MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Zodiac sign: ఈ 5 రాశుల వారు న‌క్క తోక తొక్కిన‌ట్లే.. ఈ వారం మీకు తిరుగు లేదంతే

Zodiac sign: ఈ 5 రాశుల వారు న‌క్క తోక తొక్కిన‌ట్లే.. ఈ వారం మీకు తిరుగు లేదంతే

Zodiac sign: 2025 ఏడాది చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. ఈ ఏడాదిలో చివ‌రి వారం మిగిలి ఉంది. ఈ వారం 5 రాశుల వారికి క‌లిసొస్తుంద‌ని పండితులు చెబుతున్నారు. ఇంత‌కీ ఆ రాశులు ఏంటి.? ఈ వారం వారికి ఎలా ఉండ‌నుంది.? ఇప్పుడు తెలుసుకుందాం. 

2 Min read
Author : Narender Vaitla
Published : Dec 28 2025, 07:20 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తుల రాశి వారికి అదృష్టం క‌లిసి రానుంది
Image Credit : Getty

తుల రాశి వారికి అదృష్టం క‌లిసి రానుంది

ఈ కాలంలో తుల రాశి వారికి రాజయోగ ప్రభావం కనిపిస్తోంది. పెద్దగా శ్రమ లేకుండానే అనుకున్న పనులు పూర్తవుతాయి. విజయ సూచనలు బలంగా ఉన్నాయి. ఎదురయ్యే అవకాశాలను వదులుకోకుండా ఉపయోగించుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబ సభ్యుల సహకారం పూర్తి స్థాయిలో లభిస్తుంది. వృత్తి పరమైన నైపుణ్యాలు మరింత మెరుగవుతాయి. కష్టసమయంలో స్నేహితులు తోడుగా నిలుస్తారు. అదృష్టం అనుకోకుండా తలుపు తడుతుంది. లక్ష్మీనారాయణుల ఆరాధన శుభప్రదం.

25
కుంభ రాశి వారికి గుర్తింపు పెరుగుతుంది
Image Credit : our own

కుంభ రాశి వారికి గుర్తింపు పెరుగుతుంది

కుంభ రాశి వారికి కార్యసిద్ధి సూచనలు ఉన్నాయి. చేపట్టిన పనుల నుంచి సంతృప్తికరమైన ఫలితాలు అందుతాయి. సమాజంలో గుర్తింపు పెరుగుతుంది. మీ చర్యల వల్ల ఇతరులకు మేలు కలుగుతుంది. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి పదోన్నతి అవకాశాలు కనిపిస్తున్నాయి. దశమ సూర్యయోగ ప్రభావంతో జీవితం మరో మెట్టు ఎక్కుతుంది. అధికార సంబంధ లాభాలు పొందుతారు. ఆత్మవిశ్వాసం పెరిగి ఆర్థిక ప్రయోజనాలు అందుతాయి. బుధగ్రహ శ్లోకం జపించడం మంచిది.

Related Articles

Related image1
Weather Report: గ‌జ‌గ‌జ వ‌ణ‌కాల్సిందే, మ‌రింత పెర‌గ‌నున్న చ‌లి తీవ్ర‌త‌.. పూర్తిగా త‌గ్గేది ఎప్పుడంటే?
Related image2
న‌మ్మిన వారిని మోసం చేస్తే.. ఈ కాకికి పట్టిన గతే పడుతుంది. క‌చ్చితంగా చ‌ద‌వాల్సిన క‌థ‌
35
కన్య రాశి వారికి లాభాలు
Image Credit : Asianet News

కన్య రాశి వారికి లాభాలు

కన్య రాశి వారికి లక్ష్మీ అనుగ్రహం ల‌భిస్తుంది. భూమి, ఇల్లు, వాహనం సంబంధించిన యోగాలు కనిపిస్తున్నాయి. సమయానికి సరైన నిర్ణయాలు తీసుకోవడం లాభాన్ని ఇస్తుంది. కాలాన్ని సరిగ్గా వినియోగిస్తే ముందడుగు వేయగలుగుతారు. మనోబలం ప్రతి పనిలో దోహదపడుతుంది. ఇతరులతో వ్యవహరించేటప్పుడు మాటల్లో సౌమ్యత అవసరం. వారాంతానికి శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. సూర్యుని స్మరణ శుభఫలితాలను ఇస్తుంది

45
కర్కాటక రాశి వారికి విజ‌య సూచ‌న‌లు
Image Credit : our own

కర్కాటక రాశి వారికి విజ‌య సూచ‌న‌లు

కర్కాటక రాశి వారికి సంపూర్ణ విజయ సూచనలు కనిపిస్తున్నాయి. ఆత్మవిశ్వాసం పెరిగి ముందుకు నడిపిస్తుంది. అనుకున్న లక్ష్యాలను సాధించే అవకాశం ఉంది. చేసిన కృషికి తగిన ఫలితాలు అందుతాయి. కీలక విషయాల్లో అనుకూల నిర్ణయాలు వస్తాయి. శత్రువుల నుంచి వచ్చే ఇబ్బందులు తగ్గుతాయి. భూమి సంబంధ లాభాలు ఉన్నాయి. వ్యాపార రంగంలో ఉన్నవారు జాగ్రత్తగా వ్యవహరించాలి. విష్ణు సహస్రనామ స్మరణ మేలు చేస్తుంది.

55
ధనస్సు రాశి వారికి స‌మ‌స్య‌లున్నా..
Image Credit : our own

ధనస్సు రాశి వారికి స‌మ‌స్య‌లున్నా..

ధనస్సు రాశి వారికి దైవబలం తోడుగా ఉంటుంది. ఆదాయ మార్గాలపై దృష్టి కేంద్రీకరిస్తారు. ఎదురయ్యే సమస్యల నుంచి సులభంగా బయటపడతారు. గతంలో తీసుకున్న నిర్ణయాలను మార్చే ఆలోచన వద్దు. చివరి ఫలితాలు అనుకూలంగా మారతాయి. అభిప్రాయ భేదాలు తలెత్తకుండా సంయమనం అవసరం. కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండ‌డ‌మే మంచిది. లక్ష్య సాధనకు ఏకాగ్రత చాలా ముఖ్యం. వేంకటేశ్వర స్వామి స్మరణ శుభం కలిగిస్తుంది.

గమనిక: పైన తెలిపిన విషయాలు పలువురు పండితులు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా అందించడమైంది. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి. 

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
జ్యోతిష్యం
ఆధ్యాత్మిక విషయాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Birth Date: మొదటి సంతానం ఆడపిల్ల ఈ తేదీల్లో పుడితే..తండ్రికి లక్ష్మీ కటాక్షమే..!
Recommended image2
Numerology: ఈ తేదీల్లో పుడితే చిన్న వయసులోనే కోటీశ్వరులు అవుతారట
Recommended image3
Surya Gochar: మార్చిలో 4 సార్లు మారనున్న సూర్య గమనం, ఈ 3 రాశులకు లాటరీ తగిలినట్టే!
Related Stories
Recommended image1
Weather Report: గ‌జ‌గ‌జ వ‌ణ‌కాల్సిందే, మ‌రింత పెర‌గ‌నున్న చ‌లి తీవ్ర‌త‌.. పూర్తిగా త‌గ్గేది ఎప్పుడంటే?
Recommended image2
న‌మ్మిన వారిని మోసం చేస్తే.. ఈ కాకికి పట్టిన గతే పడుతుంది. క‌చ్చితంగా చ‌ద‌వాల్సిన క‌థ‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved