Telugu

Meat Storage: ఫ్రిజ్ లో చికెన్, మటన్ ఇలా స్టోర్ చేస్తే తాజాగా ఉంటుంది

Telugu

సరైన పద్దతి ఇదే...

చాలా మంది ఒకేసారి 2 ,3 కేజీల మాంసం తెచ్చి ఫ్రిజ్ లో స్టోర్ చేస్తారు. కానీ పచ్చి మాంసంలో బాక్టీరియా తొందరగా పెరుగుతుంది. అందుకే సరైన పద్దతిలో నిల్వ చేయడం చాలా ముఖ్యం. 

Image credits: Getty
Telugu

పచ్చి మాంసం (చికెన్ లేదా మటన్)

పచ్చి మాంసాన్ని ఫ్రిజ్‌లో 1 నుంచి 2 రోజులు మాత్రమే ఉంచాలి. అంతకంటే ఎక్కువ రోజులు ఉంచితే చెడు వాసన రావడం మొదలవుతుంది.

Image credits: Getty
Telugu

ఉడికించిన మాంసం

వండిన మాంసాన్ని ఫ్రిజ్‌లో 3-4 రోజుల వరకు ఉంచి తినొచ్చు. కానీ వీలైనంత వరకు తాజాగా ఉన్నప్పుడే తినడం ఆరోగ్యానికి చాలా మంచిది.

Image credits: Getty
Telugu

శుభ్రపరచడం ముఖ్యం

మాంసం తెచ్చిన వెంటనే బాగా కడిగి, నీళ్లు లేకుండా ఆరబెట్టాలి. తేమ ఉంటే బ్యాక్టీరియా వేగంగా వ్యాపిస్తుంది.

Image credits: Getty
Telugu

ఎయిర్-టైట్ బాక్సులో పెట్టాలి

గాలి చొరబడని డబ్బాల్లో మాంసాన్ని పెట్టి ఫ్రీజర్‌లో ఉంచాలి. ఫ్రీజర్‌లోని ఉష్ణోగ్రత -18°C కంటే తక్కువగా ఉంటే చాలా మంచిది. ఫ్రీజ్ చేస్తే మాంసం ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది.

Image credits: Getty
Telugu

లేబుల్ అతికించండి

మాంసాన్ని ఫ్రిజ్‌లో పెట్టిన తేదీని ఒక చీటీపై రాసి, డబ్బా మీద అంటించాలి. దీనివల్ల అది ఎన్ని రోజుల కిందటిదో సులభంగా తెలుస్తుంది.

Image credits: Getty

Leftover Idli: ఇడ్లీలు మిగిలిపోయాయా? ఇలా టేస్టీ స్నాక్స్ చేసేయండి

Idli:పప్పు నానపెట్టేటప్పుడు ఇదొక స్పూన్ వేస్తే ఇడ్లీలు మెత్తగా వస్తాయి

Sambar Recipe: ఈ ఒక్క పొడి వేస్తే.. సాంబార్‍ టేస్ట్ అదిరిపోద్ది

Dosa: మినపప్పు, అటుకులు లేకుండా కేవలం ఈ ఒక్కదాంతో మెత్తటి దోశలు రెడీ!