MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • Milk: పాలను మళ్లీ మళ్లీ వేడి చేస్తే ఏమౌతుందో తెలుసా?

Milk: పాలను మళ్లీ మళ్లీ వేడి చేస్తే ఏమౌతుందో తెలుసా?

Milk: పాలు ఆరోగ్యానికి చాలా మంచివి. పాలను తాగడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి. అలాగే మన శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. కానీ పాలను పదే పదే వేడి చేసి తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

1 Min read
Author : Shivaleela Rajamoni
Published : Sep 30 2025, 12:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
పాలను మళ్లీ మళ్లీ వేడి చేస్తే?
Image Credit : istockphoto

పాలను మళ్లీ మళ్లీ వేడి చేస్తే?

చాలా మంది ఇండ్లలో పిల్లలు, పెద్దలు ప్రతిరోజూ పాలను తాగుతుంటారు. ముఖ్యంగా చిన్న పిల్లలున్న ఇంట్లో 24 గంటలూ పాలు ఉంటాయి. ప్యాకెట్ పాలు, ఆవు పాలు ఇలా వారి సౌకర్యాన్ని బట్టి ఇంట్లో తెచ్చిపెడుతుంటారు. ఇక  ఇంట్లో ఎప్పుడూ పాలు ఉండటం వల్ల పాలను ఎప్పుడు పడితే అప్పుడు పాలను వేడి చేసుకుని తాగుతుంటారు. మళ్లీ ప్రిజ్ లో పెట్టేస్తుంటారు. 

24
పాలను పదే పదే వేడి చేయడం మంచిదేనా?
Image Credit : istockphoto

పాలను పదే పదే వేడి చేయడం మంచిదేనా?

పాలను మీరు ఉపయోగించి ప్రతిసారీ వేడి చేయడం అస్సలు మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పాలను వేడి చేయడం వల్ల అవి పాడవవు. అందుకే వేడి చేస్తుంటాం అని చాలా మంది అంటుంటారు. కానీ పాలను మళ్లీ మళ్లీ మరిగించడం మంచిది కాదు. 

Related Articles

Related image1
Perfume: పెర్ఫ్యూమ్ ను వాడేటప్పుడు ఇలా మాత్రం చేయకండి
Related image2
dussehra: దసరా నాడు జమ్మి ఆకుల్ని ఇంటికి తెచ్చుకుంటే ఏమౌతుందో తెలుసా?
34
పదే పదే వేడి చేసిన పాలను తాగడం వల్ల వచ్చే సమస్యలు
Image Credit : istockphoto

పదే పదే వేడి చేసిన పాలను తాగడం వల్ల వచ్చే సమస్యలు

పాలను ఎక్కువ సార్లు వేడి చేయడం వల్ల వాటిలో కొన్ని హానికరమైన రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. ఇవి రక్త నాళాలను గట్టిపరుస్స్తాయి. ఇలా పాలను తాగితే ఎర్ర రక్తకణాలు గట్టిపడి వాటి స్థితిస్థాపకత దెబ్బతింటుంది. అంతేకాదు రక్త ప్రసరణ కూడా సరిగ్గా ఉండదు. దీంతో రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడి కాలెయ వాపు, గుండెపోటు వంటి సమస్యలు వస్తాయి. 

44
పాలను మళ్లీ మళ్లీ వేడి చేసి తాగితే?
Image Credit : istockphoto

పాలను మళ్లీ మళ్లీ వేడి చేసి తాగితే?

పాలను పదే పదే వేడి చేయడం, వాటిని చల్లార్చి తాగడం వల్ల పాలలో ఉండే పోషకాలు తగ్గుతాయని నిపుణులు అంటున్నారు. పాలను పదే పదే వేడి చేయడం వల్ల పాలలోని విటమిన్లు, ప్రోటీన్లు, విటమిన్ బి, విటమిన్ డి లు తగ్గుతాయి. ఇలాంటి  పాలను తాగడం వల్ల మీకు ఎలాంటి ప్రయోజనం కలగదు. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
జీవనశైలి
ఆహారం
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Cumin Water: జీలకర్ర నీళ్లు వీళ్లు మాత్రం తాగకూడదు, ఎందుకో తెలుసా?
Recommended image2
Mutton: మటన్ కర్రీ జ్యూసీగా , రుచిగా రావాలా? ఇదొక్కటి వేస్తే చాలు
Recommended image3
Food: అంగ‌న్వాడీ బాలామృతంతో అదిరిపోయే బిస్కెట్స్‌.. ఇది తెలిస్తే ఇక‌పై చచ్చినా ప‌డేయ‌రు
Related Stories
Recommended image1
Perfume: పెర్ఫ్యూమ్ ను వాడేటప్పుడు ఇలా మాత్రం చేయకండి
Recommended image2
dussehra: దసరా నాడు జమ్మి ఆకుల్ని ఇంటికి తెచ్చుకుంటే ఏమౌతుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved