MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Adulterated Liquor: బయటకే కాస్ట్ లీ బ్రాండెడ్ సీసాలు లోపల మాత్రం విషం.. మద్యం బాబులకు షాకింగ్ న్యూస్

Adulterated Liquor: బయటకే కాస్ట్ లీ బ్రాండెడ్ సీసాలు లోపల మాత్రం విషం.. మద్యం బాబులకు షాకింగ్ న్యూస్

మ‌ద్యపానం ఆరోగ్యానికి హానిక‌రం అని తెలిసినా మందు బాబులు మాత్రం ఆ అల‌వాటును మానుకోరు. పైగా కాస్లీ మ‌ద్యం తాగుతున్నాం మాకేంటి అన్న భావ‌న‌లో ఉంటారు. అయితే తాజాగా వెలుగులోకి వ‌చ్చిన ఓ విష‌యం తెలిస్తే ద‌డుసుకోవాల్సిందే. 

2 Min read
Author : Narender Vaitla
| Updated : Jul 22 2025, 03:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఒరిజిన‌ల్ సీసాలో నకిలీ మద్యం
Image Credit : Meta Ai

ఒరిజిన‌ల్ సీసాలో నకిలీ మద్యం

ఎక్కువ ధ‌ర‌కు ల‌భించే బ్రాండ్స్ మ‌ద్యాన్ని చాలా మంది ఇష్టంగా తాగుతుంటారు. అందులోనూ కాస్లీ మ‌ద్యం తాగితే ఆరోగ్యంపై ప్ర‌భావం త‌క్కువ‌గా ప‌డుతుంద‌ని భావిస్తుంటారు. ఇదిగో దీనినే కొంద‌రు కేటుగాళ్లు త‌మ దందాకు వాడుకున్నారు. 

సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం రామాపురంలోని గోదాంలో పెద్దఎత్తున నకిలీ మద్యం తయారీ జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. మంచి, మంచి బ్రాండెడ్‌ ఖాళీ బాటిళ్లు సేకరించి వాటిలో నీళ్లు, స్పిరిట్, కొంత మద్యం కలిపి మళ్లీ సీల్ వేసి అమ్ముతున్నారు. బయటకి చూస్తే అసలైన సీసాలే.. కానీ లోపల మాత్రం విషంతో స‌మాన‌మైన మ‌ద్యం ఉంటుంది.

25
ఏకంగా 178 బ్రాండ్ల మద్యం కల్తీ
Image Credit : Getty

ఏకంగా 178 బ్రాండ్ల మద్యం కల్తీ

ఈ ముఠా తయారు చేసిన నకిలీ మద్యం బ్రాండ్ల సంఖ్య తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఏకంగా 178 బ్రాండ్ల మద్యం కల్తీ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. మందుబాబులు ఎక్కువగా వాడే ప్రముఖ బ్రాండ్లను టార్గెట్ చేయడంతో తేడా తెలియకుండా మద్యం విక్రయం జరిగింది. కేవలం కొన్ని సీసాలే కాదు.. ఖాళీ బాటిళ్లు, లేబుళ్లు, మూతలతో సహా అన్నీ సరిగా రూపొందించి మార్కెట్లోకి పంపేందుకు సిద్ధంగా ఉంచారు.

Related Articles

Related image1
Gold Price: ఇలా అయితే ఎలా "బంగారం".. మ‌ళ్లీ ల‌క్ష మార్క్ దాటేసిన గోల్డ్ ప్రైజ్
Related image2
School Holiday: స్కూళ్లు న‌డిచేది ఇవాళ ఒక్క‌రోజే, మ‌ళ్లీ రేపు సెల‌వు.. బుధ‌వారం ఎందుకంటే.?
35
రెండు కోట్ల విలువైన స్పిరిట్, 11 వేల ఖాళీ బాటిళ్లు స్వాధీనం
Image Credit : Getty

రెండు కోట్ల విలువైన స్పిరిట్, 11 వేల ఖాళీ బాటిళ్లు స్వాధీనం

పోలీసుల దాడుల్లో దాదాపు రూ. 15 లక్షల విలువైన కల్తీ మద్యం స్వాధీనం చేశారు. అదికాక, తయారీకి ఉపయోగించే రూ. 2 కోట్ల విలువైన స్పిరిట్ కూడా పట్టుబడింది. అలాగే 11,000 ఖాళీ సీసాలు, 20 బండిల్స్ లేబుళ్లు, నకిలీ సీలు, బాటిల్ కాప్స్ వంటివ‌న్నీ పోలీసులకు చిక్కాయి.

45
హైదరాబాద్ స్పిరిట్ కంపెనీ నుంచి సరఫరా
Image Credit : Getty

హైదరాబాద్ స్పిరిట్ కంపెనీ నుంచి సరఫరా

ఈ ముఠా హైదరాబాద్‌లోని కృష్ణపద్మ అనే స్పిరిట్ కంపెనీ నుంచి భారీగా స్పిరిట్ కొనుగోలు చేశారు. అనంతరం తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని ఓ రైస్ మిల్లులోకి తరలించి, అక్కడ నకిలీ మద్యం తయారు చేస్తున్నారు. ఈ మద్యం గతంలో ఏపీ రాష్ట్రంలోని మార్కాపురం, రేపల్లె, అమలాపురం లాంటి చోట్ల విక్రయించిన రికార్డులు కూడా బయటపడ్డాయి.

55
ముఠాలో స్థానికులు కూడా..
Image Credit : CNBC

ముఠాలో స్థానికులు కూడా..

ఈ ముఠాలో మేళ్లచెరువు మండల కేంద్రానికి చెందిన శంకర్ అనే వ్యక్తితో పాటు మరికొందరు స్థానికులు కీలక పాత్ర పోషించినట్టు పోలీసులు వెల్లడించారు. క‌చ్చితమైన సమాచారం మేరకు దాడులు చేసి ఇద్దరిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్నవారికోసం గాలింపు కొనసాగుతోంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
హైదరాబాద్
తెలంగాణ

Latest Videos
Recommended Stories
Recommended image1
Holidays : తెలుగు ప్రేమికులకు పండగే.. లవర్స్ డే కు వరుసగా మూడ్రోజుల సెలవులు
Recommended image2
Weather Update : ఇది చలికాలమా లేక వేసవి కాలమా..? తెలుగు రాష్ట్రాల్లో వెదర్ తేడాగా ఉందే..!
Recommended image3
IMD Weather Alert : అధికపీడనం ఎఫెక్ట్... ఈ తెలుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్
Related Stories
Recommended image1
Gold Price: ఇలా అయితే ఎలా "బంగారం".. మ‌ళ్లీ ల‌క్ష మార్క్ దాటేసిన గోల్డ్ ప్రైజ్
Recommended image2
School Holiday: స్కూళ్లు న‌డిచేది ఇవాళ ఒక్క‌రోజే, మ‌ళ్లీ రేపు సెల‌వు.. బుధ‌వారం ఎందుకంటే.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved