MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Hyderabad: ట్రాఫిక్ క‌ష్టాల‌కు చెక్‌.. హైద‌రాబాద్‌లో మ‌రో ఫ్లై ఓవ‌ర్‌, 6 లైన్ ఎక్స్‌ప్రెస్ వే

Hyderabad: ట్రాఫిక్ క‌ష్టాల‌కు చెక్‌.. హైద‌రాబాద్‌లో మ‌రో ఫ్లై ఓవ‌ర్‌, 6 లైన్ ఎక్స్‌ప్రెస్ వే

Hyderabad: హైద‌రాబాద్‌లో ట్రాఫిక్ స‌మ‌స్య‌లకు చెక్ పెట్టేందుకు ఎన్నో ఫ్లైఓవ‌ర్‌లు అందుబాటులోకి వ‌చ్చాయి. అయితే తాజాగా న‌గ‌రంలో మ‌రో కీల‌క ఫ్లైఓవ‌ర్ నిర్మాణం జ‌ర‌గ‌నుంది. కీలక ప్ర‌దేశంలో 6 లైన్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణం చేప‌ట్ట‌నున్నారు. 

1 Min read
Author : Narender Vaitla
Published : Dec 08 2025, 12:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ట్రాఫిక్ రద్దీకి శాశ్వత పరిష్కారం
Image Credit : Generated by google gemini AI

ట్రాఫిక్ రద్దీకి శాశ్వత పరిష్కారం

హైదరాబాద్‌లో ముఖ్యంగా బంజారాహిల్స్, ఫిలింనగర్, కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో ప్రతిరోజూ భారీగా ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి. ఈ సమస్యను తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వచ్చింది. సైబరాబాద్ ఐటీ కారిడార్‌తో నేరుగా అనుసంధానించే కొత్త 6-లైన్ల ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణాన్ని ప్ర‌యారిటీగా పెట్టుకున్నారు.

25
బంజారాహిల్స్–గచ్చిబౌలి మధ్య
Image Credit : our own

బంజారాహిల్స్–గచ్చిబౌలి మధ్య

కొత్త ఎక్స్‌ప్రెస్ వే బంజారాహిల్స్ రోడ్ నం.12 నుంచి గచ్చిబౌలి శిల్పా లేఅవుట్ వరకు సుమారు 10 కిలోమీటర్ల మేర విస్తరించనుంది. ఇది పూర్తయ్యాక పీవీ ఎక్స్‌ప్రెస్ వే తరహాలో, ఏ ఆటంకాలు లేకుండా నేరుగా వేగంగా ప్రయాణించే అవకాశం లభిస్తుంది. ప్రధానంగా ఐటీ ఉద్యోగులకు ఇది గొప్ప ఉపశమనం కానుంది. దీంతో ORR నుంచి సిటీ మిడిల్‌కు మ‌రింత సుల‌భంగా చేరుకోవ‌చ్చు.

Related Articles

Related image1
Business Idea: మీ బిల్డింగ్‌పై ఖాళీ స్థ‌లం ఉందా.? మీరు ల‌క్షాధికారులు కావ‌డం ఖాయం
Related image2
Chanakya Niti: పెళ్లికి సిద్ధ‌మ‌వుతున్నారా.? ఇలాంటి మ‌హిళ‌ల‌కు దూరంగా ఉండ‌డ‌మే మంచిది
35
స్టీల్ బ్రిడ్జ్, అండర్‌పాస్‌లతో ఆధునిక నిర్మాణం
Image Credit : our own

స్టీల్ బ్రిడ్జ్, అండర్‌పాస్‌లతో ఆధునిక నిర్మాణం

ఈ మార్గంలో దాదాపు ఆరేడు కిలోమీటర్ల పాటు స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం ప్రతిపాదించారు. ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అండర్‌పాస్‌లను ఏర్పాటు చేయాలని అధికారులు పరిశీలిస్తున్నారు. రహదారి నిర్మాణంలో ఎక్కడ ఫ్లైఓవర్ అవసరం, ఎక్కడ రోడ్డు వెడ‌ల్పు సాధ్యం వంటి అంశాలపై క్షుణ్ణంగా అధ్యయనం జరుగుతోంది.

45
ఏయే ప్రాంతాల మీదుగా వెళ్లనుంది.?
Image Credit : English Media

ఏయే ప్రాంతాల మీదుగా వెళ్లనుంది.?

ఈ కొత్త మార్గం ద్వారా బంజారాహిల్స్ రోడ్ నం.12, ఫిలింనగర్, జడ్జిస్ కాలనీ, దుర్గంచెరువు, టీ హబ్, గచ్చిబౌలి చౌరస్తా, శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ క‌వ‌ర్ అవుతాయి. ఈ లింకింగ్‌తో కోర్ సిటీ నుంచి ఐటీ హబ్‌కు ఎలాంటి గంద‌ర‌గోళం లేకుండా ప్ర‌యాణించ‌వ‌చ్చు.

55
త్వరలోనే డీపీఆర్
Image Credit : our own

త్వరలోనే డీపీఆర్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు HMDA ఈ ప్రాజెక్టును ప్రయారిటీగా తీసుకుంది. ప్రత్యేక కన్సల్టెన్సీ సంస్థ ఇప్పటికే సర్వే పనులు చేపట్టింది. రోడ్ల పరిస్థితి, భూసేకరణ అవసరం, డిజైన్ మార్పులు వంటి అంశాలపై వారి బృందం క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తోంది. త్వరలోనే పూర్తి స్థాయి DPR (Detailed Project Report) ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉంది. ఈ ఎక్స్‌ప్రెస్ వే పూర్తయితే, హైదరాబాద్ రోడ్డు వ్యవస్థలో ఇది ఒక కొత్త మైలురాయిగా నిలుస్తుంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
హైదరాబాద్
తెలంగాణ

Latest Videos
Recommended Stories
Recommended image1
DA Hike : ఉద్యోగులకు పండగ ముందే అదిరిపోయే గిఫ్ట్.. జీతాలు పెరగనున్నాయ్
Recommended image2
Income Tax : కొత్త ఆదాయపు పన్ను చట్టం.. మీకు కలిగే లాభాలివే
Recommended image3
Condoms: కండోమ్‌ల వాడకం మామూలుగా లేదుగా, ఆ దేశమే టాప్.. మనదేశం కూడా తక్కువేమీ కాదు
Related Stories
Recommended image1
Business Idea: మీ బిల్డింగ్‌పై ఖాళీ స్థ‌లం ఉందా.? మీరు ల‌క్షాధికారులు కావ‌డం ఖాయం
Recommended image2
Chanakya Niti: పెళ్లికి సిద్ధ‌మ‌వుతున్నారా.? ఇలాంటి మ‌హిళ‌ల‌కు దూరంగా ఉండ‌డ‌మే మంచిది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved