MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • Glowing Skin: బొప్పాయితో వీటిని కలిపిరాస్తే.. ముఖం చిటికెలో మెరిసిపోతుంది!

Glowing Skin: బొప్పాయితో వీటిని కలిపిరాస్తే.. ముఖం చిటికెలో మెరిసిపోతుంది!

ముఖం.. అందంగా, కాంతివంతంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందుకోసం మార్కెట్లో దొరికే రకరకాల ఫేస్ ప్యాక్ లు, క్రీములు వాడుతుంటారు. కానీ బొప్పాయి ఫేస్ ప్యాక్ ను ఎప్పుడైనా ట్రై చేశారా? దీన్ని ఇంట్లోనే ఈజీగా తయారుచేసుకోవచ్చు. ఎలాగో ఇక్కడ చూద్దాం.  

1 Min read
Author : Kavitha G
Published : May 27 2025, 08:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
బొప్పాయి ఫేస్ ప్యాక్

బొప్పాయి ఫేస్ ప్యాక్

బొప్పాయి శరీర ఆరోగ్యానికే కాదు.. చర్మ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని యవ్వనంగా ఉంచడంతోపాటు మెరిసేలా చేస్తాయి. బొప్పాయి ఫేస్ ప్యాక్ మృత కణాలను తొలగించడానికి, మొటిమలను నివారించడానికి సహాయపడుతుంది. చర్మానికి ఎంతగానో మేలు చేసే బొప్పాయి ఫేస్ ప్యాక్ ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూద్దాం.

24
బొప్పాయి, పసుపు ఫేస్ ప్యాక్:

బొప్పాయి, పసుపు ఫేస్ ప్యాక్:

బొప్పాయి, పసుపు ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి ఒక గిన్నెలో బొప్పాయి ముక్కలు వేసి మెత్తగా చేసుకోండి. దాంట్లో కొద్దిగా పసుపు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి.. పది నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి. ఈ ఫేస్ ప్యాక్‌ను క్రమం తప్పకుండా ఉపయోగిస్తే మంచి మార్పులు కనిపిస్తాయి.

Related Articles

Related image1
Skin care: ఇదొక్కటి రాస్తే చాలు.. ముఖం మృదువుగా, అందంగా మారుతుంది!
Related image2
Skin care: 30 తర్వాత చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే.. ఇవి చేస్తే చాలు!
34
బొప్పాయి, చందనం ఫేస్ ప్యాక్:

బొప్పాయి, చందనం ఫేస్ ప్యాక్:

ఈ ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి ఒక గిన్నెలో బొప్పాయి  ముక్కలను వేసి మెత్తగా చేసుకోండి. దాంట్లో చందనం పొడి, నిమ్మరసం, తేనె కలిపి పేస్ట్‌లా తయారు చేయండి. తర్వాత ఆ పేస్ట్‌ను ముఖానికి రాసి 15 నిమిషాలు అలాగే ఉంచండి. అనంతరం చల్లటి నీటితో కడిగేయండి.  

44
అరటిపండు, దోసకాయ, బొప్పాయి ఫేస్ ప్యాక్:

అరటిపండు, దోసకాయ, బొప్పాయి ఫేస్ ప్యాక్:

దోసకాయ, అరటిపండు చర్మాన్ని తేమగా ఉంచుతాయి. దోసకాయను చిన్న ముక్కలుగా కోసి, బొప్పాయి, అరటిపండుతో కలిపి మిక్సీలో వేసి పేస్ట్‌లా తయారు చేయండి. ఆ పేస్ట్‌ను ముఖంతో పాటు మెడకు కూడా రాయండి. 15 నిమిషాలు అలాగే ఉంచి, ఆ తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
సౌందర్యం
మహిళలు
జీవనశైలి
చిట్కాలు మరియు ఉపాయాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Hair Care: ఖరీదైన షాంపూలతో పనిలేదు.. ఇవి రాస్తే.. ఒత్తైన జుట్టు మీ సొంతం..!
Recommended image2
Pearl Earrings: మగువల మనసుదోచే ముత్యాల కమ్మలు.. ఓ లుక్కేయండి
Recommended image3
2 గ్రాముల్లో ఇయర్ రింగ్స్.. రౌండ్ ఫేస్ ఉన్నవారికి బెస్ట్ ఆప్షన్!
Related Stories
Recommended image1
Skin care: ఇదొక్కటి రాస్తే చాలు.. ముఖం మృదువుగా, అందంగా మారుతుంది!
Recommended image2
Skin care: 30 తర్వాత చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే.. ఇవి చేస్తే చాలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved