MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • ఒకేసారి రెండు అల్ప‌పీడ‌నాలు.. స‌ముద్రంలో అల్ల‌క‌ల్లోలం, మ‌రో తుపాను ఖాయం

ఒకేసారి రెండు అల్ప‌పీడ‌నాలు.. స‌ముద్రంలో అల్ల‌క‌ల్లోలం, మ‌రో తుపాను ఖాయం

Rain Alert: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌రో తుఫాన్ భ‌య‌పెడుతోంది. స‌ముద్రంలో జ‌రుగుతోన్న మార్పుల కార‌ణంగా వాతావ‌ర‌ణంలో భారీ మార్పులు జ‌రిగే అవ‌కావశం ఉంద‌ని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. 

1 Min read
Author : Narender Vaitla
Published : Nov 25 2025, 03:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మలక్కా జలసంధి వద్ద తీవ్ర అల్పపీడనం
Image Credit : Asianet News

మలక్కా జలసంధి వద్ద తీవ్ర అల్పపీడనం

మలక్కా జలసంధి సమీపంలో ప్రస్తుతం తీవ్ర అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని సంస్థ తెలిపింది. రాబోయే 6 గంటల్లో ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా మారే అవకాశం ఉందని వివరించింది. ఈ వాయుగుండం మరింత బలపడితే, వచ్చే 48 గంటల్లో దక్షిణ బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.

25
మరో అల్పపీడనం
Image Credit : Asianet News

మరో అల్పపీడనం

ఉపరితల ఆవర్తన ప్రభావంతో కొమోరిన్, నైరుతి బంగాళాఖాతం.. శ్రీలంక ప్రాంతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఇది కూడా రాబోయే 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో ఈ రెండు ఒకేసారి బలపడటం వల్ల తీర ప్రాంతాల్లో గాలులు, అలలు తీవ్రంగా ఉండే అవకాశం ఉంది.

Related Articles

Related image1
100 ఎక‌రాల్లో అద్భుత‌మైన ఫామ్ హౌజ్‌.. ధ‌ర్మేంద్ర ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా.?
Related image2
ప్రపంచానికి తెలియని యోధుడు.. 26/11 దాడిలో 157 మందిని ర‌క్షించిన వీరుడి గురించి తెలుసా?
35
మత్స్యకారులకు కఠిన హెచ్చరిక
Image Credit : Generated by google gemini AI

మత్స్యకారులకు కఠిన హెచ్చరిక

గురువారం నుంచి సముద్రంలో వేటకు వెళ్లకుండా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టమైన హెచ్చరిక జారీ చేసింది. ఇప్పటికే సముద్రంలో ఉన్న మత్స్యకారులు తక్షణమే తీరానికి తిరిగి రావాలని ఆదేశించింది. రానున్న రోజుల్లో బంగాళాఖాతంలో అలలు 2–4 మీటర్ల ఎత్తులో ఉప్పెనలా రావచ్చని అంచనా వేస్తున్నారు.

45
రానున్న రోజుల్లో వ‌ర్షాలు
Image Credit : Generated by google gemini AI

రానున్న రోజుల్లో వ‌ర్షాలు

శనివారం నుంచి మంగళవారం వరకు అంటే నవంబర్ 29 నుంచి డిసెంబర్ 2 వరకు కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మ‌రీముఖ్యంగా తూర్పు గోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళంలో వ‌ర్షాలు కురుస్తాయ‌ని అధికారులు తెలిపారు. నెల్లూరు, ఓంగోలు ప్రాంతాల్లో భారీ గాలులు 40–60 km/h వేగంతో వీచే అవకాశం ఉందని పేర్కొంది.

55
రైతులకు ముఖ్య సూచనలు
Image Credit : Generated by google gemini AI

రైతులకు ముఖ్య సూచనలు

రాబోయే రోజుల వాతావరణ పరిస్థితుల కారణంగా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సంస్థ సూచించింది. పంట కోతలు ముందుగానే పూర్తి చేయాల‌ని, ధాన్యం, పంటల్ని తడవకుండా సురక్షిత ప్రదేశాల్లో నిల్వ చేయాల‌ని సూచించారు. విద్యుత్ వ్యవస్థల వద్ద జాగ్ర‌త్త‌గా ఉండాలని.. ఎరువులు, పురుగు మందులు త‌డ‌వ‌కుండా నిల్వ చేసుకోవాల‌ని చెబుతున్నారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఆంధ్ర ప్రదేశ్
వాతావరణం

Latest Videos
Recommended Stories
Recommended image1
Business Ideas : తెలుగు మహిళలకు ఫ్రీగా రూ.50,000 .. పెట్టుబడి, సరుకులు ఉచితమే..!
Recommended image2
YS Sahil Reddy : ఎవరీ సాహిల్ రెడ్డి? పెళ్లికి జగన్, స్టాలిన్.. హీరోలు విజయ్, సూర్య హాజరయ్యేంత తోపా..?
Recommended image3
Weather Update : ఇవేం ఎండల్రా నాయనా..! ఇప్పుడే తెలంగాణలో 34, ఏపీలో 35 డీగ్రీల టెంపరేచర్
Related Stories
Recommended image1
100 ఎక‌రాల్లో అద్భుత‌మైన ఫామ్ హౌజ్‌.. ధ‌ర్మేంద్ర ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా.?
Recommended image2
ప్రపంచానికి తెలియని యోధుడు.. 26/11 దాడిలో 157 మందిని ర‌క్షించిన వీరుడి గురించి తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved