MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Dried Lemon: ఎండిన నిమ్మకాయలు పారేయకుండా ఇలా తెలివిగా వాడండి

Dried Lemon: ఎండిన నిమ్మకాయలు పారేయకుండా ఇలా తెలివిగా వాడండి

Dried Lemon: ఎండిన నిమ్మకాయలను చాలా మంది బయటపడేస్తారు. నిజానికి ఇవి చాలా చాలా ఉపయోగపడతాయి.  వాటిలోని సహజ ఆమ్లాలు ఎండిపోయినా కూడా వాటిలోనే ఉంటాయి.  ఇంటిని మెరిపించేందుకు ఎండిన నిమ్మకాయలను ఎలా వాడాలో తెలుసుకోండి. 

2 Min read
Author : Haritha Chappa
Published : Dec 28 2025, 09:01 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఎండిన నిమ్మకాయలతో ఇలా
Image Credit : istockphoto.com

ఎండిన నిమ్మకాయలతో ఇలా

ప్రతి ఇంట్లో నిమ్మకాయలను అధికంగానే వాడుతాం. కొన్నిసార్లు అవి వాడకుండా అలా ఉండిపోయి వాడి ఎండిపోయినట్టు అవుతాయి. ఫ్రిజ్ లో పెట్టిన కూడా రెండు వారాల తరువాత అవి ఎండిపోతాయి. చాలా మంది అవి పనికిరావని బయటపడేస్తారు. నిజానికి ఎండిన నిమ్మకాయలు పడేయాల్సిన అవసరం లేదు. వాటిని తెలివిగా ఇంటి క్లీనింగ్ కోసం ఉపయోగపడతాయి. వాటిలోని సహజ ఆమ్లాలు ఇంటి పనులకు బాగా పనికొస్తాయి.

24
పాత్రలు, సింక్ శుభ్రం చేయడానికి
Image Credit : social media

పాత్రలు, సింక్ శుభ్రం చేయడానికి

ఎండిన నిమ్మకాయ సహజ క్లీనర్‌గా ఉపయోగపడుతుంది. మీ ఇంట్లో ఉన్న స్టీల్ లేదా రాగి పాత్రలపై కొద్దిగా ఉప్పు వేసి ఎండిన నిమ్మ ముక్కతో బాగా రుద్దాలి. ఇలా చేస్తే వాటిపై ఉన్న  మొండి మరకలను తొలగిస్తుంది.  వాటిని మెరిసేలా చేస్తుంది. ఎండిన నిమ్మకాయతో సింక్‌ను రుద్ది శుభ్రం చేసుకోచవ్చు. ఇది చాలా ఉపయోగకరమైన చిట్కా.

Related Articles

Related image1
Shambhala Nagaram: శంభాల నగరం మనదేశంలో ఎక్కడుంది? దీనికెందుకంత ప్రాధాన్యం?
Related image2
Simple Rangoli: కొత్త ఏడాదికి రంగుల ముగ్గులు.. వీటిని వేయడం చాలా సింపుల్
34
వంటగది కోసం
Image Credit : Asianet News

వంటగది కోసం

ఎండిన నిమ్మకాయను రెండు ముక్కలు చేసి స్టవ్ మీద లేదా మైక్రోవేవ్‌లో కాసేపు వేడి చేయండి. అప్పుడు నిమ్మ నుంచి మంచి సువాసన వస్తుంది. ఇది వంటగదిలోని చెడు వాసనను తొలగించడానికి సహాయపడుతుంది. ఒక్కసారి ఇలా చేసి చూడండి. ఈ చిట్కా ఎంతో ఉపయోగపడుతుంది.

అలాగే ఎండిన నిమ్మ ముక్కలను దాల్చినచెక్క, కర్పూరం, లవంగాలతో కలిపి ఒక చిన్న పలుచటి నెట్ సంచిలో ఉంచాలి. ఆ సంచిని బాత్రూమ్, కారులో పెడితే మంచిది. దీని నుంచి నెమ్మదిగా వాసన బయటికి వస్తుంది.

44
కీటకాలు, చీమలను తరిమికొట్టడానికి
Image Credit : Getty

కీటకాలు, చీమలను తరిమికొట్టడానికి

నిమ్మ నుంచి వచ్చే వాసన చాలా చీమలు, పురుగులు, కీటకాలకు నచ్చదు.  ఈ ఎండిన నిమ్మకాయ ముక్కలను ద్వారం దగ్గర లేదా వంటగది మూలల్లో ఉంచడం వల్ల కీటకాలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి. ఎండిన నిమ్మకాయను పొడి చేసి పెట్టుకోండి. ఈ పొడిని పెరుగు లేదా కలబంద గుజ్జుతో కలిపి హెయిర్ ప్యాక్ లా వేసుకోవచ్చు. ఇది తలపై చర్మాన్ని శుభ్రపరుస్తుంది. చుండ్రుతో బాధపడుతున్న వారికి ఇది మంచి చిట్కా.  వెంట్రుకలకు మంచి మెరుపును ఇస్తుంది.

అలాగే ఎండిన నిమ్మకాయను చిన్న ముక్కలుగా కోయండి. దాన్ని ఒక కాటన్ గుడ్డలో కట్టి మీ వార్డ్‌రోబ్ లేదా బూట్లు పెట్టే చోట ఉంచండి. ఇది అక్కడ చెడు వాసనను పీల్చేస్తుంది. అలాగే  తేమను కూడా పీల్చేస్తుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Cumin Water: జీలకర్ర నీళ్లు వీళ్లు మాత్రం తాగకూడదు, ఎందుకో తెలుసా?
Recommended image2
Diamond Earrings: డైమండ్ స్టడ్ ఇయర్ రింగ్స్.. సింపుల్ డిజైన్లు ఇవిగో
Recommended image3
Egg Yolk: గుడ్డులోని పచ్చసొన తింటే ఏమవుతుంది?
Related Stories
Recommended image1
Shambhala Nagaram: శంభాల నగరం మనదేశంలో ఎక్కడుంది? దీనికెందుకంత ప్రాధాన్యం?
Recommended image2
Simple Rangoli: కొత్త ఏడాదికి రంగుల ముగ్గులు.. వీటిని వేయడం చాలా సింపుల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved