MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Movie Reviews
  • నా కోడళ్ళు అద్భుతమైన వారు.. శోభిత, జైనబ్ లపై తొలిసారి అమల కామెంట్స్

నా కోడళ్ళు అద్భుతమైన వారు.. శోభిత, జైనబ్ లపై తొలిసారి అమల కామెంట్స్

Akkineni Amala: అమల అక్కినేని తన కోడళ్లైన శోభిత ధూళిపాల, జైనబ్ తో ఉన్న అనుబంధం గురించి తాజాగా వెల్లడించారు. తాను డిమాండ్ చేసే అత్తగారిని కాదు అంటూ అమల పేర్కొంది. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Oct 17 2025, 04:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఇద్దరు కోడళ్ల గురించి అక్కినేని అమల వ్యాఖ్యలు
Image Credit : x/naga chaitanya

ఇద్దరు కోడళ్ల గురించి అక్కినేని అమల వ్యాఖ్యలు

అమల అక్కినేని ప్రస్తుతం సినిమాలకు అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. మూడేళ్ళ క్రితం ఆమె తెలుగులో ఒకే ఒక జీవితం అనే చిత్రంలో మెరిశారు. ఆ తర్వాత మరో చిత్రానికి సైన్ చేయలేదు. నాగ చైతన్య, అఖిల్ అక్కినేని ఇద్దరూ వరుసగా వివాహం చేసుకున్న తర్వాత, అమల ఇప్పుడు తన కోడళ్లైన శోభిత ధూళిపాల, జైనబ్ లతో ఉన్న అనుబంధం గురించి మాట్లాడారు.

25
నా కోడళ్ళు అద్భుతం 
Image Credit : akhil fans insta

నా కోడళ్ళు అద్భుతం 

తాజాగా ఓ ఇంటర్వ్యూలో అమల అక్కినేని మాట్లాడుతూ – “నాకు అద్భుతమైన కోడళ్లు ఉన్నాయి. వాళ్లు చక్కని వ్యక్తిత్వం కలవారు. వాళ్ల వల్ల నాకు జీవితం కొత్తగా అనిపిస్తోంది. మా ఇంట్లో నాకు ఇప్పుడు ‘గర్ల్స్ సర్కిల్’ ఉంది అంటూ సరదాగా కామెంట్స్ చేశారు. 

Related Articles

Related image1
ఎన్టీఆర్ కి తెలిసే ఇదంతా జరిగిందా ? చిరంజీవికి దారుణ అవమానం.. కట్ చేస్తే 9 ఏళ్లలో సీన్ రివర్స్
Related image2
చిరంజీవి గ్యాంగ్ లీడర్ స్పీడుకి బ్రేకులు వేశా.. పవిత్ర లోకేష్ ముందు తన గొప్పలు చెప్పుకున్న నరేష్
35
నేను డిమాండ్ చేసే అత్తని కాదు 
Image Credit : Instagram

నేను డిమాండ్ చేసే అత్తని కాదు 

 అమల మాట్లాడుతూ నా కోడళ్ళు ఇద్దరూ  చాలా బిజీగా ఉంటారు. కానీ అది మంచిదే. యువతకు ఉత్సాహభరితమైన జీవితం ఉండటం చాలా అవసరం. వాళ్లు బిజీగా ఉన్నప్పుడు నేనూ నా పనుల్లోనే మునిగిపోతాను. అయితే సమయం దొరికినప్పుడు మేమంతా కలిసి చాలా ఆనందంగా గడుపుతాం. నేను డిమాండ్‌ చేసే అత్తగారిని కాదు. అలాగే నేను డిమాండ్‌ చేసే భార్యని కూడా కాదు,” అని చిరునవ్వుతో చెప్పింది.

45
పిల్లల విషయంలో నిర్లక్ష్యం ఉండదు 
Image Credit : Asianet News

పిల్లల విషయంలో నిర్లక్ష్యం ఉండదు 

నాగ చైతన్య, అఖిల్ అక్కినేని గురించి అమల మాట్లాడుతూ..“వాళ్లు అద్భుతమైన యువకులుగా ఎదిగారు. వాళ్లకు నాగార్జున గారంటే చాలా గౌరవం ఉంది. ఆయన వారిపై చాలా ప్రేమ చూపిస్తారు. నేను కూడా నా బాధ్యతల పట్ల కచ్చితంగా ఉంటాను. నా పిల్లల విషయంలో ఏదీ కూడా నిర్లక్ష్యం చేయను,” అని అమల పేర్కొంది.నాగార్జున 1984లో లక్ష్మీ దగ్గుబాటిని వివాహం చేసుకున్నారు. అయితే 1990లో వారిద్దరూ విడిపోయారు కానీ తమ కుమారుడు నాగ చైతన్యను ఇద్దరూ కలిసి పెంచారు. ఆ తర్వాత 1992లో నాగార్జున, నటి అమల అక్కినేని ని వివాహం చేసుకున్నారు. వారికి అఖిల్ అక్కినేని అనే కుమారుడు ఉన్నాడు.

55
నాగ చైతన్య, అఖిల్ ఇద్దరి పెళ్లిళ్లు పూర్తి
Image Credit : Asianet News

నాగ చైతన్య, అఖిల్ ఇద్దరి పెళ్లిళ్లు పూర్తి

నటుడు నాగ చైతన్య 2024లో నటి శోభిత ధూళిపాలను వివాహం చేసుకున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఆ వేడుకకు టాలీవుడ్ సినీ ప్రముఖులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. 2025లో అఖిల్ అక్కినేని, ముంబైకి చెందిన ఆర్టిస్ట్, ఎంట్రప్రెన్యూర్ అయిన జైనబ్ ని వివాహం చేసుకున్నారు. జైనబ్ వ్యాపారవేత్త కుటుంబానికి చెందిన అమ్మాయి.  

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
అక్కినేని నాగార్జున
నాగ చైతన్య
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Couple Friendly Movie Review: కపుల్‌ ఫ్రెండ్లీ మూవీ రివ్యూ, రేటింగ్‌.. ప్రేమికులకు పర్‌ఫెక్ట్ ఛాయిస్‌
Recommended image2
Funky Review: `ఫంకీ` మూవీ రివ్యూ, రేటింగ్‌.. విశ్వక్‌ సేన్‌, అనుదీప్‌ల కామెడీ సినిమా నవ్వించిందా?
Recommended image3
Nilave Review: `నిలవే` మూవీ రివ్యూ.. ఇంటెన్స్ లవ్‌ స్టోరీ ఎలా ఉందంటే?
Related Stories
Recommended image1
ఎన్టీఆర్ కి తెలిసే ఇదంతా జరిగిందా ? చిరంజీవికి దారుణ అవమానం.. కట్ చేస్తే 9 ఏళ్లలో సీన్ రివర్స్
Recommended image2
చిరంజీవి గ్యాంగ్ లీడర్ స్పీడుకి బ్రేకులు వేశా.. పవిత్ర లోకేష్ ముందు తన గొప్పలు చెప్పుకున్న నరేష్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved