MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Movie Reviews
  • Thimmarajupalli TV Review: తిమ్మరాజుపల్లి టీవీ మూవీ రివ్యూ.. కిరణ్‌ అబ్బవరం నిర్మించిన సినిమా ఎలా ఉందంటే?

Thimmarajupalli TV Review: తిమ్మరాజుపల్లి టీవీ మూవీ రివ్యూ.. కిరణ్‌ అబ్బవరం నిర్మించిన సినిమా ఎలా ఉందంటే?

Thimmarajupalli TV Review: హీరో కిరణ్‌ అబ్బవరం నిర్మాతగా మారి నిర్మించిన లేటెస్ట్ మూవీ `తిమ్మరాజుపల్లి టీవీ`. నేడు విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

4 Min read
Author : Aithagoni Raju
Published : Apr 17 2026, 02:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
తిమ్మరాజుపల్లి టీవీ మూవీ రివ్యూ
Image Credit : Asianet News

తిమ్మరాజుపల్లి టీవీ మూవీ రివ్యూ

హీరో కిరణ్‌ అబ్బవరం నిర్మాతగా మారి తన కేఏ ప్రొడక్షన్స్ పతాకంపై తాజాగా `తిమ్మరాజుపల్లి టీవీ` మూవీని నిర్మించారు. తేజ వేల్పుచర్ల సహ నిర్మాత. ఇందులో సాయి తేజ, వేద జలంధర్‌ జంటగా నటించగా, ప్రదీప్‌, లతీష్‌ కీలక పాత్రలు పోషించారు. వి మునిరాజు దర్శకుడిగా పరిచయం అవుతూ రూపొందించిన ఈ చిత్రం నేడు శుక్రవారం(ఏప్రిల్‌ 17న) విడుదలైంది. విలేజ్‌ బ్యాక్‌ డ్రాప్‌ లో పీరియడ్‌ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం ఆడియెన్స్ ని ఆకట్టుకుందా? టీవీ కోసం గొడవ మెప్పించిందా? నిర్మాతగా కిరణ్‌ అబ్బవరం సక్సెస్‌ అయ్యాడా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.

26
తిమ్మరాజుపల్లి టీవీ మూవీ కథ
Image Credit : Asianet News

తిమ్మరాజుపల్లి టీవీ మూవీ కథ

తిమ్మరాజుపల్లిలో ప్రతి పండక్కి కుప్పం టౌన్‌ నుంచి కొత్తగా వచ్చిన సినిమాలు తీసుకొచ్చి టీవీల్లో ప్రదర్శిస్తుంటారు. ఈ పని సతీష్‌(సాయి తేజ) చేస్తుంటాడు. ఆయన రాజప్ప(ప్రదీప్‌) చెల్లి శారద(వేద జలందర్‌)ని ప్రేమిస్తుంటాడు. ఆమె కోసం ఇదంతా చేస్తుంటాడు. రామచంద్రయ్య ఊరు పెద్ద. ఊర్లో ఏం చేసినా తానే మొదట చేయాలని అనుకుంటారు. కానీ ఆయనకు షాకిస్తూ రాజప్ప పెళ్లైన వెంటనే కొత్తగా  టీవీ కొంటాడు. డిష్‌ టీవీ పెట్టిస్తాడు. ఇది చూసి రామచంద్రయ్య తట్టుకోలేకపోతాడు. ఊర్లో వారంతా రోజూ తన ఇంటికి టీవీ చూడ్డానికి వస్తుండటంతో రాజప్ప, తన భార్య ఎల్లమ్మతో సరిగా ఉండలేకపోతాడు. కాపురం చేసుకోవడానికి కూడా కుదరదు. దీంతో ఫ్రస్టేట్‌ అవుతుంటాడు. సతీష్‌ తన కూతురు కోసం ఇంటికి వస్తున్నాడని చెప్పి రాజప్ప తండ్రి గొడవ చేస్తాడు. ఈ క్రమంలో రాజప్పకి, సతీష్‌ కి మధ్య గొడవ అవుతుంది.  తాను టీవీ సంగతి చూస్తానని సవాల్‌ విసురుతాడు సతీష్‌. ఆ రోజు రాత్రి బాగా వర్షం పడుతుంది. తేల్లారి చూసే సరికి టీవీ ఉండదు. దీంతో అంతా సతీష్‌ దొంగతనం చేశారని నమ్ముతారు. ఊరు పెద్దలు కూడా కొంత గడువు ఇచ్చి ఆ లోపు టీవీ తీసుకురావాలని, లేదంటే గుండుగీసి ఊరంతా తిప్పిస్తామని తీర్మానిస్తారు. మరి ఆ టీవీ దొంగతనం చేసింది ఎవరు? తన ప్రియురాలుని దక్కించుకునేందుకు సతీష్‌ ఏం చేశాడు? టీవీని తీసుకొచ్చాడా? ఇందులో ఊరు పెద్ద పాత్రేంటి? రాజప్ప భార్య ఎల్లమ్మ ఇచ్చిన ట్విస్టేంటి? అనేది మిగిలిన సినిమా.

Related Articles

Related image1
Papam Prathap Review: `పాపం ప్రతాప్‌` మూవీ రివ్యూ, తిరువీర్‌ సినిమా నవ్వించిందా?
Related image2
Pallichattambi Movie Review: పళ్లిచట్టంబి మూవీ రివ్యూ, టోవినో థామస్‌, కయాదు లోహర్‌ సినిమా ఎలా ఉందంటే?
36
తిమ్మరాజుపల్లి టీవీ మూవీ ఎలా ఉందంటే?
Image Credit : Asianet News

తిమ్మరాజుపల్లి టీవీ మూవీ ఎలా ఉందంటే?

1980-90లో పల్లెల్లో టీవీ ఉండేది కాదు, ఊర్లో ఒక్క టీవీ ఉంటే, అంతా ఆ ఇంట్లోనే ఉండేవారు. ఆ సమయంలో కుర్రాళ్ల బాధలు వర్ణణాతీతం. ఉన్న ఒక్క టీవీకి అతుక్కుపోయేవారు. ఆ టీవీ చూస్తూనే ప్రేమ కథలు నడిపించేవారు. అదొక స్వీట్‌ మెమొరీస్‌. గ్రామాల్లో పెరిగిన ప్రతి ఒక్క అబ్బాయి, అమ్మాయి ఇలాంటి అనుభావాలు ఫేస్‌ చేసి ఉంటారు. అలాంటి కథతోనే `తిమ్మరాజుపల్లి టీవీ` మూవీని రూపొందించారు. దర్శకుడు మునిరాజు తన గ్రామంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు, తాను చూసిన సంఘటనల ఆధారంగా చేసుకుని  అంతే సహజంగా రూపొందించారు. నేటివిటీతోపాటు, మనుషులు, వారి మనస్తత్వాలు, టీవీ కోసం గొడవలు, వారి ఇన్నోసెంట్‌ని, తాము నెగ్గడం కోసం చేసే ప్రయత్నాలు, ఆ సమయంలో ప్రేమ కథలు నడిపించే తీరు, ఊర్లో ఉండే పరిస్థితులు ఇలా ప్రతిదీ చాలా నేచురల్‌గా ఉంది. మళ్లీ ఆ రోజుల్లోకి వెళ్లినట్టుగా ఉంది. సినిమా చూస్తున్నంత సేపు 30ఏళ్లు బ్యాక్‌వెళ్లొచ్చినట్టుగా ఉంది. ఆ మధుర జ్ఞాపకాలను నెమరేసుకున్నట్టుగా ఉంది. అయితే సినిమా మొత్తం టీవీ చుట్టూనే తిరుగుతుంది. ఆ ఊర్లో ఊరి పెద్దకి అదొక ప్రస్టీజియస్‌ విషయం. అందుకోసం ఆయన పడే తపన, టీవీ తీసుకొచ్చాననే గొప్పకు రాజప్ప పాత్ర పోవడం, అది కాస్త తన కాపురం చేసుకోవడానికి కూడా ఇబ్బందిగా మారడం, ఊర్లో హీరోహీరోయిన్ల మధ్య ప్రేమ కథ నడవడం, దాన్ని ఇతర పోరగాళ్లు కామెంట్‌ చేయడం, చిన్న చిన్న గొడవలు, సవాళ్లు ఇలా ఆద్యంతం కట్టిపడేసేలా, అలరించేలా సాగుతుంది. 

సినిమా కొంత సేపు ఫన్నీగా వెళ్తుంది, మరికొంత సేపు లవ్‌ ట్రాక్‌ వైపు తీసుకుంటుంది. మరికొంత సేపు సీరియస్‌గా మారుతుంది, అప్పుడే ఎమోషనల్‌ సైడ్‌ వెళ్తుంది. ఇలా అన్ని భావోద్వేగాల మేళవింపుగా ఉంటుంది. విలేజ్‌ కామెడీ, ఎమోషనల్‌, ఫ్యామిలీ డ్రామాగా సినిమా సాగిన తీరు బాగుంది. టీవీ పోయినంత వరకు ఎంగేజింగ్‌గా వెళ్తుంది. ఆ తర్వాత టీవీ కొట్టిసిందే ఎవరనేది, ఊర్లో గొడవలు సినిమాని సీరియస్‌గా, యాక్షన్‌ సైడ్‌కి మార్చేస్తాయి. టీవీ కోసం హీరో పడే తపన, తన ప్రేమని తగ్గించుకోవడం వంటి సీన్లు అంతే నేచురల్‌గా ఉండి, అలరిస్తాయి. దొంగగా ముద్ర పడ్డ సతీష్‌ తన నిజాయితీని నిరూపించుకునే ప్రయత్నం ఎంగేజింగ్‌గా సాగుతుంది. అలాగే క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ అదిరిపోయింది. ఎవరూ ఊహించరు. ఇలా సస్పెన్స్, యాక్షన్‌, ట్విస్ట్ లు సినిమాకి ప్లస్‌ అయ్యాయి. అయితే ఎమోషనల్‌ సైడ్‌ డెప్త్ తగ్గింది. లవ్‌ ట్రాక్‌ కూడా ఇంకా బాగా చూపించాల్సింది. టీవీ దొంగ ఎవరు అని తేలే సీన్లపై ఇంకా బాగా వర్క్ చేయాల్సింది. డ్రామా కూడా లైటర్ వేలో ఉంటుంది. సినిమా స్లోగా సాగుతుంది. మరీ డిటెయిలింగ్‌గా చూపించే క్రమంలో సీన్లు లెన్తీగా అనిపిస్తాయి. బీజీఎం సినిమాకి పెద్ద అసెట్‌. అదే మూవీని మరో స్థాయికి తీసుకెళ్తుంది. ఓవరాల్‌గా మూవీ ఒక ఫ్రెష్‌ ఫీలింగ్‌నిస్తుందని చెప్పొచ్చు.

46
తిమ్మరాజుపల్లి టీవీ మూవీలో ఆర్టిస్ట్ ల నటన
Image Credit : Asianet News

తిమ్మరాజుపల్లి టీవీ మూవీలో ఆర్టిస్ట్ ల నటన

ఇందులో చాలా వరకు కొత్త నటీనటులే కనిపిస్తారు. పెద్దవాళ్లు కొందరు తప్ప మిగిలిన వారంతా కొత్తవాళ్లే. సతీష్‌గా సాయితేజ చాలా నేచురల్‌గా నటించి మెప్పించాడు. కోపం, ఆవేశం, ప్రేమ కోసం తపించే వ్యక్తిగా ఆకట్టుకున్నాడు.  ఇక రాజప్పగా ప్రదీప్‌ ఇరగదీశాడు. పాత్రలో జీవించాడు. ఆ పాత్రని చేసింది కుర్రాడే అయినా అద్భుతంగా చేశాడు. సెటిల్డ్ గా చేసి మెప్పించాడు. శారద పాత్రలో వేద జలందర్‌ అదరగొట్టింది. తెలంగాణ అమ్మాయి అయినా రాయలసీమ అమ్మాయిగా బాగా చేసింది. యాస పరంగానూ ఆకట్టుకుంది. నటిగానూ నిరూపించుకుంది. సిద్ధప్పగా లతీష్‌ నెగటివ్‌ షేడ్‌ ఉన్న పాత్రలో మెప్పించాడు. అతనికి మంచి రోల్‌ పడింది. అలాగే ఊరి పెద్ద రామచంద్రయ్యగా అమ్మ రమేష్‌ అంతే సహజంగా నటించి మెప్పించాడు. తన పాత్రలోని వేరియేషన్స్ ఆకట్టుకుంటాయి. ఎల్లమ్మగా స్వాతి కరిమిరెడ్డి ఉన్నంతసేపు ఆకట్టుకుంది. ఆమె పాత్ర ట్విస్ట్ అలరిస్తుంది. టీవీ కుమార్‌గా తేజ విహాన్‌ కి మంచి రోల్‌ పడింది. సల్లాపురిగా సత్యనారాయణ ఉన్నంతసేపు మెప్పించాడు. కీరన్నగా కె ఎల్‌ మదన్‌, ఇలా మిగిలిన ఆర్టిస్ట్ లంతా అంతే సహజంగా నటించి సినిమాకి ప్రాణం పోశారు.

56
తిమ్మరాజుపల్లి టీవీ మూవీలో టెక్నీకల్‌గా ఇవి స్ట్రాంగ్‌
Image Credit : Asianet News

తిమ్మరాజుపల్లి టీవీ మూవీలో టెక్నీకల్‌గా ఇవి స్ట్రాంగ్‌

సినిమాకి పెద్ద అసెట్‌ అంటే మ్యూజిక్‌. వంశీకాంత్‌ రేఖన పాటలు అదిరిపోయాయి. ఆర్‌ఆర్‌ ఇరగదీశాడు. చాలా కొత్తగా, ఫ్రెష్‌గా ఉంది. సినిమాకి ఒక ఫ్రెష్‌ ఫీలింగ్‌ని తీసుకొచ్చింది. చాలా సీన్లని ఆర్‌ఆర్‌ మరో స్థాయికి తీసుకెళ్లిందని చెప్పొచ్చు. ఆయనకు మంచి ఫ్యూచర్‌ ఉంటుంది. అక్షయ్‌ రామ్‌ పొదిశెట్టి కెమెరా వర్క్ సైతం బాగుంది. విజువల్‌గా కనువిందు చేస్తుంది. ఆర్ట్ వర్క్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఎడిటింగ్‌ పరంగా ఇంకాస్త ట్రిమ్‌ చేయోచ్చు. ఇక దర్శకుడు మునిరాజు మంచి కథని ఎంచుకోవడంతోపాటు, దాన్ని అంతే బాగా తెరపై ఆవిష్కరించడంలో సక్సెస్‌ అయ్యాడు. చాలా నేచురల్‌గా తెరకెక్కించారు. లవ్‌, ఎమోషన్స్, డ్రామా, యాక్షన్‌, పాత్రల మధ్య సంఘర్షణ ఇలా ప్రతి విషయంలోనూ చాలా కేర్‌ తీసుకున్నాడు, చాలా డిటెయిలింగ్‌ని పాటించి మెప్పించాడు. సహజత్వం పరంగా ఎక్కడా తగ్గలేదు. అదే ఈమూవీ సక్సెస్‌గా చెప్పొచ్చు. ఫన్‌ని కూడా పండించిన తీరు బాగుంది. ఫైనల్‌గా ట్విస్ట్ లు, టర్న్ లతో కథని నడిపించిన తీరు ఆకట్టుకుంది. దర్శకుడిగా ఆయనకు మంచి ఫ్యూచర్‌ ఉంది. నిర్మాణ విలువలకు కొదవ లేదు. కిరణ్‌ అబ్బవరం రాజీపడకుండా నిర్మించారు. టీమ్‌కి అండగా నిలిచాడని ప్రతి ఫ్రేమ్‌లోనూ తెలుస్తోంది.

66
ఫైనల్‌గా..
Image Credit : Asianet News

ఫైనల్‌గా..

 తిమ్మరాజుపల్లి టీవీ ఒక ఫ్రెష్‌ అటెంప్ట్. మళ్లీ పాత రోజుల్లోకి తీసుకెళ్లి,  నవ్వించి, అలరించే మూవీ. మంచి అనుభూతిని పంచుతుంది. 90కిడ్స్ కి బాగా నచ్చుతుంది.

రేటింగ్‌ 3

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
సినిమా సమీక్షలు
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Pochamma OTT Review: పోచమ్మ వెబ్‌ సిరీస్‌ రివ్యూ.. ఆహా ఓటీటీ థ్రిల్లర్‌ ఎలా ఉందంటే?
Recommended image2
Pallichattambi Movie Review: పళ్లిచట్టంబి మూవీ రివ్యూ, టోవినో థామస్‌, కయాదు లోహర్‌ సినిమా ఎలా ఉందంటే?
Recommended image3
Papam Prathap Review: `పాపం ప్రతాప్‌` మూవీ రివ్యూ, తిరువీర్‌ సినిమా నవ్వించిందా?
Related Stories
Recommended image1
Papam Prathap Review: `పాపం ప్రతాప్‌` మూవీ రివ్యూ, తిరువీర్‌ సినిమా నవ్వించిందా?
Recommended image2
Pallichattambi Movie Review: పళ్లిచట్టంబి మూవీ రివ్యూ, టోవినో థామస్‌, కయాదు లోహర్‌ సినిమా ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved