MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • Costly Non Veg: కిలో మాంసం ధ‌ర రూ. 31 ల‌క్ష‌లు.. ప్ర‌పంచంలో అత్యంత ఖ‌రీదైన మాంసాహారం ఇదే

Costly Non Veg: కిలో మాంసం ధ‌ర రూ. 31 ల‌క్ష‌లు.. ప్ర‌పంచంలో అత్యంత ఖ‌రీదైన మాంసాహారం ఇదే

Costly Non Veg: వెజ్‌తో పోల్చితే నాన్ వెజ్ ధ‌ర అధికంగా ఉంటుంద‌ని తెలిసిందే. ప్రపంచంలో కొన్ని నాన్‌వెజ్ వంటకాల ధ‌ర‌లు ల‌క్ష‌ల్లో ఉన్నాయ‌ని మీకు తెలుసా.? ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కొన్ని నాన్‌వెజ్ ఫుడ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

1 Min read
Author : Narender Vaitla
Published : Dec 28 2025, 12:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
అల్మాస్ క్యావియర్ (Almas Caviar)
Image Credit : Generated by google gemini AI

అల్మాస్ క్యావియర్ (Almas Caviar)

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నాన్‌వెజ్ ఫుడ్‌గా అల్మాస్ క్యావియర్ గుర్తింపు పొందింది. ఇది ఇరాన్ సమీపంలోని క్యాస్పియన్ సముద్రంలో లభించే అరుదైన ఆల్బినో బెలూగా స్టర్జన్ చేప గుడ్లతో తయారవుతుంది. ఈ చేప పెరిగేందుకు చాలా సంవత్సరాలు పడుతుంది. దాంతో క్యావియర్ కూడా చాలా అరుదుగా దొరుకుతుంది. దీని ధర కిలోకు 34,500 డాలర్లు వరకు ఉంటుంది. మ‌న క‌రెన్సీలో చెప్పాలంటే సుమారు రూ. 31 ల‌క్ష‌లు. ప్రత్యేకంగా 24 క్యారెట్ బంగారు డబ్బాల్లో విక్రయిస్తారు.

24
వాగ్యూ బీఫ్ (Wagyu Beef)
Image Credit : Generated by google gemini AI

వాగ్యూ బీఫ్ (Wagyu Beef)

జపాన్‌కు చెందిన వాగ్యూ బీఫ్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి. ఈ మాంసం కోసం పశువులను చాలా కఠినమైన నియమాలతో పెంచుతారు. ప్రత్యేక ఆహారం ఇస్తారు. మాంసంలో కొవ్వు సమానంగా పాకేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. దీని వల్ల మాంసం చాలా మృదువుగా ఉంటుంది. అసలైన జపనీస్ వాగ్యూ బీఫ్ ధర కిలోకు 500 నుంచి 600 డాలర్లు (రూ. 53,800) వరకు ఉంటుంది.

Related Articles

Related image1
Gig Workers: డిసెంబ‌ర్ 31న జొమాటో, స్విగ్గీ సేవ‌ల్ బంద్‌.. కార‌ణం ఏంటంటే.?
Related image2
Zodiac sign: ఈ 5 రాశుల వారు న‌క్క తోక తొక్కిన‌ట్లే.. ఈ వారం మీకు తిరుగు లేదంతే
34
అయామ్ సెమానీ (Ayam Cemani)
Image Credit : Generated by google gemini AI

అయామ్ సెమానీ (Ayam Cemani)

ఇండోనేషియాకు చెందిన అయామ్ సెమానీ ప్రపంచంలోనే అత్యంత అరుదైన కోళ్ల జాతుల్లో ఒకటి. ఈ కోడి ప్రత్యేకత ఏమిటంటే దీని చర్మం, మాంసం, ఎముకలు, లోపలి అవయవాలు కూడా పూర్తిగా నలుపు రంగులో ఉంటాయి. ఈ అరుదైన కోడి ధర 2,500 డాలర్లు (రూ. 2 ల‌క్ష‌ల పైమాటే) వరకు ఉంటుంది. అక్కడి సంస్కృతిలో దీనికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.

44
బ్లూఫిన్ ట్యూనా (Bluefin Tuna)
Image Credit : Generated by google gemini AI

బ్లూఫిన్ ట్యూనా (Bluefin Tuna)

బ్లూఫిన్ ట్యూనా చేపకు జపాన్‌లో చాలా గౌరవం ఉంది. ఈ చేప పొట్ట భాగంలోని మాంసం చాలా ఖరీదైనది. దీన్ని ఓటోరో అని పిలుస్తారు. ప్రసిద్ధ ఫిష్ మార్కెట్లలో ఈ చేపల వేలం కోట్ల రూపాయల్లో జరుగుతుంది. ప్రీమియం మాంసం ధర కిలోకు 5,000 (రూ. 45 ల‌క్ష‌లు) డాలర్లకు పైగా ఉండొచ్చు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఆహారం
ప్రపంచం
వైరల్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Oats benefits: వారంలో రెండుసార్లు ఓట్స్ తిని చూడండి.. మీ శ‌రీరంలో జ‌రిగే మార్పులివే
Recommended image2
Ginger: రోజూ అల్లం తీసుకుంటే ఏమౌతుంది?
Recommended image3
Heart Health: ఈ 8 సూపర్ ఫుడ్స్ తో మీ గుండె పదిలం!
Related Stories
Recommended image1
Gig Workers: డిసెంబ‌ర్ 31న జొమాటో, స్విగ్గీ సేవ‌ల్ బంద్‌.. కార‌ణం ఏంటంటే.?
Recommended image2
Zodiac sign: ఈ 5 రాశుల వారు న‌క్క తోక తొక్కిన‌ట్లే.. ఈ వారం మీకు తిరుగు లేదంతే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved