Lifestyle: ఆవ నూనెతో ఇలా చేయండి.. జీవితంలో తెల్ల వెంట్రుకలు రావు
తెల్ల జుట్టు.. ఇటీవల చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో ఇదీ ఒకటి. ఒకప్పుడు వయసు మళ్లిన వారిలో మాత్రమే ఈ సమస్య కనిపించేది. కానీ ప్రస్తుతం పాతికేళ్లు కూడా నిండని వారు తెల్ల జుట్టుతో బాధపడుతున్నారు. అయితే తెల్ల జుట్టు సమస్యకు చెక్ పెట్టేందుకు కొన్ని నేచురల్ టిప్స్ ఉన్నాయి. అందులో ఒక దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఆవ నూనె తెల్ల జుట్టు సమస్యకు చెక్ పెట్టడంలో ఎంతో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఆవ నూనెను ఉపయోగించే సమయంలో కొన్ని పద్ధతులను పాటించాల్సి ఉంటుంది. ఇంతకీ ఆవ నూనెతో జుట్టు తెల్ల బడకుండా ఎలా చూసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆవ నూనె, హెన్నా మిశ్రమం:
హెన్నా జుట్టుకు సహజ రంగును ఇస్తుందని తెలిసిందే. అయితే దీనిని ఆవ నూనెతో కలిపినప్పుడు, దాని ప్రభావం రెట్టింపు అవుతుంది. ఒక గిన్నెలో హెన్నా పౌడర్ తీసుకుని, దానికి ఆవ నూనెను కొద్దికొద్దిగా కలపండి. ఈ పేస్ట్‌ను జుట్టుకు అప్లై చేసి 1-2 గంటలు అలాగే ఉంచి, ఆపై షాంపూతో కడిగేయండి. ఇలా రెగ్యులర్‌గా తీసుకుంటే తెల్ల వెంట్రుకలు తగ్గుతాయి.
ఆవ నూనె, నిమ్మకాయ:
నిమ్మకాయ జుట్టు మూలాలను శుభ్రపరుస్తుంది, చుండ్రును కూడా తొలగిస్తుంది. 2 టీస్పూన్ల ఆవ నూనెలో 1 టీస్పూన్ నిమ్మరసం కలిపి ఈ మిశ్రమంతో జుట్టుకు మసాజ్ చేయండి. వారానికి రెండుసార్లు ఇలా చేయడం వల్ల తెల్ల జుట్టు క్రమంగా నల్లగా మారడం ప్రారంభమవుతుంది. చుండ్రు కూడా తగ్గుతుంది.
ఆవాల నూనె, ఉల్లిపాయ రసం:
ఉల్లిపాయ రసం జుట్టుకు టానిక్ లాంటిది. ఉల్లిపాయ రసంలో ఆవ నూనెను సమాన పరిమాణంలో కలిపి తలకు పట్టించాలి. ఇది జుట్టు మూలాలను బలోపేతం చేస్తుంది. అలాగే తెల్ల జుట్టు సమస్యను తగ్గించడంలో క్రీయాశీలకంగా పనిచేస్తుంది.
ఆవాల నూనె, కరివేపాకు:
కరివేపాకును కొద్దిగా ఆవాల నూనెలో మరిగించి, చల్లారిన తర్వాత వడకట్టండి. ఈ నూనెతో మీ తలకు మసాజ్ చేయండి. కరివేపాకు జుట్టును సహజంగా నల్లగా మారుస్తుందని అంటారు. దీనిని ఆవ నూనెతో కలిపినప్పుడు, దాని ప్రభావం మరింత పెరుగుతుంది.
ఆవాల నూనె, ఆమ్లా:
ఆమ్లాను ఆవాల నూనెతో కలిపి ఉపయోగించవచ్చు. 2 టీస్పూన్ల ఆమ్లా పొడి లేదా ఆమ్లా రసం తీసుకోండి. దీన్ని 4-5 చెంచాల ఆవ నూనెతో బాగా కలపండి. తక్కువ మంట మీద తేలికగా వేడి చేయండి. చల్లారిన తర్వాత మసాజ్ చేసి, 2 గంటల తర్వాత జుట్టు కడుక్కోండి.
ఆవ నూనెను కొద్దిగా వేడి చేసి, ఆపై అప్లై చేయండి:
మీకు సమయం లేకపోతే, మీరు ఆవ నూనెను నేరుగా మీ జుట్టుకు కూడా అప్లై చేయవచ్చు. తలకు సున్నితంగా మసాజ్ చేసి రాత్రంతా అలాగే వదిలేయండి. ఉదయం షాంపూతో కడగాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే జుట్టు నల్లగా ఉంటుంది.