MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Hyderabad: ఇప్పుడే కొనేయండి.. హైద‌రాబాద్‌లోని ఈ ప్రాంతం మ‌రో మాదాపూర్ కావ‌డం ఖాయం

Hyderabad: ఇప్పుడే కొనేయండి.. హైద‌రాబాద్‌లోని ఈ ప్రాంతం మ‌రో మాదాపూర్ కావ‌డం ఖాయం

Hyderabad: దేశంలో అత్యంత వేగంగా రియ‌ల్ఎస్టేట్ పెరుగుతోన్న న‌గ‌రంలో హైద‌రాబాద్ ఒకటి. న‌గ‌రంలో ఎన్నో ప్రాంతాల రూపురేఖ‌లు మారిపోయాయి. కాగా న‌గ‌రంలోని మ‌రో ప్రాంతంలో అభివృద్ధి వేగంగా పరుగులు పెడుతోంది. ఇంత‌కీ ఆ ప్రాంతం ఏంటంటే.. 

2 Min read
Author : Narender Vaitla
Published : Dec 10 2025, 10:05 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
గ‌తంలో మాదాపూర్ ఇప్పుడు..
Image Credit : Generated by google gemini AI

గ‌తంలో మాదాపూర్ ఇప్పుడు..

ఒక 20 ఏళ్ల క్రితం మాదాపుర్ ఎలా ఉండేదో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఒక‌ప్పుడు శివారు ప్రాంతంగా ఉన్న మాదాపుర్ ఇప్పుడు సెంట‌ర్‌గా మారిపోయింది. ఐటీ సంస్థ‌ల రాక‌తో మాదాపూర్‌లో పెద్ద పెద్ద షోరూమ్‌లు, షాపింగ్ మాల్స్‌, ఆసుప‌త్రులు వ‌చ్చేశాయ్‌. ఐటీ హబ్‌కు దగ్గరగా ఉండటం, మెరుగైన రహదారుల కలయిక కావడం, కార్పొరేట్ ఆఫీసులు ఏర్పడటం వంటి అంశాలు ఆ ప్రాంతాన్ని ఆకస్మాత్తుగా హాట్‌స్పాట్‌గా మార్చాయి. ఇప్పుడు అదే నమూనా తెల్లాపూర్‌లో కూడా కనిపిస్తోంది. ఐటీ కారిడార్‌కు దగ్గరగా ఉండటం ఈ ప్రాంతానికి ప్రధాన ప్లస్ పాయింట్ గా మారింది.

25
గచ్చిబౌలి–ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు నేరుగా కనెక్టివిటీ
Image Credit : Getty

గచ్చిబౌలి–ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు నేరుగా కనెక్టివిటీ

తెల్లాపూర్ నుంచి గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్‌రామ్‌గూడ్ ఐటి కారిడార్‌ వరకు చేరుకోవడం చాలా సులువు కావడంతో ఉద్యోగుల దృష్టి ఈ ప్రాంతంపై పడింది. ORRకు ద‌గ్గ‌ర‌ల్లో ఉండ‌డం, మల్టీ-లేయర్ రోడ్ల నిర్మాణం, కొత్త ఫ్లైఓవర్లు, లింక్ రోడ్లు ఈ ప్రాంతాన్ని రియల్ ఎస్టేట్ మ్యాప్‌లో వేగంగా పైకి తీసుకెళ్తున్నాయి.

Related Articles

Related image1
Dream Meaning: క‌ల‌లో ఈ వ‌స్తువులు క‌నిపిస్తే.. శ‌ని దేవుడి ఆశీర్వాదం ఉన్న‌ట్లే, మీ సుడి తిర‌గ‌డం ఖాయం
Related image2
Hyderabad: ట్రాఫిక్ క‌ష్టాల‌కు చెక్‌.. హైద‌రాబాద్‌లో మ‌రో ఫ్లై ఓవ‌ర్‌, 6 లైన్ ఎక్స్‌ప్రెస్ వే
35
వేగంగా పెరుగుతోన్న ధ‌ర‌లు
Image Credit : Google Gemini AI

వేగంగా పెరుగుతోన్న ధ‌ర‌లు

ఇటీవల తెల్లాపూర్‌లో నివాస ప్రాజెక్టుల ధరలు భారీగా పెరిగాయి. అపార్ట్‌మెంట్ ప్లాట్లు రూ. 70 లక్షల నుంచి రూ. 2 కోట్లకు పైగా ప‌లుకుతున్నాయి. విల్లాలు/ఇండిపెండెంట్ హౌసుల విష‌యానికొస్తే రూ. 3 కోట్ల నుంచి రూ. 10 కోట్ల వ‌ర‌కు ఉంటున్నాయి. ప్రీమియమ్ గేటెడ్ కమ్యూనిటీలు, లగ్జరీ విల్లా ప్రాజెక్టులు ఇప్పటికే పెద్ద సంఖ్యలో రూపుదిద్దుకుంటున్నాయి. నాణ్యమైన నిర్మాణాలు, ఆధునిక సదుపాయాలు ఈ ప్రాంతాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చుతున్నాయి.

45
విద్యా సంస్థలు, ఆసుపత్రులు
Image Credit : Google Gemini AI

విద్యా సంస్థలు, ఆసుపత్రులు

తెల్లాపూర్‌లో పలు అంతర్జాతీయ పాఠశాలలు, ఇంజనీరింగ్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు సమీపంలో ఉన్నాయి. దీనితో పాటు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, షాపింగ్ జోన్‌లు, రెస్టారెంట్లు ప్రాంతంలో అభివృద్ధి చెందుతున్నాయి. కుటుంబాలతో స్థిర‌ప‌డాల‌నుకునే వారిని ఈ సదుపాయాలు మరింత ఆక‌ర్షిస్తున్నాయి.

55
కార్పొరేట్ ప్రాజెక్టుల ఎంట్రీ
Image Credit : Google Gemini AI

కార్పొరేట్ ప్రాజెక్టుల ఎంట్రీ

పలు రియల్ ఎస్టేట్ కంపెనీలు తెల్లాపూర్‌లో మల్టీ-ఎకర్ ప్రాజెక్టులను చేపడుతున్నాయి. హై–ఎండ్ కమ్యూనిటీలు, పెద్ద మిక్స్‌డ్-యూజ్ డెవలప్మెంట్స్, ప్రీమియమ్ లైఫ్‌స్టైల్ ప్రాజెక్టులు ఇప్పటికే కార్యరూపం దాల్చుతున్నాయి. ఈ పెట్టుబడులు భవిష్యత్తులో ప్రాంతాన్ని నగరంలో అత్యంత ప్రాధాన్యమైన నివాస జోన్‌గా మార్చే అవకాశం ఉంది. ఇప్ప‌టికే మైహోమ్ వంటి దిగ్గ‌జ డెవ‌ల‌ప‌ర్స్ తెల్లాపూర్‌లో భారీ ప్రాజెక్టుల‌ను చేపట్టాయి. ఎంఎంటీఎస్ అందుబాటులోకి రావ‌డం కూడా ఈ ప్రాంతానికి క‌లిసొచ్చింద‌ని చెప్పాలి.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
హైదరాబాద్
స్థిరాస్తి

Latest Videos
Recommended Stories
Recommended image1
IMD Weather Alert : అధికపీడనం ఎఫెక్ట్... ఈ తెలుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్
Recommended image2
Now Playing
Revanth Reddy Warangal Tour: వరంగల్ పర్యటనలో రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్| Asianet News Telugu
Recommended image3
Holiday: ఫిబ్ర‌వ‌రి 11న సెల‌వు.. స్కూళ్లు, కాలేజీలు, ప్రైవేట్ సంస్థ‌ల‌న్నీ బంద్‌. ఎందుకంటే.?
Related Stories
Recommended image1
Dream Meaning: క‌ల‌లో ఈ వ‌స్తువులు క‌నిపిస్తే.. శ‌ని దేవుడి ఆశీర్వాదం ఉన్న‌ట్లే, మీ సుడి తిర‌గ‌డం ఖాయం
Recommended image2
Hyderabad: ట్రాఫిక్ క‌ష్టాల‌కు చెక్‌.. హైద‌రాబాద్‌లో మ‌రో ఫ్లై ఓవ‌ర్‌, 6 లైన్ ఎక్స్‌ప్రెస్ వే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved