MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Movie Reviews
  • Papam Prathap Review: `పాపం ప్రతాప్‌` మూవీ రివ్యూ, తిరువీర్‌ సినిమా నవ్వించిందా?

Papam Prathap Review: `పాపం ప్రతాప్‌` మూవీ రివ్యూ, తిరువీర్‌ సినిమా నవ్వించిందా?

తిరువీర్‌ మంచి కంటెంట్‌ ఉన్న చిత్రాలు చేస్తూ విజయాలు అందుకుంటున్నాడు. హీరోగా ఎదుగుతున్నాడు. తాజాగా ఆయన `పాపం ప్రతాప్‌` మూవీలో నటించాడు. ఈ సినిమా ఎలా ఉందంటే? 

3 Min read
Author : Aithagoni Raju
Published : Apr 17 2026, 07:25 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పాపం ప్రతాప్‌ మూవీ రివ్యూ
Image Credit : X/@etvwin

పాపం ప్రతాప్‌ మూవీ రివ్యూ

తిరువీర్‌ టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నారు. కామెడీ చిత్రాలతో అలరిస్తున్నారు. ఇప్పుడు ఆయన `పాపం ప్రతాప్‌` అనే మూవీలో నటించాడు. ఎస్‌ పీ దుర్గా నరేష్‌ దర్శకత్వం వహించారు. తిరువీర్‌కి జోడీగా పాయల్‌ రాధాకృష్ణ నటించింది. రాశి, అజయ్‌ ఘోష్‌, శ్రీనివాస్‌ అవసరాల, దేవి ప్రసాద్‌, గోపరాజు రమణ, ప్రసాద్‌ బెహరా వంటి వారు కీలక పాత్రలు పోషించారు. ఈటీవీ విన్‌, కృషి ఎంటర్టైన్‌మెంట్‌ పతాకాలపై రుద్ర దేవ్‌ మదిరెడ్డి, రాకేష్‌ రెడ్డి గడ్డం నిర్మించారు. నేడు శుక్రవారం(ఏప్రిల్‌ 17)న ఈ చిత్రం విడుదలైంది. మరి సినిమా నవ్వులు పూయించిందా? ఆడియెన్స్ ని అలరించడంలో సక్సెస్‌ అయ్యిందా అనేది రివ్యూలో తెలుసుకుందాం.

25
పాపం ప్రతాప్‌ మూవీ కథ ఏంటంటే?
Image Credit : X/@etvwin

పాపం ప్రతాప్‌ మూవీ కథ ఏంటంటే?

ప్రతాప్‌(తిరువీర్‌).. చిన్నప్పట్నుంచి బుజ్జమ్మ(పాయల్‌ రాధాకృష్ణ)ని ప్రేమిస్తాడు. పెళ్లి చేసుకుంటాడు. ఈ పెళ్లి నాన్న వీరయ్య(అజయ్‌ ఘోష్‌)కి ఇష్టంలేదు. అమ్మ లక్ష్మి(రాశి) అన్నీ తానై  పెళ్లి చేస్తుంది. మ్యారేజ్‌ గ్రాండ్‌గా జరుగుతుంది. ఫస్ట్ నైట్‌ కూడా మూడు రోజులు బ్రహ్మాండంగా జరుగుతుంది. కానీ మూడో రోజే బుజ్జమ్మ పంచాయితీ పెడుతుంది. ఆయనతో కలిసి ఉండలేనని, రాత్రిళ్లు దారుణంగా బిహేవ్‌ చేస్తున్నాడని చెప్పి పుట్టింటికి వెళ్లిపోతుంది. మూడో రోజే భార్య వెళ్లిపోవడంతో ఊర్లో అంతా రకరకాలుగా మాట్లాడుకుంటారు. ప్రతాప్‌ కి మ్యాటర్‌ లేదని, గే అని రకరకాలుగా చర్చ నడుస్తుంది. ఊరంతా గబ్బు గబ్బు అవుతుంది. అయితే తాను రాత్రిళ్లు ఏం చేస్తున్నాడో చెప్పదు బుజ్జమ్మ. తనపై ప్రేమ ఉంటే నీ సమస్య ఏంటో తెలుసుకుని, దాన్ని సెట్‌ చేసుకున్నాక తన వద్దకు రావాలని చెబుతుంది. మరి ప్రతాప్‌ కి ఉన్న సమస్య ఏంటి? దాన్ని ఎలా పరిష్కరించుకున్నాడు? మళ్లీ బుజ్జమ్మతో కలిసిపోయాడా? ఈ క్రమంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయనేది మిగిలిన సినిమా.

Related Articles

Related image1
Naga Chaitanya: నాగార్జున మిస్టేక్‌ వల్ల నాగచైతన్యకి సూపర్‌ హిట్‌ మిస్‌.. చైతూ ఎంట్రీ ఇవ్వాల్సిన మూవీ ఏంటో తెలుసా?
Related image2
Vishnu Priya Exclusive Photos: బోల్డ్ లుక్‌లో విష్ణుప్రియ కేక.. అలా చేయడంలో తప్పేం లేదా?
35
పాపం ప్రతాప్‌ మూవీ విశ్లేషణ
Image Credit : X/@etvwin

పాపం ప్రతాప్‌ మూవీ విశ్లేషణ

యదార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. రాత్రిళ్లు ఒక వ్యక్తి చేసే విచిత్రమైన ప్రవర్తన ఆధారంగా తెరకెక్కింది. దాని వల్ల హీరో ఎలాంటి సమస్యలు ఫేస్‌ చేశాడు? తన భార్య ఎలాంటి ఎంతటి నరకం అనుభవించింది, ఆ సమస్య ఆయన ఫ్యామిలీని ఎంతగా ఇబ్బంది పెట్టిందనేది కామెడీ కోణంలో రూపొందించారు. అయితే కామెడీ పండలేదు కదా, చిరాకు తెప్పించింది. సినిమా ప్రారంభం నుంచి ఎండింగ్‌ వరకు గోల గోలగా, అరుపులు, కేకలు అన్నట్టుగానే సాగుతుంది. హీరోహీరోయిన్ల మధ్య లవ్‌ ట్రాక్‌ సీన్లు కొన్ని ఫర్వాలేదు. అదే సమయంలో హీరోకి ఉన్న సమస్యపై ఊర్లో వారంతా మాట్లాడుకునే తీరు కొంత కామెడీగా ఉంటుంది. దీనికితోడు గోపరాజు రమణ షకీలాపై మనసు పడటం, ఆమె సినిమాలు చూసేందుకు థియేటర్ వద్ద గోల చేయడం, థియేటర్లో సీన్లు కొంత వరకు ఫన్నీగా ఉంటాయి. అవి తప్ప ఇందులో నవ్వుకోవడానికి ఏం లేదు సరికదా, పెద్ద టార్చర్‌గా సాగుతుంది. ఒక్క సీన్‌కి మించి మరో సీన్‌ చిరాకు తెప్పిస్తాయి. అజయ్‌ ఘోష్‌, గోపరాజు రమణ తిట్టుకునే సీన్లు ఆడియెన్స్ సహనాన్ని పరీక్షిస్తాయి. ఆర్టిస్ట్ ల ఓవర్‌ పర్ఫెర్మెన్స్, లౌడ్‌గా రియాక్ట్ అయిన తీరు కామెడీని పండించడంలో విఫలమయ్యాయి. తిరువీర్‌ యాక్టింగ్‌లోని ఇన్నోసెంట్‌ కూడా నవ్వులు పూయించలేకపోయాయి. ప్రతి సీన్‌ ఓవర్‌గా అనిపిస్తాయి. ఫస్టాఫ్‌ దారుణం అంటే, దాన్ని మించి సెకండాఫ్‌ ఉంది. సీన్లు, ఆర్టిస్ట్ లు, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ ఇలా ప్రతిదీ సినిమాకి మైనస్‌గానే మారాయి. ఏదైనా ఇందులో ఆకట్టుకునే అంశం ఉందంటే ఇది రియల్‌ లైఫ్‌ స్టోరీ అని లాస్ట్ లో చెప్పడం, క్లైమాక్స్ లో వచ్చే చిన్న ఎమోషనల్‌ సీన్‌, అది తప్పితే మూవీ మొత్తం ఔట్‌ ఆఫ్‌ ది కంట్రోల్‌లో సాగిందని చెప్పొచ్చు.

45
పాపం ప్రతాప్‌ ఆర్టిస్ట్ ల నటన ఎలా ఉందంటే?
Image Credit : X/@etvwin

పాపం ప్రతాప్‌ ఆర్టిస్ట్ ల నటన ఎలా ఉందంటే?

ప్రతాప్‌గా తిరువీర్‌ నటన ఆకట్టుకుంటుంది. చాలా నేచురల్‌గా బాగా నటించాడు. ఆయన తండ్రిగా అజయ్‌ ఘోష్‌ మెప్పించాడు, కానీ ఓవర్‌గా అనిపిస్తుంది. అలాగే రాశి పాత్ర సెటిల్‌గా ఉండి, ఆకట్టుకుంది. దేవిశ్రీప్రసాద్‌ ఫర్వాలేదు. ఆయన భార్యగా రూప లక్ష్మి మెప్పించింది. ప్రసాద్‌ బెహరా పాత్ర కూడా నవ్వించలేకపోయింది. మిగిలిన నటీనటులు మెప్పించారు, కానీ ఆయా పాత్రలు ఆడియెన్స్ కి టార్చర్‌గానే అనిపిస్తాయి.

55
పాపం ప్రతాప్‌ మూవీ టెక్నీకల్‌గా ఎలా ఉందంటే?
Image Credit : X/@etvwin

పాపం ప్రతాప్‌ మూవీ టెక్నీకల్‌గా ఎలా ఉందంటే?

దర్శకుడు ఎస్పీ దుర్గా నరేష్‌ ఎంచుకున్న పాయింట్‌ బాగానే ఉంది. కొత్తగా ఉంది. కానీ దాన్ని అంతే కామెడీగా, ఎమోషనల్‌గా తెరకెక్కించడంలో సక్సెస్‌ కాలేకపోయారు. దీంతో సినిమా మొత్తం మిస్‌ ఫైర్‌ అయ్యింది. కేఎం రాధాకృష్ణ మ్యూజిక్‌ కూడా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. బీజీఎం ఆడియెన్స్ సహనాన్ని పరీక్షించేలా సాగింది. ఎడిటింగ్‌ పరంగా మూవీని ఇంకా కట్‌ చేయాల్సింది. రెండున్నర గంటల సినిమా థియేటర్లో చూస్తే నాలుగైదు గంటలు చూసినంతగా అనిపించింది. నిర్మాణ విలువలకు కొదవలేదు.

ఫైనల్‌గా

 పాపం ఆడియెన్స్. రెండున్నర గంటలు చుక్కలు. 

రేటింగ్‌ 1.75

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
సినిమా సమీక్షలు
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Dacoit Movie Review: డెకాయిట్‌ మూవీ రివ్యూ, రేటింగ్‌.. అడవి శేష్‌, మృణాల్‌ ఠాకూర్‌ మూవీ ఎలా ఉందంటే ?
Recommended image2
Chiraiya Review: భార్యతో కలవాలంటే భర్త ఆమె అంగీకారం తీసుకోవాల్సిందే.. ప్రతి మగాడు చూడాల్సిన సిరీస్
Recommended image3
Gulebakavali Katha Review : ఎన్టీఆర్ డైరెక్ట్ చేసినా.. టైటిల్స్ లో పేరులేదు, గులేబకావళి కథ సినిమా సక్సెస్ కు కారణాలు ఇవే?
Related Stories
Recommended image1
Naga Chaitanya: నాగార్జున మిస్టేక్‌ వల్ల నాగచైతన్యకి సూపర్‌ హిట్‌ మిస్‌.. చైతూ ఎంట్రీ ఇవ్వాల్సిన మూవీ ఏంటో తెలుసా?
Recommended image2
Vishnu Priya Exclusive Photos: బోల్డ్ లుక్‌లో విష్ణుప్రియ కేక.. అలా చేయడంలో తప్పేం లేదా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved