MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్ ... ఈ నెలాఖరులోపు బ్యాంక్ అకౌంట్లో డబ్బులే డబ్బులు

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్ ... ఈ నెలాఖరులోపు బ్యాంక్ అకౌంట్లో డబ్బులే డబ్బులు

తెలంగాణ రైతులకు రేవంత్ సర్కార్ నుండి తీపికబురు అందనుంది. ప్రతి రైతు ఖాతాలో డబ్బులు వేసేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది... ఇందుకోసం కసరత్తు కూడా ప్రారంభించింది. డబ్బులు ఎందుకు వేయనున్నారో తెలుసా? 

2 Min read
Author : Arun Kumar P
| Updated : May 16 2025, 09:10 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Telangana Rythu Bharosa

Telangana Rythu Bharosa

Rythu Bharosa : తెలంగాణ ప్రజలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పనుందా? ఈ నెలాఖరులోగా రైతుల ఖాతాల్లో డబ్బులు పడనున్నాయా? అంటే ప్రభుత్వ వర్గాల నుండి అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటికే రబీ సీజన్ రైతు భరోసా డబ్బులు చాలామంది రైతులకు రాలేవు.. త్వరలోనే అందరి ఖాతాల్లో డబ్బులు వేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకోసం నిధులు సమకూర్చుకోవాలని ఆర్థిక శాఖను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు తెలుస్తోంది. 

25
Revanth Reddy

Revanth Reddy

గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రతి రైతుకు పెట్టుబడిసాయం కింద ఎకరాలకు రూ.15 వేలు ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రతి ఏడాది రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు జమచేస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక ఈ పథకాన్ని అమలుచేసిన రేవంత్ సర్కార్ మొదట ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని ప్రకటించారు. అందులో మొదటి విడతగా రబీ సీజన్లో పెట్టుబడిసాయం కింద ఎకరాకు రూ.6 వేలు జమచేయడం ప్రారంభించారు. 

Related Articles

Related image1
మిస్ వరల్డ్ 2025 పోటీల్లో పాల్గొనబోతున్న రైతు బిడ్డ.. నందినీ గుప్తా గురించి ఈ విషయాలు తెలుసా ?
Related image2
Telangana: గొప్ప మ‌న‌సు చాటుకున్న సీఎం రేవంత్‌.. రూ. 12 లక్ష‌ల ఆర్థిక సాయం
35
Rythu Bharosa

Rythu Bharosa

అయితే ఇప్పటివరకు కేవలం నాలుగు ఎకరాల లోపు వ్యవసాయ భూమి కలిగిన రైతులకే పెట్టుబడి సాయం అందింది. జనవరి 26న రైతు భరోసా ప్రథకాన్ని ప్రారంభించారు.. అంటే నాలుగు నెలలు గడుస్తున్నా ఇంకా చాలామంది రైతుల ఖాతాల్లో డబ్బులు పడలేవు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతాంగం గుర్రుగా ఉన్నారు... ఇది గుర్తించిన రేవంత్ సర్కార్ అందరు రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ చేసేందుకు సిద్దమయ్యింది. 

45
Rythu Bharosa

Rythu Bharosa

నాలుగు ఎకరాలకు పైగా భూములున్న రైతుల ఖాతాల్లో మే నెలాఖరుకు రైతు భరోసా డబ్బులు వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 10 ఎకరాల లోపు రైతులకు ఈ పెట్టుబడి సాయం డబ్బులు అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకోసం ఆర్థిక శాఖకు ఇప్పటికే ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది... దీంతో త్వరలోనే రైతు భరోసా అందనున్నట్లు జరుగుతున్న ప్రచారం రైతులను ఖుషీ చేస్తోంది. 
 

55
Rythu Bharosa

Rythu Bharosa

నాలుగైదు రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసాపై సమీక్ష నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్థిక, వ్యవసాయ అధికారులతో సమావేశం కానున్న సీఎం రైతు భరోసాకు నిధుల సమీకరణపై చర్చించనున్నారు. ఈ సమావేశం అనంతరం రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో ఎప్పట్లోపు పడతాయన్నదానిపై పూర్తి క్లారిటీ రానుంది. 

మరో పది పదిహేను రోజుల్లో వర్షాకాలం ప్రారంభం కానుంది. దీంతో రైతులు పంటలు వేసేందకు సిద్దమవుతున్నారు. ఈ క్రమంలోనే పెట్టుబడి సాయం అందిస్తే ఆ డబ్బులు రైతులకు ఉపయోగపడతాయి. అందువల్లే వర్షాకాలం మొదలయ్యేలోపు రైతు భరోసాను పూర్తిచేయాలన్నది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది.
 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
తెలంగాణ
అనుముల రేవంత్ రెడ్డి

Latest Videos
Recommended Stories
Recommended image1
ఈ ప్రాంతం త్వ‌ర‌లోనే హైద‌రాబాద్‌లో క‌లిసిపోవ‌డం ఖాయం.. ఈరోజు కొంటే, రేపు మీ పంట పండిన‌ట్లే
Recommended image2
Telangana Municipal Elections 2026 : పట్టణ ఓటర్ల తీర్పు.. కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్
Recommended image3
Weather Update : ఇవేం ఎండల్రా నాయనా..! ఇప్పుడే తెలంగాణలో 34, ఏపీలో 35 డీగ్రీల టెంపరేచర్
Related Stories
Recommended image1
మిస్ వరల్డ్ 2025 పోటీల్లో పాల్గొనబోతున్న రైతు బిడ్డ.. నందినీ గుప్తా గురించి ఈ విషయాలు తెలుసా ?
Recommended image2
Telangana: గొప్ప మ‌న‌సు చాటుకున్న సీఎం రేవంత్‌.. రూ. 12 లక్ష‌ల ఆర్థిక సాయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved