MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఒకప్పుడు విజయశాంతికి ఆయన పర్సనల్ మేకప్ మెన్..ఇప్పుడు 200 కోట్ల సినిమా నిర్మించే స్టార్ ప్రొడ్యూసర్

ఒకప్పుడు విజయశాంతికి ఆయన పర్సనల్ మేకప్ మెన్..ఇప్పుడు 200 కోట్ల సినిమా నిర్మించే స్టార్ ప్రొడ్యూసర్

విజయశాంతికి మేకప్ మెన్ గా పనిచేసిన వ్యక్తి ఆ తర్వాత నిర్మాతగా ఎదిగి ఆమెతోనే కర్తవ్యం చిత్రాన్ని రూపొందించారని తెలుసా? కానీ ఇది నిజం.. ఈ చిత్రాన్ని నిర్మించింది ఎవరో తెలుసా.. ఇప్పుడు తెలుసుకుందాం.   

2 Min read
Author : Tirumala Dornala
Published : Jul 05 2025, 08:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Image Credit : our own

టాలీవుడ్ లో విజయశాంతి లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు పొందారు. కర్తవ్యం చిత్రంతో విజయశాంతికి టాలీవుడ్ లో తిరుగులేని స్టార్ డమ్ వచ్చింది. ఈ మూవీ తో విజయశాంతి స్టార్ హీరోలకు పోటీనిచ్చే స్థాయికి ఎదిగింది. ఈ చిత్రం తర్వాత ఆమెని అంతా లేడీ అమితాబ్ అని పిలవడం ప్రారంభించారు.

25
Image Credit : Facebook

విజయశాంతికి మేకప్ మెన్ గా పనిచేసిన వ్యక్తి ఆ తర్వాత నిర్మాతగా ఎదిగి ఆమెతోనే కర్తవ్యం చిత్రాన్ని రూపొందించారని తెలుసా? కానీ ఇది నిజం.. ఈ చిత్రాన్ని నిర్మించింది ఎవరో కాదు.. స్టార్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం. ఆయన తన కెరీర్ ని మేకప్ మెన్ గా ప్రారంభించారు. ఏఎం రత్నం విజయశాంతికి పర్సనల్ మేకప్ మెన్ గా చాలా చిత్రాలకు పనిచేశారు.

Related Articles

Related image1
చిరంజీవి తొత్తువి నువ్వు, పరిటాల రవి ముందే నటుడికి మోహన్ బాబు వార్నింగ్.. గొడవ ఎలా మొదలైందంటే
Related image2
ఆ సంగతి తెలిసి ఉంటే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చేసేవాడిని, శివాజీ కామెంట్స్..హౌస్ లో అలాంటి పనులు..
35
Image Credit : iDream Media

విజయశాంతితో ఉన్న పరిచయంతో కర్తవ్యం కథ సిద్ధం చేసి ఆ చిత్రాన్ని స్వయంగా నిర్మించారు. కర్తవ్యం మూవీ సంచలనం విజయం సాధించింది. ఆ తర్వాత ఏం రత్నం అటు తమిళం ఇటు తెలుగు భాషల్లో తిరుగులేని నిర్మాతగా అవతరించాడు. ఒకే ఒక్కడు, భారతీయుడు, ఖుషి, స్నేహం కోసం, బాయ్స్, 7G బృందావన కాలనీ లాంటి విజయవంతమైన చిత్రాలని ఏఎం రత్నం నిర్మించారు. కర్తవ్యం చిత్రాన్ని తమిళంలో కూడా రీమేక్ చేశారు. ఈ మూవీ తమిళంలో రిలీజ్ అయినప్పుడు కొన్ని వేలమంది అమ్మాయిలు పోలీస్ ఉద్యోగాల కోసం అప్లై చేసుకున్నారట. కర్తవ్యం చిత్రంతో తనకి దక్కిన సంతృప్తి అది అని ఏఎం రత్నం తెలిపారు. 

45
Image Credit : X/Mega Surya Production

తాజాగా ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో 200 కోట్ల భారీ బడ్జెట్ లో హరిహర వీరమల్లు చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ జూలై 24న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ సౌత్ ఇండియాలోనే 24 గంటల్లో అత్యధికంగా 48 మిలియన్ల వ్యూస్ తో ఆల్ టైం రికార్డ్ సాధించింది.

55
Image Credit : Youtube

ఈ చిత్రాన్ని ఏఎం రత్నం తనయుడు జ్యోతి కృష్ణ తెరకెక్కించారు. ముందుగా ఈ మూవీ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ప్రారంభమైంది. కొంత భాగం షూటింగ్ జరిగాక ఆయన ఈ చిత్రం నుంచి తప్పుకున్నారు. దీంతో జ్యోతి కృష్ణ హరిహర వీరమల్లు దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. ఈ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఔరంగజేబ్ పాత్రలో నటిస్తున్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Funky Collections: `ఫంకీ` మూవీ ఫస్ట్ డే బాక్సాఫీసు.. అనుదీప్‌ దెబ్బకి విశ్వక్‌ సేన్‌ జాక్‌ పాట్‌
Recommended image2
The Raja Saab : డూప్‌తో యాక్షన్ సీన్స్.. ప్రభాస్ హీరోయిన్ మాళవిక మోహనన్ క్లారిటీ
Recommended image3
Maheshbabu ని రెండు సార్లు రిజెక్ట్ చేసిన స్టార్‌ హీరోయిన్‌ ఎవరో తెలుసా? మహేష్‌ అభిమానులకు తీరని కోరికే
Related Stories
Recommended image1
చిరంజీవి తొత్తువి నువ్వు, పరిటాల రవి ముందే నటుడికి మోహన్ బాబు వార్నింగ్.. గొడవ ఎలా మొదలైందంటే
Recommended image2
ఆ సంగతి తెలిసి ఉంటే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చేసేవాడిని, శివాజీ కామెంట్స్..హౌస్ లో అలాంటి పనులు..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved