MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Naga Chaitanya: నాగార్జున మిస్టేక్‌ వల్ల నాగచైతన్యకి సూపర్‌ హిట్‌ మిస్‌.. చైతూ ఎంట్రీ ఇవ్వాల్సిన మూవీ ఏంటో తెలుసా?

Naga Chaitanya: నాగార్జున మిస్టేక్‌ వల్ల నాగచైతన్యకి సూపర్‌ హిట్‌ మిస్‌.. చైతూ ఎంట్రీ ఇవ్వాల్సిన మూవీ ఏంటో తెలుసా?

Naga Chaitanya: నాగచైతన్య.. `జోష్‌` సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. కానీ ఈ మూవీ పరాజయం చెందింది. ఒక బ్లాక్‌ బస్టర్‌ మూవీతో హీరోగా పరిచయం కావాల్సిన నాగచైతన్య.. తండ్రి నాగార్ణున నిర్ణయం కారణంగా మిస్‌ చేసుకున్నారు. 

3 Min read
Author : Aithagoni Raju
Published : Apr 16 2026, 09:18 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
నాగార్జున కారణంగా చైతూ బ్లాక్‌ బస్టర్‌ మిస్‌
Image Credit : Asianet News

నాగార్జున కారణంగా చైతూ బ్లాక్‌ బస్టర్‌ మిస్‌

నాగచైతన్య `తండేల్‌` మూవీతో కమ్‌ బ్యాక్‌ అయ్యారు. వరుస పరాజయాల తర్వాత ఆయన మళ్లీ పుంజుకున్నారు. ఇప్పుడు భారీ సినిమాతో రాబోతున్నారు. `విరూపాక్ష` ఫేమ్‌ కార్తీక్‌ దండు దర్శకత్వంలో రూపొందుతున్న `వృషకర్మ` అనే చిత్రంలో నటిస్తున్నారు. అయితే  తాజాగా నాగచైతన్యకి సంబంధించిన ఒక ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఆయన ఎంట్రీ ఇవ్వాల్సిన మూవీకి సంబంధించిన దిల్‌ రాజు క్రేజీ విషయాన్ని బయటపెట్టారు. నాగార్జున చేసిన మిస్టేక్‌ కారణంగా చైతూ ఎలాంటి సూపర్‌ హిట్‌ని మిస్‌ చేసుకున్నారో తెలిసిపోయింది.

25
జోష్‌ తో హీరోగా పరిచయం అయిన నాగచైతన్య
Image Credit : X/@svcc

జోష్‌ తో హీరోగా పరిచయం అయిన నాగచైతన్య

నాగచైతన్య.. లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా, మన్మథుడు నాగార్జున తనయుడిగా సినిమాల్లోకి వచ్చారు. 2009లో `జోష్‌` మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఇది యూత్‌ఫుల్‌ మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌. కాలేజీ లవ్‌ స్టోరీ, కాలేజీ గొడవల నేపథ్యంలో సినిమా సాగుతుంది. దీనికి కొంత పొలిటికల్‌ అంశాలను కూడా జోడించారు. చైతూకిది మాస్‌ ఎంట్రీ అని చెప్పొచ్చు. భారీ స్థాయిలో ఈ మూవీని రూపొందించారు దర్శకుడు వాసు వర్మ. దిల్‌ రాజు నిర్మాత. ఈ చిత్రంతో సీనియర్‌ నటి రాధ కుమార్తె కార్తిక హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. జేడీ చక్రవర్తి నెగటివ్‌ రోల్‌ చేశారు. 2009, సెప్టెంబర్‌ 5న విడుదలైన ఈ మూవీ థియేటర్లో పెద్దగా ఆడలేదు. అటు నాగార్జునని, ఇటు చైతూని, అక్కినేని అభిమానులను డిజప్పాయింట్‌ చేసింది.

Related Articles

Related image1
Sreemukhi Remuneration: శ్రీముఖి ఒక్క షోకి ఎంత రెమ్యునరేషన్‌ తీసుకుంటుందో తెలుసా? బుల్లితెర క్వీన్ అనేది ఇందుకే
Related image2
Vishnu Priya Exclusive Photos: బోల్డ్ లుక్‌లో విష్ణుప్రియ కేక.. అలా చేయడంలో తప్పేం లేదా?
35
చైతూ హీరోగా ఎంట్రీ ఇవ్వాల్సిన మూవీ ఇదే
Image Credit : google

చైతూ హీరోగా ఎంట్రీ ఇవ్వాల్సిన మూవీ ఇదే

ఇదిలా ఉంటే నాగచైతన్య హీరోగా ఎంట్రీ ఇవ్వాల్సిన మూవీ ఇది కాదు. ఒక లవ్‌ స్టోరీ చేయాల్సింది. టీనేజ్‌ రొమాంటిక్‌ లవ్‌ స్టోరీతో హీరోగా పరిచయం కావాల్సింది. అదే `కొత్తబంగారు లోకం`. ఈ మూవీ కథని మొదట నాగచైతన్యకే చెప్పారు నిర్మాత దిల్‌ రాజు. ఈ లవ్‌ స్టోరీతో చైతూని హీరోగా పరిచయం చేయాలని దిల్‌ రాజు భావించారు. నాగార్జునకి కథ చెప్పించారు. కానీ ఆయన రిజెక్ట్ చేశారు. ఒక స్టార్‌ కొడుకు ఇలాంటి సాఫ్ట్ స్టోరీతో పరిచయం అయితే బాగుండదు, అభిమానులు డిజప్పాయింట్‌ అవుతారని చెప్పి,ఈ కథని రిజెక్ట్ చేశారట నాగ్‌. దీంతో ఆ తర్వాత వాసువర్మని పంపించి `జోష్‌` కథ చెప్పగా, అది నచ్చి సినిమా చేశారు. కానీ ఫలితం తేడా కొట్టింది. `కొత్తబంగారు లోకం`మూవీని రిజెక్ట్ చేసిన విషయం దిల్‌ రాజు `జోష్‌` ఆడియో ఈవెంట్‌లోనే తెలిపారు. ఆ ఈవెంట్‌కి అక్కినేని నాగేశ్వరరావు, మోహన్‌ బాబు, బాలయ్య, వెంకటేష్‌, నాగార్జున, అప్పటి స్పీకర్‌ కిరణ్‌ కుమార్‌ రెడ్డి, రాజమౌళి, ఇలా చాలా మంది సెలబ్రిటీలు పాల్గొన్నారు.

45
ఏ మాయ చేసావెతో హీరోగా బ్రేక్‌ అందుకున్న నాగచైతన్య
Image Credit : prime video

ఏ మాయ చేసావెతో హీరోగా బ్రేక్‌ అందుకున్న నాగచైతన్య

అయితే రెండో సినిమా మళ్లీ లవ్‌ స్టోరీనే చేశారు. అదే `ఏ మాయ చేసావె`. గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. ఇందులో సమంత హీరోయిన్‌గా నటించింది. రొమాంటిక్‌ లవ్‌ స్టోరీగా రూపొందిన ఈ మూవీ పెద్ద హిట్‌ అయ్యింది. చైతూకి, అటు సమంతకి మంచి బ్రేక్‌ ఇచ్చింది. దీంతో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఈ ఇద్దరు ప్రేమలో పడి, పెళ్లి కూడా చేసుకున్నారు. నాలుగేళ్లకే విడిపోయిన విషయం తెలిసిందే. మొత్తంగా చైతూ, తన ఎంట్రీ `కొత్తబంగారు లోకం` వంటి సూపర్‌ హిట్‌ తో ఉండాల్సింది, కానీ నాగార్జున నిర్ణయం వల్ల పరాజయం మూటగట్టుకోవాల్సి వచ్చింది.

55
కొత్త బంగారు లోకంతో వరుణ్‌ సందేశ్‌ స్టార్‌
Image Credit : aha

కొత్త బంగారు లోకంతో వరుణ్‌ సందేశ్‌ స్టార్‌

`కొత్త బంగారు లోకం` మూవీలో వరుణ్‌ సందేశ్‌ నటించాడు. ఆయనకు జోడీగా స్వేత బసు ప్రసాద్‌ హీరోయిన్‌గా చేసింది. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ మూవీ 2008లో విడుదలై పెద్ద హిట్‌ అయ్యింది. ఇందులోని పాటలు కుర్రాళ్లని ఉర్రూతలూగించాయి. లవ్‌ స్టోరీ టీనేజర్లని, యూత్‌ని తెగ ఆకట్టుకుంది. అప్పట్లో ఇదొక ట్రెండ్‌ సెట్టర్‌ అని చెప్పొచ్చు. ఈ మూవీ విడుదలయ్యాక కాలేజీలో ఎన్నో ప్రేమ జంటలు చిగురించాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అదే సమయంలో వరుణ్‌ సందేశ్‌కి అమ్మాయిల్లో మంచి ఫాలోయింగ్‌ ఏర్పడింది. `హ్యాపీడేస్‌`, ఆ తర్వాత `కొత్త బంగారు లోకం` ఇలా బ్యాక్‌ టూ బ్యాక్‌ హిట్స్ తో వరుణ్‌ సందేశ్‌ స్టార్‌ అయిపోయాడు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
నాగ చైతన్య
అక్కినేని నాగార్జున
తెలుగు సినిమా
దిల్ రాజు
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
దేవీశ్రీని ఇంటికి పిలిపించుకున్న పవన్.. దేవీ సమాధానానికి మౌనంగా ఉండిపోయిన పవర్ స్టార్
Recommended image2
Vishnu Priya Exclusive Photos: బోల్డ్ లుక్‌లో విష్ణుప్రియ కేక.. అలా చేయడంలో తప్పేం లేదా?
Recommended image3
Toxic : యష్ అభిమానులకు షాక్! టాక్సిక్ రిలీజ్ మళ్లీ వాయిదా పడిందా? అసలు నిజం ఇదే!
Related Stories
Recommended image1
Sreemukhi Remuneration: శ్రీముఖి ఒక్క షోకి ఎంత రెమ్యునరేషన్‌ తీసుకుంటుందో తెలుసా? బుల్లితెర క్వీన్ అనేది ఇందుకే
Recommended image2
Vishnu Priya Exclusive Photos: బోల్డ్ లుక్‌లో విష్ణుప్రియ కేక.. అలా చేయడంలో తప్పేం లేదా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved