MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • క‌ల‌లో కూడా ఊహించ‌డం అసాధ్యం.. 2 గంట‌ల్లోనే హైద‌రాబాద్ టూ తిరుప‌తి. బుల్లెట్ ట్రైన్‌లో కీల‌క మలుపు

క‌ల‌లో కూడా ఊహించ‌డం అసాధ్యం.. 2 గంట‌ల్లోనే హైద‌రాబాద్ టూ తిరుప‌తి. బుల్లెట్ ట్రైన్‌లో కీల‌క మలుపు

Hyderabad: అహ్మదాబాద్-ముంబై బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. కాగా దేశంలో మరో బుల్లెట్ ట్రైన్‌కు బీజం ప‌డుతోంది. హైద‌రాబాద్-చెన్నై న‌గ‌రాల మ‌ధ్య హైస్పీడ్ రైలు కారిడార్ ఒక కీల‌క ద‌శ‌లోకి అడుగుపెట్టింది. 

2 Min read
Author : Narender Vaitla
Published : Nov 26 2025, 10:32 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రూపం దాల్చుతున్న హైస్పీడ్ కారిడార్
Image Credit : Getty

రూపం దాల్చుతున్న హైస్పీడ్ కారిడార్

ఈ బుల్లెట్ ట్రైన్‌కు సంబంధించి దక్షిణ మధ్య రైల్వే తాజాగా ప్రాజెక్టు తుది అలైన్‌మెంట్‌ను తమిళనాడు ప్రభుత్వానికి అందించింది. 778 కిలోమీటర్ల పొడవుతో రూపొందిస్తున్న ఈ హైస్పీడ్ మార్గం కోసం సమగ్ర రిపోర్ట్ సిద్ధమవుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల మీదుగా వెళ్లే ఈ లైన్‌ రెండు మహానగరాల మధ్య ప్రయాణాన్నిపూర్తిగా మార్చేయ‌నుంది. ఈ ప్రాజెక్టుతో ప్ర‌యాణికుల‌కు అత్యాధునిక సదుపాయాలు మాత్ర‌మే కాకుండా ప్ర‌యాణ భారాన్ని భారీగా త‌గ్గించ‌నుంది.

25
కొత్త మార్గానికి కీలక అప్‌డేట్
Image Credit : Getty

కొత్త మార్గానికి కీలక అప్‌డేట్

మొదట గూడూరు మార్గంతో ప్రణాళిక చేసిన రూట్‌ను తాజా అవసరాలను పరిశీలించి మార్చారు. తమిళనాడు అభ్యర్థన మేరకు తిరుపతి స్టేషన్‌ను కొత్త అలైన్‌మెంట్‌లో చేర్చారు. ఇది రెండు నగరాల మధ్య ధార్మిక, వ్యాపార, పర్యాటక ప్రయాణానికి పెద్దగా ఉపయోగపడుతుంది. హైదరాబాద్ నుంచి తిరుపతికి సాధారణంగా 10 నుంచి 12 గంట‌ల స‌మ‌యం ప‌డుతుంది. కానీ ఈ హైస్పీడ్ ట్రాక్ పూర్తి అయితే కేవలం 2 గంటల్లో తిరుపతికి చేరుకునే అవకాశం ల‌భించ‌నుంది.

Related Articles

Related image1
100 ఎక‌రాల్లో అద్భుత‌మైన ఫామ్ హౌజ్‌.. ధ‌ర్మేంద్ర ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా.?
Related image2
ఒకేసారి రెండు అల్ప‌పీడ‌నాలు.. స‌ముద్రంలో అల్ల‌క‌ల్లోలం, మ‌రో తుపాను ఖాయం
35
చెన్నైలో రెండు ప్రధాన స్టేషన్లు
Image Credit : Gemini AI

చెన్నైలో రెండు ప్రధాన స్టేషన్లు

తమిళనాడు పరిధిలో రెండు స్టేష‌న్ల‌ను నిర్మించ‌నున్నారు. వీటిలో ఒక‌టి చెన్నై సెంట్రల్, రెండోది మీంజూరు సమీపంలోని చెన్నై రింగ్ రోడ్. ఈ రెండు స్టేషన్లు ఏర్పాటు చేయ‌నున్నారు. ప్రతి స్టేషన్ చుట్టూ రవాణా–ఆధారిత వాణిజ్య హబ్‌ల కోసం దక్షిణ మధ్య రైల్వే దాదాపు 50 ఎకరాల భూమి కోరింది. ఇవి భవిష్యత్‌లో వ్యాపార కేంద్రాలుగా, లాజిస్టిక్స్ హబ్‌లుగా మారే అవకాశముంది.

45
టన్నెల్లు, రోడ్ల క్రాస్‌యింగ్‌లు
Image Credit : Gemini AI

టన్నెల్లు, రోడ్ల క్రాస్‌యింగ్‌లు

హైస్పీడ్ నెట్‌వర్క్‌లో తమిళనాడులో 12 కిలోమీటర్ల భూగర్భ సొరంగం నిర్మాణం ఉంటుంది. మొత్తం కారిడార్‌కు 223.44 హెక్టార్ల భూమి అవసరం. అటవీ ప్రాంతం లేకపోవడం భూసేకరణను సులభతరం చేస్తుంది. ఈ మార్గం మొత్తం 65 రహదారులు, 21 హైటెన్షన్ విద్యుత్ లైన్లు దాటుతూ ముందుకు సాగుతుంది. రైట్స్ లిమిటెడ్ నిర్వహించిన సమగ్ర సర్వేల ఆధారంగా ఈ రూట్‌ను నిర్ధారించారు.

55
ఆర్థిక ప్రగతి, ఉద్యోగాలు
Image Credit : Gemini AI

ఆర్థిక ప్రగతి, ఉద్యోగాలు

ఈ కారిడార్‌ వల్ల హైదరాబాద్–చెన్నై మధ్య వ్యాపారం మరింత వేగంగా పెరుగుతుంది. సేవా రంగం, ఇండస్ట్రీలు, పర్యాటక రంగాల్లో భారీ అవకాశాలు ఏర్పడతాయి. హైస్పీడ్‌ నెట్‌వర్క్‌ ఏర్పాటు వల్ల నిర్మాణ రంగం నుంచి ఆపరేషన్ల వరకు వేలాది ఉద్యోగాలు రాబోతున్నాయి. దక్షిణ భారతదేశంలో ప్రణాళికలో ఉన్న రెండు ప్రధాన హైస్పీడ్ మార్గాలలో ఇది ఒకటి కాగా.. మరొకటి హైదరాబాద్–బెంగళూరు కారిడార్. రైల్వే, రాష్ట్ర ప్రభుత్వాలు భూసేకరణ, స్టేషన్ స్థలాల ఖరారుపై స‌కాలంలో చ‌ర్య‌లు తీసుకుంటే ప్రాజెక్టు పనులు త్వరగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
హైదరాబాద్
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
తిరుపతి

Latest Videos
Recommended Stories
Recommended image1
Telangana Municipal Elections 2026 : పట్టణ ఓటర్ల తీర్పు.. కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్
Recommended image2
Weather Update : ఇవేం ఎండల్రా నాయనా..! ఇప్పుడే తెలంగాణలో 34, ఏపీలో 35 డీగ్రీల టెంపరేచర్
Recommended image3
హైదరాబాదీలు మీరు భద్రమేనా.? భవిష్యత్తులో భూకంపాలు వచ్చే అవకాశాలున్నాయా.?
Related Stories
Recommended image1
100 ఎక‌రాల్లో అద్భుత‌మైన ఫామ్ హౌజ్‌.. ధ‌ర్మేంద్ర ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా.?
Recommended image2
ఒకేసారి రెండు అల్ప‌పీడ‌నాలు.. స‌ముద్రంలో అల్ల‌క‌ల్లోలం, మ‌రో తుపాను ఖాయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved