్ష్మీ కటాక్షమే..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved