- Home
- Life
- Food
- Chicken Recipe: చికెన్ కర్రీ, చట్నీ కాదు.. టేస్టీగా చికెన్ కారం పొడి చేసేయండి, టేస్ట్ అదిరిపోతుంది..!
Chicken Recipe: చికెన్ కర్రీ, చట్నీ కాదు.. టేస్టీగా చికెన్ కారం పొడి చేసేయండి, టేస్ట్ అదిరిపోతుంది..!
Chicken Recipe: అన్నంలోకి లేదా ఇడ్లీ, దోశలోకి సైడ్ డిష్ గా అదిరిపోయే చికెన్ కారం పొడి తయారీ విధానం ఇక్కడ ఉంది. ఇది ఒక్కసారి చేసుకుంటే.. దాదాపు నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది.

చికెన్ కారం పొడి..
అన్నంలోకి రోజూ తినే పప్పు, కూరలు బోర్ కొట్టాయా? నోటికి ఏదైనా ఘాటుగా, రుచిగా తినాలనిపిస్తోందా? అయితే ఈ చికెన్ కారం పొడి మీ కోసమే. చికెన్ అనగానే మనలో చాలా మందికి బిర్యానీ, కర్రీ గుర్తుకు వస్తాయి. ఈ మధ్యకాలంలో కొందరు చికెన్ తో చట్నీ చేసుకుంటున్నారు. కానీ.. ఎప్పుడైనా చికెన్ కారం పొడి ఎలా చేయాలో తెలుసా? నెల రోజుల పాటు నిల్వ చేసుకునేలా చికెన్ కారం పొడి సింపుల్ గా చేసుకోవచ్చు
వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి, ఈ చికెన్ కారం పొడి వేసుకొని తింటే.. ఆ రుచే వేరు. ఇది కేవలం అన్నంలోకే కాదు.. ఇడ్లీ, దోశలోకి కూడా అద్భుతమైన సైడ్ డిష్ గా ఉంటుంది. ఒక్కసారి చేసుకుంటే నెల రోజుల పాటు నిల్వ ఉండే ఈ క్రిస్పీ అండ్ స్పైసీ చికెన్ కారం పొడిని పక్కా కొలతలతో, చాలా సులభంగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం..
కావాలసిన పదార్థాలు...
బోన్ లెన్ చికెన్ 250 గ్రాములు ( చిన్న ముక్కలుగా కోసినవి)
ఎండుమిర్చి - మీ కారానికి తగినట్లు..
ధనియాలు: 2 టేబుల్ స్పూన్లు
జీలకర్ర: 1 టేబుల్ స్పూన్
వెల్లుల్లి రెబ్బలు: 10-12
కరివేపాకు: 2 రెమ్మలు
ఉప్పు: రుచికి సరిపడా
పసుపు: పావు టీస్పూన్
నూనె: చికెన్ వేయించడానికి సరిపడా
తయారీ విధానం...
చికెన్ ప్రిపరేషన్... మొదట చికెన్ ముక్కలను శుభ్రంగా కడిగి, అందులో కొంచెం పసుపు, ఉప్పు వేసి ఉడికించాలి.చికెన్ లోని నీరంతా పోయి ముక్కలుగా డ్రైగా అయ్యే వరకు ఉడికించి పక్కన పెట్టుకోండి.
చికెన్ వేయించడం... బాణలిలో నూనె పోసి వేడయ్యాక, ఉడికించిన చికెన్ ముక్కలను వేసి ఎర్రగా, క్రిస్పీగా( గట్టిగా అయ్యే వరకు) వేయించి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి.
మసాలా దినుసులు: అదే బాణలిలో ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, కరివేపాకు వేసి దోరగా వేయించి చల్లారబెట్టాలి.
గ్రైండింగ్:
మొదట వేయించిన ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలను మిక్సీ జార్‌లో వేసి మెత్తగా పొడి చేయాలి.
ఇప్పుడు అదే జార్‌లో వేయించి పెట్టుకున్న క్రిస్పీ చికెన్ ముక్కలను వేసి ఒక్కసారి (Pulse mode) తిప్పాలి. చికెన్ మరీ మెత్తగా అవ్వకుండా, చిన్న చిన్న పలుకులుగా ఉండేలా చూసుకోండి.
చివరిగా: ఈ మిశ్రమాన్ని మళ్ళీ ఒకసారి బాణలిలో వేసి తక్కువ మంటపై 2 నిమిషాలు వేయించి చల్లారబెట్టండి. దీనివల్ల పొడిలో ఏవైనా తేమ ఉంటే పోయి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.
చిట్కాలు:
నిల్వ: ఈ పొడి పూర్తిగా చల్లారాక గాజు సీసాలో భద్రపరుచుకుంటే నెల రోజులు తాజాగా ఉంటుంది.
సర్వింగ్: వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి, ఈ చికెన్ కారం పొడి వేసుకుని తింటే రుచి అద్భుతంగా ఉంటుంది.

