MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Movie Reviews
  • Gedela Raju Review: గేదెల రాజు మూవీ రివ్యూ, రఘు కుంచె లీడ్‌గా చేసిన సినిమా ఎలా ఉందంటే?

Gedela Raju Review: గేదెల రాజు మూవీ రివ్యూ, రఘు కుంచె లీడ్‌గా చేసిన సినిమా ఎలా ఉందంటే?

Gedela Raju Review: రఘు కుంచె ప్రధాన పాత్రలో `గేదెల రాజు` మూవీ రూపొందింది. నేడు శుక్రవారం విడుదలైన ఈ చిత్రం ఆడియెన్స్ ని ఆకట్టుకుందా? గేదెల రాజుగా రఘు కుంచె సక్సెస్‌ అయ్యాడా? 

4 Min read
Author : Aithagoni Raju
Published : Apr 24 2026, 02:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
గేదెల రాజు మూవీ రివ్యూ
Image Credit : Asianet News

గేదెల రాజు మూవీ రివ్యూ

రఘు కుంచె ప్రధాన పాత్రలో నటించిన మూవీ `గేదెల రాజు`. `కాకినాడ తాలూకా` అనేది ట్యాగ్‌లైన్‌. ఇందులో రామచంద్రం పుణ్యమూర్తుల, వికాస్‌, టీనా శ్రావ్య, మౌనిక, రవి చిన్నిబిల్లి వంటి వారు ప్రధాన పాత్రలు పోషించారు. చైతన్య మోటూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మోటూరి టాకీస్‌ పతాకంపై రఘు కుంచె సమర్పణలో వాణి రవికుమార్‌ మోటూరి నిర్మించారు. టీజర్‌, ట్రైలర్‌ ద్వారా సినిమాకి మంచి బజ్‌ ఏర్పడింది. మరి సినిమా ఎలా ఉంది? రఘు కుంచె అదరగొట్టాడా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.

27
గేదెల రాజు మూవీ కథ
Image Credit : Asianet News

గేదెల రాజు మూవీ కథ

గేదెల రాజు(రఘు కుంచె) కాకినాడలో పెద్ద రౌడీ. చిన్న చిన్నగా  కెరీర్‌ స్టార్ట్ చేసి టౌన్‌ మొత్తాన్ని గడగడలాడించే పెద్ద నాయకుడిగా ఎదుగుతాడు. ఈ క్రమంలో తన స్నేహితులను కూడా తొక్కేసి తానే కింగ్‌గా ఎదుగుతాడు. ఆయనకు లేని అలవాట్లు లేవు. అమ్మాయిలతో సహా. అమ్మాయి బాగుంటే అమ్మ అయినా, కూతురు అయినా లెక్కచేయడు. గేదెల రాజు అంటే టౌమ్‌ మొత్తం హడల్‌. అతనికి అపోజిట్‌ దుర్గా(శ్రీకాంత్‌ అయ్యంగార్‌) ఉంటాడు. పోర్ట్ లో బోట్లు అన్నీ తన కంట్రోల్‌లో ఉంటాయి. అయితే వీరిద్దరు కార్పొరేటర్‌ సీట్‌ కోసం ప్రయత్నిస్తుంటారు. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవ అవుతుంది. సడెన్‌గా గేదెల రాజు హత్యకు గురవుతాడు. ఎవరు చేశారనేది పెద్ద మిస్టరీ. పోలీసులు ఆ దిశగా విచారించగా, గేదెల రాజుకి ఎంతో మందితో గొడవలు ఉన్నాయని తెలుస్తాయి. ఈ క్రమంలో శివయ్య, రిచ్‌, దుర్గా, ఇలా చాలా మందితో ఆయనకు గొడవలుంటాయి. వీరిలో ఎవరు చేశారనేది పెద్ద ప్రశ్న. అయితే ఈ కేసుకి గేదెల రాజు వద్ద పనిచేసే రిచ్‌(వికాస్‌ ముప్పాల)కి, సత్య(టీనా శ్రావ్య), విజయ్‌(రామ చంద్రంపుణ్యమంతుల)కి, దుర్గాకి, శివయ్యకి ఉన్న సంబంధమేంటి? రిచ్‌, మీరా(మౌనిక కలపల) లవ్‌ ట్రాక్ ఎలా సాగింది? సత్య, విజయ్ లవ్‌ ట్రాక్‌ ఎలాంటి మలుపులు తీసుకుంది? చివరికి ఏం జరిగింది? అనేది మిగిలిన కథ.

Related Articles

Related image1
Savitri: సావిత్రి ప్రేమగా బావా అని పిలిచే స్టార్‌ ఎవరో తెలుసా? ఆయనతో మహానటి రిలేషన్‌ స్పెషల్‌
Related image2
Vaazha 2 Review: వాలా 2 మూవీ తెలుగు రివ్యూ.. మలయాళంలో దుమ్ములేపుతున్న సినిమా ఎలా ఉందంటే?
37
గేదెల రాజు మూవీ ఎలా ఉందంటే?
Image Credit : Asianet News

గేదెల రాజు మూవీ ఎలా ఉందంటే?

గేదెల రాజు మూవీ గేదెల రాజు మర్డర్‌ మిస్టరీ చుట్టూ తిరిగే డ్రామా. ఇందులో లవ్‌ స్టోరీ ఉంది, ఎమోషన్స్ ఉన్నాయి, ఫ్యామిలీ డ్రామా ఉంది. మాస్‌ ఎలిమెంట్లు ఉన్నాయి. యాక్షన్‌ సీన్లు ఉన్నాయి. ఇలా అన్ని అంశాలను మేళవించిన చిత్రమిది. కథగా ఇది అదిరిపోయింది. సాధారణ స్థాయి నుంచి ఒక రౌడీ షీటర్‌గా ఎదిగిన గేదెల రాజు.. అమ్మలే కాదు, అమ్మాయిలపై కూడా మోజు పడితే, దాన్ని వాళ్లు ఎలా ఎదుర్కొన్నారు, ఈ క్రమంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనేది కథ. సినిమా గేదెల రాజు హత్య నుంచి స్టార్ట్ అవుతుంది. ఆయన్ని చంపింది ఎవరనేది ఆరా తీస్తుండగా, అసలు ఏం జరిగిందనేది ఒక్కో విషయం రివీల్‌ అవుతుంది. ఈ క్రమంలో గేదెల రాజు ఎలా ఎదిగాడనేది చూపించారు. ఆయన చేసే దుర్మార్గాలు, బెదిరింపులు, రౌడీయిజం చూపిస్తూ రఘుకుంచెకి కావాల్సిన ఎలివేషన్‌ ఇచ్చారు. ఆయా అంశాలు సినిమాపై ఆసక్తిని పెంచుతాయి. నెక్ట్స్ ఏం జరుగుతుందనే క్యూరియాసిటీని క్రియేట్‌ చేస్తుంటాయి. కథ ముందుకి వెనక్కి తిరుగుతుంది. గేదెల రాజుని చంపింది ఎవరనే విచారణలో భాగంగా హత్యకంటే ముందు ఏం జరిగింది? ఎవరిని కలిశాడు? ఎవరెవరితో ఆయనకు శత్రుత్వం ఉంది? ఆయనకు దగ్గర ఎవరు? ఎవరితో ఎఫైర్లు ఉన్నాయనేది చూపించారు. ఇవన్నీ ఇంట్రెస్టింగ్‌గా సాగుతాయి. అదే సమయంలో రిచ్‌ లవ్‌ స్టోరీ ఆకట్టుకుంటుంది. మరోవైపు సత్య, విజయ్‌ లవ్‌ ట్రాక్‌ కూడా మెప్పిస్తుంది. ఇంకోవైపు శివయ్యతో గొడవలు, ఆయన కేసుని తప్పుదోవ పట్టించడం వంటి సీన్లు కొంత క్యూరియాసిటీని క్రియేట్‌ చేస్తాయి.

47
గేదెల రాజు మూవీలో మైనస్ ఏంటంటే?
Image Credit : Asianet News

గేదెల రాజు మూవీలో మైనస్ ఏంటంటే?

అయితే సినిమా ముందుకి, వెనక్కి సాగడంతో కన్‌ఫ్యూజన్‌గా ఉంటుంది. కథ బాగున్నా, స్క్రీన్‌ ప్లే దారుణంగా ఉంది. ఏమాత్రం ఆకట్టుకునేలా, అర్థమయ్యేలా లేదు. ఒక సీన్‌ తర్వాత వాటికి సంబంధం లేని సీన్లు వస్తుంటాయి. ఎడిటింగ్‌ పరంగానూ దారుణంగా ఉంది. కథకి సంబంధం లేని సీన్లు వస్తుంటాయి, పోతుంటాయి? అవి ఎందుకు వస్తున్నాయో అర్థం కాదు. సినిమాని టైమ్‌ పాస్‌ చేయడానికి రకరకాల సీన్లు పెట్టారనిపిస్తుంది. ఆడియెన్స్ మైండ్‌ని డైవర్ట్ చేయడానికి నానా రకాలుగా ప్రయత్నించారు. అదే సమయంలో కథనం కూడా చాలా స్లోగా సాగుతుంది. సస్పెన్స్ క్రియేట్‌ చేసే అంశాలు ఏమాత్రం మెప్పించలేకపోయాయి. అవి తేలిపోయాయి. ఇంటర్వెల్‌లో ఏదో ట్విస్ట్ ఇచ్చారు. ఆ తర్వాత ఆ ట్విస్ట్ నీరుగారిపోయేలా ఉంది. పోలీసుల విచారణ కూడా మరింత బోరింగ్‌గా సాగుతుంది. వాళ్ల నటన కూడా అంతే ఎనర్జీలేని విధంగా ఉంటుంది. ఏదో మొక్కుబడిగా నటిస్తున్నట్టుగా ఉంది. సెకండాఫ్‌లో అనేక మలుపులు, ట్విస్టులు కొంత ఇంట్రెస్ట్ ని క్రియేట్‌ చేసినా, అవి ఆడియెన్స్ ని మెప్పించలేకపోతాయి. క్లైమాక్స్ లో ఏం చెప్పాలనుకున్నారో క్లారిటీ లేదు. అర్థాంతరంగా ముగించినట్టుగా ఉంటుంది. సినిమాలో ఏదైనా ప్లస్‌ ఉందంటే అది ఆర్టిస్ట్ లు పర్‌ఫెర్మెన్స్, రఘుకుంచె బీజీఎం.

57
గేదెల రాజు మూవీలో ఆర్టిస్ట్ లు ఎలా నటించారంటే?
Image Credit : Asianet News

గేదెల రాజు మూవీలో ఆర్టిస్ట్ లు ఎలా నటించారంటే?

గేదెల రాజుగా రఘుకుంచె ఇరగదీశారు. పెద్ద స్టార్‌ హీరోల రేంజ్‌లో ఆయనకు ఎలివేషన్లు ఇచ్చారు. ఆయన కూడా రెచ్చిపోయి యాక్ట్ చేశాడు. అదరగొట్టాడు. ఆయన మెయిన్‌ లీడ్‌గా ఇకపై చాలా సినిమాలు వస్తాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. విలక్షణ నటనతో రెచ్చిపోయారు. ఇక రిచ్‌గా వికాస్‌ బాగా చేశాడు. మీరాగా మౌనిక కలపల, సత్యగా టీనా శ్రావ్య, విజయ్‌గా రామచంద్రం చాలా బాగా చేశారు. శివయ్యగా రవి ఆనంద్‌ చిన్నిబెల్లి బాగా చేశాడు. మిగిలిన పాత్రధారులు కూడా మెప్పించారు. తమ పాత్రల పరిది మేరకు అదరగొట్టారు. ఆర్టిస్ట్ లు నటన సినిమాకి పెద్ద అసెట్‌.

67
టెక్నీకల్‌గా గేదెల రాజు మూవీ ఎలా ఉందంటే?
Image Credit : Asianet News

టెక్నీకల్‌గా గేదెల రాజు మూవీ ఎలా ఉందంటే?

సినిమా టెక్నీకల్‌గా అంత సాలిడ్‌గా లేదు. రఘు కుంచె మ్యూజిక్‌ ఫర్వాలేదు. బీజీఎం మాత్రం అదిరిపోయింది. విజువల్స్ ఓకే అనిపించాయి. ఎడిటింగ్‌ పరంగా చాలా లోపాలున్నాయి. బాగా కేర్‌ తీసుకోవాల్సింది. దర్శకుడు ఎంచుకున్న కథ బాగానే ఉంది. కానీ అనేక సంబంధం లేని అంశాలను జోడించి కన్‌ఫ్యూజ్‌ చేశాడు. స్క్రీన్‌ప్లే పరంగా చాలా లోపాలున్నాయి. సినిమా ఎంగేజ్‌ చేయడంలో విఫలమయ్యింది. నిర్మాణ విలువలు కూడా గొప్పగా లేవు. క్వాలిటీ  పరంగా మరింత కేర్‌ తీసుకోవాల్సింది.

77
ఫైనల్‌గా
Image Credit : Asianet News

ఫైనల్‌గా

 కన్‌ఫ్యూజన్‌తో సాగే మర్డర్‌ మిస్టరీ డ్రామా. ఎంగేజ్‌ చేయడంలో సక్సెస్‌ కాలేకపోయింది.

రేటింగ్‌: 2.25

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
సినిమా సమీక్షలు
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Vaazha 2 Review: వాలా 2 మూవీ తెలుగు రివ్యూ.. మలయాళంలో దుమ్ములేపుతున్న సినిమా ఎలా ఉందంటే?
Recommended image2
Meghasandesam Review: హీరో,హీరోయిన్ పాత్రలను చంపేసిన దాసరి, అవార్డుల వర్షం కురిపించిన ఏఎన్నార్ మూవీ...
Recommended image3
Thimmarajupalli TV Review: తిమ్మరాజుపల్లి టీవీ మూవీ రివ్యూ.. కిరణ్‌ అబ్బవరం నిర్మించిన సినిమా ఎలా ఉందంటే?
Related Stories
Recommended image1
Savitri: సావిత్రి ప్రేమగా బావా అని పిలిచే స్టార్‌ ఎవరో తెలుసా? ఆయనతో మహానటి రిలేషన్‌ స్పెషల్‌
Recommended image2
Vaazha 2 Review: వాలా 2 మూవీ తెలుగు రివ్యూ.. మలయాళంలో దుమ్ములేపుతున్న సినిమా ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved