MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Proverb: గతికితే అతకదు.. సామెత వెన‌కాల ఉన్న అస‌లు అర్థం ఏంటో తెలుసా.?

Proverb: గతికితే అతకదు.. సామెత వెన‌కాల ఉన్న అస‌లు అర్థం ఏంటో తెలుసా.?

Proverb: సామెత‌లు చిన్న‌గా ఉన్నా వాటిలో ఎంతో అర్థం ఉంటుంది. మోటివేష‌న్‌తో పాటు జీవిత సారాన్ని విడ‌మ‌రిచి చెబుతుంటాయి. అలాంటి ఒక సామెత గ‌తికితే అత‌క‌దు. ఇంత‌కీ దీని అర్థమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

2 Min read
Author : Narender Vaitla
Published : Oct 15 2025, 01:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఒక‌ప్పుడు పెళ్లి చూపుల్లో ఆచారం
Image Credit : Generated by google gemini AI

ఒక‌ప్పుడు పెళ్లి చూపుల్లో ఆచారం

కొన్నేళ్ల క్రితం పెళ్లి చూపులు అంటే ఒక పెద్ద కార్యక్రమం. అబ్బాయి వారి కుటుంబం, బంధువులు కలిసి అమ్మాయి ఇంటికి వెళ్ళేవారు. కానీ, అక్కడ మొదట చూపేది అమ్మాయిని కాదు.. అబ్బాయి ప్రవర్తన, భోజన సమయంలో అబ్బాయి ఎలా కూర్చుంటాడు, ఎలా తింటాడు, ఎలా మాట్లాడతాడు. ఇవన్నీ ఆ కుటుంబం జాగ్రత్తగా గమనించేది. ఎందుకంటే, ఒక మనిషి నిజ స్వభావం భోజన పద్ధతిలో కనిపిస్తుందని వారు నమ్మేవారు.

25
భోజనం ద్వారా వ్యక్తిత్వ అంచన
Image Credit : Generated by google gemini AI

భోజనం ద్వారా వ్యక్తిత్వ అంచన

అమ్మాయి కుటుంబం ముందుగా విందు ఏర్పాటు చేసేది. అబ్బాయి తినే తీరు, అతని శైలి, చేతి కదలికలు.. ఇవన్నీ ఒక “పరీక్ష” లా ఉండేవి.

* అబ్బాయి శాంతంగా తింటే ఓర్పు కలవాడని.

* అవసరానికి మించి తింటే లోభి అని అర్థం.

* జాగ్రత్తగా తింటే నియంత్రణ గల వ్యక్తి అని భావించేవారు.

ఇది కేవలం భోజనం కాదు.. మనసు అంచనా వేసే పద్ధతి అని అర్థం.

Related Articles

Related image1
Andhra pradesh: ఏపీలో మ‌రో హైటెక్ సిటీ.. దెబ్బ‌కు ఈ ప్రాంత ప్ర‌జ‌ల రాత మార‌నుంది.
Related image2
Budget Bikes: ధ‌ర త‌క్కువ ఫీచ‌ర్లు ఎక్కువ‌.. టాప్ 5 బెస్ట్ బ‌డ్జెట్ బైక్స్ ఇవే. మినిమం 70 మైలేజ్
35
కూర్చునే తీరు కూడా..
Image Credit : Generated by google gemini AI

కూర్చునే తీరు కూడా..

* అబ్బాయి కూర్చోవడం కూడా చాలా ప్రాధాన్యం కలిగిన విషయం.

పద్మాసనంలో కూర్చుంటే సౌమ్యుడని, నడుము నిటారుగా ఉంచుకుంటే ఆత్మవిశ్వాసం గలవాడని, మంచి భంగిమతో కూర్చుంటే సంస్కారం ఉన్నవాడని నిర్ణయించేవారు. చిన్న చిట్కాలు కూడా పెద్ద అర్ధం చెప్పేవి.

45
తినే విధానం – గుణగణాల ప్రతిబింబం
Image Credit : Generated by google gemini AI

తినే విధానం – గుణగణాల ప్రతిబింబం

పాతకాలంలో “తినే తీరు” ద్వారా అబ్బాయి గుణాలు తెలుసుకునేవారు. వేళ్ల మధ్య నుంచి అన్నం పడితే దాన్ని లక్ష్మీ దూరం అవుతుందని భావించేవారు. బాగా నమలుతూ తినేవాడు ఓర్పు గలవాడని, తొందరగా తినేవాడు ఆవేశపరుడని, మొదట కారం తినేవాడు కోపిష్టి అని, ప్రతి వంటకం రుచి చూసేవాడు సమతుల్యమైన మనస్తత్వం కలవాడని చెప్పేవారు. ఈ విధంగా ఒక భోజనం ద్వారా మొత్తం మనిషిని అంచనా వేసేవారు.

55
“గతికితే అతకదు” అంటే..
Image Credit : Generated by google gemini AI

“గతికితే అతకదు” అంటే..

విందు అనంతరం అమ్మాయి వారు ఒక నిర్ణయానికి వచ్చేవారు. అబ్బాయి ప్రవర్తన, భోజన తీరు, మాటతీరు చూసి “సంబంధం కుదరుతుందా?” అని తేల్చేవారు. దీంతో ఈ నానుడి పాపుల‌ర్ అయ్యింది. “గతికితే అతకదు” అంటే, “తినే తీరు నచ్చకపోతే, సంబంధం కుదరదు” అని అర్థం. ఇది కేవ‌లం భోజ‌నం గురించి మాత్ర‌మే కాదు.. వ్యక్తిత్వం, సంస్కారం, గుణగణాలు అన్నీ కలిపి చూసే ఒక పాత పద్ధతి.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఫీల్ గుడ్ న్యూస్
వైరల్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
అతి సమాచారం ప్రమాదకరం.. 'ఇన్ఫోబేసిటీ' రోగం ఖాయం..!
Recommended image2
అమెరికా అర్చకుల ముందు ఐటీ ఉద్యోగులు జూజుబి.. ఒక్కో అయ్యవారి ఆదాయం ఎంతో తెలుసా..?
Recommended image3
Top 5 Mysterious Places : ఇళ్లకు తలుపులే ఉండవు, పాములతో కలిసి జీవనం.. ఇండియాలో టాప్ 5 వింత గ్రామాలు..!
Related Stories
Recommended image1
Andhra pradesh: ఏపీలో మ‌రో హైటెక్ సిటీ.. దెబ్బ‌కు ఈ ప్రాంత ప్ర‌జ‌ల రాత మార‌నుంది.
Recommended image2
Budget Bikes: ధ‌ర త‌క్కువ ఫీచ‌ర్లు ఎక్కువ‌.. టాప్ 5 బెస్ట్ బ‌డ్జెట్ బైక్స్ ఇవే. మినిమం 70 మైలేజ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved