MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Weight loss with Flax Seeds: బరువు తగ్గేందుకు అవిసె గింజలు ఒక వరం, ఇలా తింటే అతి త్వరగా తగ్గుతారు

Weight loss with Flax Seeds: బరువు తగ్గేందుకు అవిసె గింజలు ఒక వరం, ఇలా తింటే అతి త్వరగా తగ్గుతారు

Weight loss with Flax Seeds: అధిక బరువు సమస్యతో బాధపడుతున్నవారి సంఖ్య అధికంగానే ఉంది. ముఖ్యంగా అవిసె గింజలను ఆహారంలో భాగం చేసుకుంటే మీరు బరువు త్వరగా తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంతో పెరుగుతో తింటే ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి.

1 Min read
Author : Haritha Chappa
Published : Nov 19 2025, 04:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బరువు తగ్గడానికి అవిసె గింజలు
Image Credit : Pixabay

బరువు తగ్గడానికి అవిసె గింజలు

నేటి కాలంలో అధిక బరువు, ఊబకాయం సమస్యతో బాధపడేవారు ఎంతో మంది. బరువు తగ్గడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగిపోతూ ఉంటారు. ఇలాంటి వారు అవిసె గింజలు తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. పెరుగుతో అవిసె గింజలు కలిపి తింటే ఇంకా వేగంగా బరువు తగ్గవచ్చు. పెరుగు అవిసె గింజల కాంబినేషన్ కూడా ఎంతో ఆరోగ్యకరమైనవి. ఇక బరువు తగ్గడానికి అవిసె గింజలు ఎలా తినాలో తెలుసుకోండి. 

25
పెరుగుతో తినడం వల్ల...
Image Credit : stockPhoto

పెరుగుతో తినడం వల్ల...

పెరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.  పెరుగు మన పొట్టలోని పేగులను శుభ్రపరుస్తుంది.  అలాగే మలబద్ధకానికి కూడా అద్భుతంగా పనిచేస్తుంది. పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణవ్యవస్థను బలపరుస్తాయి. అవిసె గింజలు కూడా ఒక సూపర్ ఫుడ్. ఈ గింజల్లో ఫైబర్, ఒమేగా-3, ప్రోటీన్లు, మినరల్స్ అధికంగా ఉంటాయి. ఇవన్నీ మన శరీరానికి అత్యవసరమైనవి.

Related Articles

Related image1
Curd in Winter: చలికాలంలో పెరుగు తింటే జలుబు వస్తుందా? పిల్లలకు పెట్టవచ్చా?
Related image2
ఓట్స్ ఫేస్ ప్యాక్ ఇలా వేశారంటే మచ్చలు మాయం
35
అవిసె గింజలు ఎలా ఉపయోగపడతాయి?
Image Credit : stockPhoto

అవిసె గింజలు ఎలా ఉపయోగపడతాయి?

 అవిసె గింజలతో వేగంగా బరువు తగ్గవచ్చు.  దీనిలోని ఫైబర్ పొట్ట నిండిన ఫీలింగ్ త్వరగా ఇస్తుంది. ఇది ఇతర ఆహారాలు తినకేండా ఆకలిని కూడా అదుపులో ఉంచుతుంది. ఈ గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్  ఉంటాయి. ఇవి వాపు, కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. కాబట్టి అవిసె గింజలు ఎంతో ఆరోగ్యకరం.

45
పెరుగుతో అవిసె గింజలు
Image Credit : stockPhoto

పెరుగుతో అవిసె గింజలు

పెరుగుతో అవిసె గింజలు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.  ఒక కళాయిలో రెండు చెంచాల అవిసె గింజలను వేయించి పొడి చేసి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో 4 చెంచాల తక్కువ కొవ్వు ఉన్న పెరుగులో ఈ పొడిని వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ పరగడుపున తింటే అద్భుతంగా పనిచేస్తుంది. కొన్ని రోజుల్లోనే బరువు తగ్గుతారు.

55
ఎవరు తినకూడదు?
Image Credit : stockPhoto

ఎవరు తినకూడదు?

అవిసె గింజలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. కానీ అందరూ వీటిని తినకూడదు. ముఖ్యంగా మలబద్ధకం, విరేచనాలు, హార్మోన్ల సమస్య, రక్తస్రావం, తక్కువ రక్తపోటు, తక్కువ చక్కెర సమస్య ఉన్నవారు అవిసె గింజలు తినడం మంచిది కాదని అంటారు. వీటిని తినే ముందు డాక్టర్‌ను సంప్రదించాలి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
ఆహారం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Cumin Water: జీలకర్ర నీళ్లు వీళ్లు మాత్రం తాగకూడదు, ఎందుకో తెలుసా?
Recommended image2
Diamond Earrings: డైమండ్ స్టడ్ ఇయర్ రింగ్స్.. సింపుల్ డిజైన్లు ఇవిగో
Recommended image3
Egg Yolk: గుడ్డులోని పచ్చసొన తింటే ఏమవుతుంది?
Related Stories
Recommended image1
Curd in Winter: చలికాలంలో పెరుగు తింటే జలుబు వస్తుందా? పిల్లలకు పెట్టవచ్చా?
Recommended image2
ఓట్స్ ఫేస్ ప్యాక్ ఇలా వేశారంటే మచ్చలు మాయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved