MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Movie Reviews
  • వెంకటేష్ తన కెరీర్ లో చేసిన రెండు బ్లండర్ మిస్టేక్స్.. ఈ సినిమాలు రిజెక్ట్ చేయకుంటే ఆయనది పాన్ ఇండియా రేంజ్

వెంకటేష్ తన కెరీర్ లో చేసిన రెండు బ్లండర్ మిస్టేక్స్.. ఈ సినిమాలు రిజెక్ట్ చేయకుంటే ఆయనది పాన్ ఇండియా రేంజ్

విక్టరీ వెంకటేష్ తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించారు. కానీ వెంకీ వదులుకున్న సూపర్ హిట్ మూవీస్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ రెండు చిత్రాలని మాత్రం వెంకీ రిజెక్ట్ చేసి తప్పు చేశారు అని ఫ్యాన్స్ అంటున్నారు. ఆ సినిమాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Nov 01 2025, 07:24 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
వెంకటేష్ రిజెక్ట్ చేసిన చిత్రాలు
Image Credit : Asianet News

వెంకటేష్ రిజెక్ట్ చేసిన చిత్రాలు

వెంకటేష్ ఎక్కువగా కుటుంబ కథా చిత్రాలు చేస్తున్నారు కానీ.. వాస్తవానికి వెంకీ ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోయే నటుడు. వెంకటేష్ తన కెరీర్ లో లవ్, యాక్షన్, కామెడీ, సెంటిమెంట్ ఇలా అన్ని జోనర్స్ లో సినిమాలు చేశారు. కాకపోతే ఫ్యామిలీ సెంటిమెంట్ ఉన్న సినిమాలు ఎక్కువగా ఉన్నాయి. వెంకటేష్ తన కెరీర్ లో కొన్ని అద్భుతమైన సినిమాలని చేజేతులుగా వదులుకున్నారు. ముఖ్యంగా రెండు సినిమాలని వదిలేసి పెద్ద తప్పు చేశారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

26
సంతోషం
Image Credit : our own

సంతోషం

నాగార్జున కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన సంతోషం మూవీ ఆఫర్ ముందుగా వెంకటేష్ కి వచ్చింది. దశరథ్ ఈ కథని వెంకటేష్ కి చెప్పారు. అయితే భార్య చనిపోవడం.. ఆ తర్వాత మరో పెళ్లి లాంటి కథాంశాలతో టాలీవుడ్ లో బోలెడన్ని చిత్రాలు వచ్చాయి. దీనితో వెంకటేష్ ఈ మూవీని రిజెక్ట్ చేశారు. ఇదే కథ నాగార్జున వద్దకు వెళ్ళింది. రిజల్ట్ ఏంటో అందరికీ తెలిసిందే.

Related Articles

Related image1
ఘనంగా అల్లు శిరీష్, నయనిక నిశ్చితార్థం.. మెగా, అల్లు ఫ్యామిలీల సందడి మధ్య వేడుక.. ఫోటోస్ ఇవిగో
Related image2
ఆ సినిమా చేసినందుకు ఏడాదిపాటు ఏడ్చిన అనుష్క శెట్టి..అంతకంటే దారుణమైన మూవీ ఉంది కానీ
36
రోజా
Image Credit : Google

రోజా

ఇండియన్ సినిమాలో ఆల్ టైం క్లాసిక్ మూవీస్ లో మణిరత్నం తెరకెక్కించిన రోజా ఒకటి. అసలు ఈ చిత్రాన్ని వెంకీ ఎలా వదులుకున్నారో ఎవ్వరికీ అర్థం కాదు. రోజా మూవీ కోసం మణిరత్నం ముందుగా వెంకటేష్ ని హీరోగా అనుకున్నారు. వెంకీని సంప్రదించి కథ కూడా చెప్పారు. కశ్మీర్, టెర్రరిస్టులు, ఆర్మీ ఇలాంటి అంశాలు కథలో ఉండడంతో వెంకీకి ఈ చిత్రం ఎక్కలేదు. దీనితో వెంకీ రోజా మూవీపై ఆసక్తి చూపలేదు. దీనితో మణిరత్నం అరవింద్ స్వామిని హీరోగా ఎంచుకున్నారు. అరవింద్ స్వామి కెరీర్ ని ఈ చిత్రం పూర్తిగా మార్చేసింది. రోజాకి బదులుగా వెంకీ ఆ సమయంలో చంటి చిత్రాన్ని ఎంచుకున్నారు. రోజా మూవీని వెంకటేష్ చేసి ఉంటే అప్పట్లోనే ఆయనకి పాన్ ఇండియా క్రేజ్ దక్కేది.

46
ఒకే ఒక్కడు
Image Credit : Aha

ఒకే ఒక్కడు

పాన్ ఇండియా రేంజ్ లో వెలిగిపోయే అవకాశాన్ని మరోసారి వెంకీ చేజార్చుకున్నారు. డైరెక్టర్ శంకర్ సంచలన చిత్రం ఒకే ఒక్కడు చిత్రంలో నటించే ఛాన్స్ వెంకీకి ముందుగా వచ్చింది. తనకి ఈ పొలిటికల్ డ్రామా సెట్ కాదని వెంకీ రిజెక్ట్ చేశారు. రజనీకాంత్ కూడా ఈ కథని వద్దనుకున్నారు. మొత్తంగా ఒకే ఒక్కడు మూవీ అర్జున్ కి మాత్రమే రాసిపెట్టి ఉంది. వన్ డే సీఎం గా అర్జున్ ఈ చిత్రంలో విశ్వరూపం ప్రదర్శించిన సంగతి తెలిసిందే.

56
క్రాక్
Image Credit : our own

క్రాక్

డైరెక్టర్ గోపీచంద్ మలినేని బాలయ్యని దృష్టిలో పెట్టుకుని క్రాక్ కథ రెడీ చేశారు. కానీ బాలయ్య ఈ చిత్రాన్ని అంగీకరించలేదు. ఆ తర్వాత వెంకటేష్ కి గోపీచంద్ మలినేని కథ వినిపించారు. ఎందుకో వెంకీకి కూడా క్రాక్ స్టోరీ ఎక్కలేదు. ఫైనల్ గా ఈ చిత్రాన్ని రవితేజ చేసి సూపర్ హిట్ అందుకున్నారు.

66
కృష్ణం వందే జగద్గురుమ్
Image Credit : Asianet News

కృష్ణం వందే జగద్గురుమ్

దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఈ చిత్ర కథని వెంకటేష్ కోసమే సిద్ధం చేసుకున్నారు. కానీ వెంకటేష్ తనకి ఈ కథ సెట్ కాదని రిజెక్ట్ చేశారు. బాబాయ్ రిజెక్ట్ చేసిన సినిమా అబ్బాయి రానా చేతుల్లోకి వెళ్ళింది. ఈ మూవీలో రానా నటనకి ప్రశంసలు దక్కాయి.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Barabar Premistha Review: `బరాబర్‌ ప్రేమిస్తా` మూవీ రివ్యూ, రేటింగ్‌.. యాటిట్యూడ్‌ స్టార్‌ సినిమా ఎలా ఉందంటే?
Recommended image2
Sri Chidambaram Garu Review: `శ్రీ చిదంబరం గారు` మూవీ రివ్యూ.. మెల్ల కన్ను వెనుక ఇంత కథ ఉందా?
Recommended image3
Euphoria Movie Review: యుఫోరియా మూవీ రివ్యూ.. భూమిక, గుణశేఖర్‌ మూవీని వీళ్లు తప్పక చూడాలి
Related Stories
Recommended image1
ఘనంగా అల్లు శిరీష్, నయనిక నిశ్చితార్థం.. మెగా, అల్లు ఫ్యామిలీల సందడి మధ్య వేడుక.. ఫోటోస్ ఇవిగో
Recommended image2
ఆ సినిమా చేసినందుకు ఏడాదిపాటు ఏడ్చిన అనుష్క శెట్టి..అంతకంటే దారుణమైన మూవీ ఉంది కానీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved