MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Movie Reviews
  • Meghasandesam Review: హీరో,హీరోయిన్ పాత్రలను చంపేసిన దాసరి, అవార్డుల వర్షం కురిపించిన ఏఎన్నార్ మూవీ...

Meghasandesam Review: హీరో,హీరోయిన్ పాత్రలను చంపేసిన దాసరి, అవార్డుల వర్షం కురిపించిన ఏఎన్నార్ మూవీ...

కొన్ని సినిమాలు చరిత్రలో అలా నిలిచిపోతాయి.. వాటిని కదిలించడం కష్టం.. అటువంటి అద్భుత కళాకండాలలో ఒకటి మేఘసందేశం సినిమా. హీరో, హీరోయిన్ పాత్రలను దర్శకుడు చంపేసినా.. అభిమానులు ఈసినిమాను ఎందుకు యాక్సప్ట్ చేశారు? 

4 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 19 2026, 11:33 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
అక్కినేని 200వ సినిమా..
Image Credit : Asianet News

అక్కినేని 200వ సినిమా..

దర్శకరత్న దాసరి నారాయణరావు, అక్కినేని నాగేశ్వరావు కాంబినేషన్ లో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ అక్కినేని కెరీర్ లో మైలురాయిగా నిలిచిపోయిన సినిమా మేఘసందేశం. అక్కినేని 200 సినిమాగా తెరకెక్కిన మేఘసందేశం దాసరి స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. నిజానికి ఏఎన్నార్ కు వీరాభిమాని దాసరి నారాయణరావు. ఆయనతో చేసే ప్రతీ సినిమా అద్భుతంగా ఉండాలని కోరుకునేవారు. ఆ క్రమంలోనే వీరిద్దిర కాంబోలో ఆణిముత్యాల్లాంటి సినిమాలు బయటకు వచ్చాయి. 

ఏడంతస్తుల మేడ, బహుదూరపు బాటసారి, శ్రీవారిముచ్చట్లు, ప్రేమాభిషేకం, బంగారు కుటుంబం లాంటి సినిమాలు వచ్చాయి. ఇక ఇందులో ప్రేమాభిషేకం క్రియేట్ చేసిన రికార్డులు గురించి అందరికి తెలిసిందే. ఆ సినిమా తరువాత వీరి కలయికలో వచ్చిన అద్భుత చిత్రం మేఘసందేశం. 1982 లో రిలీజ్ అయిన కళాత్మక చిత్రం మేఘసందేశం . ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, జయప్రద, జయసుధ, జగ్గయ్య లాంటి ప్రముఖలు ముఖ్య పాత్రల్లో నటించారు.

28
మేఘసందేశం కథ విషయానికి వస్తే..
Image Credit : Asianet News

మేఘసందేశం కథ విషయానికి వస్తే..

రవీంద్రబాబు( ఎన్నార్) ప్రముఖ కవి. ప్రకృతిని చూస్తే.. పరవశించిపోయి కవితలు రాస్తుంటాడు. కళల పట్ల ఆరాధనా భావం కలవాడు. ఈయన పార్వతి(జయసుధ) అనే సాధారణ యువతిని వివాహం చేసుకుంటాడు. పార్వతి సోదరుడైన జగన్నాథం( జగ్గయ్య)కి తన చెల్లెలంటే ప్రాణం. రవీంద్రబాబు పార్వతిని తన భార్యగా అభిమానించినా.. వారి మనసులు మాత్రం కలవవు. ఏదో అసంతృప్తితో ఉంటాడు. వీరికి ఒక పాప. రవీంద్రబాబుకు ఊళ్ళో మంచి పేరు ఉంటుంది. ఆయన మాటకు అందరు విలువిచ్చేవారు. ఎవరైనా తప్పు చేస్తే.. ఊరుకునేవారు కాదు.

 అప్పుడే వీరి గ్రామానికి కళావంతుల కుటుంబం వచ్చి స్థిరపడుతుంది. ఏటి ఒడ్డున ఉన్నవారు డ్యాన్స్ తో అందరిని ఆకర్శిస్తారు. వారిలో పద్మ( జయప్రద) డ్యాన్స్ కు అందరు ఫిదా అవుతారు. ఊరంతా మగవారు అక్కడికి వెళ్తున్నారని తెలిసి.. రవీంద్రబాబు వారిని మందలించి.. పంపిస్తాడు. కానీ పద్మ నృత్య కౌశలం, ఆమె పలికించే భావాలు, ఆహార్యం చూసి రవీంద్రబాబు కూడా ఆమె కళకి ప్రేమలో పడిపోతాడు. ఆయనలోని కవికి మంచి ప్రేరణ దొరికినట్టు భావిస్తాడు.

Related Articles

Related image1
ఏఎన్నార్, శోభన్ బాబు ను ర్యాగింగ్ చేసి.. ఏడిపించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా?
Related image2
Doctor Chakravarthy Review : ఏఎన్నార్ చెల్లెలుగా సావిత్రి నటించిన ఏకైక చిత్రం, ఫస్ట్ నంది అవార్డ్ మూవీ..
38
పద్మ ప్రేమలో పిచ్చివాడైన రవీంద్రబాబు..
Image Credit : Asianet News

పద్మ ప్రేమలో పిచ్చివాడైన రవీంద్రబాబు..

దాంతో అతను పద్మను ఆరాధించడం మొదలుపెడతాడు. తన భర్త వేశ్యావృత్తికి చెందిన పద్మతో పరిచయం తెలుసుకున్న పార్వతి బాధపడుతుంది. అన్న జగన్నాథంకి విషయం చెపుతుంది. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి పద్మతో తన చెల్లెలు కుటుంబం జోలికి రావద్దని హెచ్చరిస్తాడు. దాంతో పద్మ ఆ ఊరు వదిలి వెళ్తిపోతుంది. రవీంద్రబాబు తీవ్రంగా బాధపడతాడు... పద్మ ఆలోచనల్లోనే కాలం గడుపుతూ ఆమెను వెతుకుతూ.. బయట తిరుగుతుంటాడు. కుటుంబాన్ని వదిలేస్తాడు.

 చివరికి తన కూతురు పెళ్లీడుకు వస్తుంది. తండ్రి కావాలని కూతురు అడగడంతో.. జగన్నాథం కూతురు పెళ్లికి రమ్మని రవీంద్ర బాబును అడుగుతాడు. తను వస్తే తన కూతురికి పరువు తక్కువ అవుతుందని రానంటాడు.. చివరకు భార్య వచ్చి పిలవడంతో కూతురు పెళ్లికి వస్తాడు. తన భార్యను క్షమాపణ అడిగి... ఆమె చేతుల్లో మరణిస్తాడు హీరో.. మరో వైపు పద్మ కూడా మరణిస్తుంది.

48
సాహసం చేసిన దాసరి…
Image Credit : the indian express

సాహసం చేసిన దాసరి…

మేఘనందేశం లాంటి సినిమా చేసి నిజంగా దాసరి సాహసం చేశాడని చెప్పవచ్చు. ఎందుకంటే.. మనది గ్లామర్ ఇండస్ట్రీ.. హీరో అందంగా ఉండాలి, ఫైట్లు చేయాలి. హీరోయిజం చూపించాలి. తమ అభిమాన నటుడిని డీగ్లమార్ గా చూడటానికి ఇష్టపడరు. అటువంటిది.. ఏఎన్నార్ లాంటి కమర్షియల్ హీరోను క్లైమాక్స్ లో చంపేయడం. హీరోతో పాటు హీరోయిన్ ను కూడా చంపేయడం చాలా పెద్ద విషయం. దాసరి ప్రతిభకు.. ఏఎన్నార్ నటనకు ఈ సినిమా పరాకాష్టగా నిలిచింది. జయసుధను సహజనటి అని ఎందుకు అంటారో ఈ సినిమా చూస్తే చాలు అర్ధమౌతుంది. ఇక జయప్రద అందం, డ్యాన్స్ ఈసినిమాకు తారా స్థాయికి తీసుకెళ్లింది.

58
సినిమాకు ప్రాణం పోసిన పాటలు..
Image Credit : Asianet News

సినిమాకు ప్రాణం పోసిన పాటలు..

ఈ సినిమాకు ఏఎన్నార్, జయసుధ, జయప్రద నటన తో పాటు.. పాటలు ప్రాణం పోశాయి. సంగీత ప్రియుల మనసులు పిండేశాయి. మేఘసందేశంలో ప్రతీ పాట ఒక ఆణిముత్యమే.. రమేష్ నాయుడు స్వరపరిచిన పాటలన్నీ అద్భుతం చేశాయి. దేవులపల్లి కృష్ణశాస్త్రి, వేటూరి సుందరరామ్మూర్తి సాహిత్యం, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, పి. సుశీల, కె. జె. ఏసుదాసు, ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం గాత్రం ఇప్పటికీ శ్రోతల చెవులలో అమృతం కురిపిస్తూనే ఉన్నాయి. ఆకులో ఆకునై.. ఆకాశ దేశాన, పాడనా...వాణి కళ్యాణిగా, నిన్నటి దాకా శిలనైనా లాంటి పాటలు అద్భుతం చేశాయి. సినిమా సక్సెస్ లో మేజర్ క్రెడిట్ కొట్టేశాయి.

68
అవార్డుల వర్షం కురిసిన వేళ..
Image Credit : Asianet News

అవార్డుల వర్షం కురిసిన వేళ..

మేఘసందేశం సినిమా ఎంతలా ప్రభావం చూపించిందంటే.. ఈసినిమాకు జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్ర స్థాయిలో అవార్డుల పంట పండింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ గాయకుడు, ఉత్తమ గాయని విభాగాల్లో నాలుగు జాతీయ పురస్కారాలు అందుకుంది. రాష్ట్ర స్థాయిలో బంగారు నంది పురస్కారం, ఫిల్మ్ ఫేర్ పురస్కారాన్ని కూడా మేఘసందేశం సినిమా అందుకుంది. ఉత్తమ గాయుడిగా ఏసుదాసు, ఉత్తమ గాయనిగా సుశీలమ్మ, ఉత్తమ సంగీత దర్శకుడిగా రమేష్ నాయుడు నేషనల్ అవార్డును సాధించారు.

78
నంది అవార్డుల పంట పండింది..
Image Credit : Asianet News

నంది అవార్డుల పంట పండింది..

ఇక మేఘసందేశం సినిమా 82 లో రిలీజ్ అయితే.. 83 లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు.. ఇక ఈసినిమా నుంచే ఉత్తమ హీరో క్యాటగిరీలో బంగారు నంది అవార్డు ఇవ్వడం స్టార్ట్ చేశారు. మేఘసందేశం సినిమాకు ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడిగా అక్కినేని నాగేశ్వరరావు, ఉత్తమ నటిగా జయసుధు, ఉత్తమ గాయుడిగా ఏసుదాసు, ఉత్తమ గాయనిగా సుశీల, ఉత్తమ సంగీత దర్శకుడిగా రమేష్ నాయుడు, ఉత్తమ గేయ రచయితగా దేవులపల్లి, ఉత్తమ ఆడియోగ్రాఫర్ గా స్వామినాథన్, ఉత్తమ సినిమాటోగ్రాఫర్ గా సెల్వరాజ్.. బంగారు నందులను అందుకున్నారు.

88
ప్రేక్షకుల మనసును గెలుచుకోలేకపోయింది..
Image Credit : Asianet News

ప్రేక్షకుల మనసును గెలుచుకోలేకపోయింది..

మేఘసందేశం సినిమా అద్భుత కావ్యంగా నిలిచిపోయింది. కవులు కళాకారుల మనసు దోచిన సినిమా.. సామాన్య ప్రేక్షకులను మాత్రం అలరించలేకపోయింది. అవార్డు పంట పండినా..ఆడియన్స్ రివార్డులను మాత్రం పొందలేకపోయింది. కమర్షియల్ గా సక్సెస్ అవ్వలేదు మేఘసందేశం.. బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ గా నిలిచింది. ఆర్ట్ మూవీగామిగిలిపోయింది.

 కానీ ఈసినిమాకు ఓ వర్గం ప్రేక్షకులు మాత్రం బ్రహ్మరథం పట్టారు. ఇప్పటికీ ఈసినిమా టీవీలో వచ్చిందంటే కదలకుండా చూసే అభిమానలు ఉన్నారు. ఇక మేఘసందేశం పాటలకు కరిగిపోయే శ్రోతల సంఖ్య కూడా ఎక్కువే. ఇక ఈసినిమాను చూడాలి అనుకునేవారికి యూట్యూబ్ లో అందుబాటులో ఉంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Thimmarajupalli TV Review: తిమ్మరాజుపల్లి టీవీ మూవీ రివ్యూ.. కిరణ్‌ అబ్బవరం నిర్మించిన సినిమా ఎలా ఉందంటే?
Recommended image2
Pochamma OTT Review: పోచమ్మ వెబ్‌ సిరీస్‌ రివ్యూ.. ఆహా ఓటీటీ థ్రిల్లర్‌ ఎలా ఉందంటే?
Recommended image3
Pallichattambi Movie Review: పళ్లిచట్టంబి మూవీ రివ్యూ, టోవినో థామస్‌, కయాదు లోహర్‌ సినిమా ఎలా ఉందంటే?
Related Stories
Recommended image1
ఏఎన్నార్, శోభన్ బాబు ను ర్యాగింగ్ చేసి.. ఏడిపించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా?
Recommended image2
Doctor Chakravarthy Review : ఏఎన్నార్ చెల్లెలుగా సావిత్రి నటించిన ఏకైక చిత్రం, ఫస్ట్ నంది అవార్డ్ మూవీ..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved