MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఉదయ్ కిరణ్ రిజెక్ట్ చేయడంతో.. మహేష్ బాబు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమా ఏదో తెలుసా?

ఉదయ్ కిరణ్ రిజెక్ట్ చేయడంతో.. మహేష్ బాబు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమా ఏదో తెలుసా?

చాలా తక్కువ టైమ్ లో భారీ ఫాలోయింగ్ సాధించిన హీరో ఉదయ్ కిరణ్. చిన్న వయసులో కన్నుమూసి.. అభిమానులకు విషాదం మిగిల్చాడు. ఉదయ్ కిరణ్ ఓ సినిమాను చేసి ఉంటే.. ఆయనకు ఆ పరిస్థితి వచ్చి ఉండేది కాదా..? యంగ్ హీరో మిస్సైన మహేష్ బాబు బ్లాక్ బస్టర్ మూవీ ఏదో తెలుసా?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Feb 13 2026, 08:04 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
చిన్నవయసులో తిరిగిరాని లోకాలకు..
Image Credit : Asianet News

చిన్నవయసులో తిరిగిరాని లోకాలకు..

టాలీవుడ్‌లో ఎంతో వేగంగా స్టార్ హీరోగా ఎదిగి, అదే వేగంతో డౌన్ ఫాల్‌ను ఎదుర్కొన్న నటుల్లో ఉదయ్ కిరణ్ ఒకరు. యువతలో ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించిన ఈ హీరో, జీవితంలో ఎదురైన ప్రతికూల పరిస్థితులతో తీవ్రంగా ప్రభావితమయ్యారు. ఒక దశలో సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో డిప్రెషన్‌కు లోనై, 2014లో తన నివాసంలోనే బలవన్మరణానికి పాల్పడ్డారు. ఎంతో భవిష్యత్తు ఉన్న యంగ్ స్టార్.. కేవలం 33 ఏళ్ల వయసులో మరణించడం ఫిల్మ్ ఇండస్ట్రీని తీవ్రంగా కలచివేసింది.

25
ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బ్లాస్టర్ హిట్..
Image Credit : facebook.com/UdayKiran.OfficialPage

ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బ్లాస్టర్ హిట్..

చిత్రం సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఉదయ్ కిరణ్.. ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి మంచి గుర్తింపు పొందారు. ఆ వెంటనే ఆయనకు అనుకోకుండా నువ్వు నేను సినిమా అవకాశం వచ్చింది. నిజానికి ఈసినిమాను తరుణ్ హీరోగా తెరకెక్కించాలి అనుకున్నారు. కానీ అతను బిజీగా ఉండటంతో ఉదయ్ కిరణ్ కు అదృష్ట అప్పుడు కలిసి వచ్చింది. నువ్వు నేను సినిమా కూడా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. యూత్ ఆడియన్స్ లో ఉదయ్ కిరణ్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. వరుసగా అవకాశాలు అతని తలుపు తట్టాయి.

Related Articles

Related image1
BB జోడీ 2 కోసం రీతూ చౌదరి, డిమోన్ పవన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో తెలుసా?
Related image2
Mahesh Babu Home Tour : వావ్ అనాల్సిందే.. మహేష్ బాబు ఇంద్రభవనం లోపల ఎలా ఉందో చూశారా?
35
తక్కువ టైమ్ లో స్టార్ గా ఎదిగిన ఉదయ్ కిరణ్..
Image Credit : X / @CineLoversTFI

తక్కువ టైమ్ లో స్టార్ గా ఎదిగిన ఉదయ్ కిరణ్..

ఇక ఉదయ్ కిరణ్ వరుసగా ‘మనసంతా నువ్వే’, ‘కలుసుకోవాలని’, ‘హోలీ’, ‘నీ స్నేహం’, ‘ఔనన్నా కాదన్నా’ వంటి ప్రేమకథా చిత్రాలతో యూత్ ఆడియన్స్ ను కంప్లీట్ గా తనవైపు తిప్పుకున్నాడు. లవర్ బాయ్ గా అమ్మాయిల హృదయాల్లో స్థానం సంపాదించారు. 

చిన్న వయసులోనే ఫిల్మ్ ఫేర్ వంటి ప్రతిష్ఠాత్మక అవార్డులను కూడా అందుకున్నారు. కానీ ఒక దశలో వరుస ఫ్లాపులు ఆయన కెరీర్‌ను ప్రభావితం చేశాయి. ‘ఔనన్నా కాదన్నా’ తర్వాత దాదాపు పది సినిమాల్లో నటించినప్పటికీ, ఏ ఒక్క చిత్రం కూడా విజయాన్ని సాధించలేదు. ఈ పరిస్థితులు ఆయన భవిష్యత్తుపై ప్రభావం చూపించాయి.

45
ఉదయ్ కిరణ్ మిస్సైన బ్లాక్ బస్టర్ హిట్ సినిమా..
Image Credit : Athadu Movie\Jayabheri Creations

ఉదయ్ కిరణ్ మిస్సైన బ్లాక్ బస్టర్ హిట్ సినిమా..

ఉదయ్ కిరణ్ తన కెరీర్ లో ఓ సినిమా మిస్ అయ్యి చాలా తప్పు చేశాడు.. ఆ సినిమా చేసి ఉంటే ఆయన కెరీర్ ఓ రేంజ్ లో ఉండేది. ఆమూవీ మరేదో కాదు అతడు. మహేష్ బాబు కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన అతడు మొదట ఉదయ్ కిరణ్‌కు ఆఫర్ చేశారు. ఫస్ట్ సినిమ చిత్రం తరువాత ఈసినిమా ఆఫర్ ఆయనకు వచ్చిందట. 

నువ్వు నేను తో మరో హిట్ కొట్టడంతో.. అతను సినిమాను ఉదయ్ తోనే చేయాలని ఫిక్స్ అయ్యారట. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2005లో విడుదలై ఘనవిజయం సాధించింది. అయితే ఈసినిమాను ఉదయ్ కిరణ్ ఎలా మిస్ అయ్యాడు?

55
మురళీ మోహన్ ఏమన్నాడంటే?
Image Credit : Youtube/Mahesh Babu

మురళీ మోహన్ ఏమన్నాడంటే?

ఈ విషయాన్ని ఆ సినిమా నిర్మాత... ప్రముఖ నటుడు మురళీ మోహన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. మరళీ మోహన్ మాట్లాడుతూ.. '' ఉదయ్ కిరణ్ చిత్రం సినిమా సూపర్ హిట్ అయిన తరువాత నేను అతనికి ఫోన్ చేశాను. బాగా చేశావయ్య..మంచి భవిష్యత్తుఉంది నీకు అని చెప్పాను. దాంతో అతను మురళీ మోహన్ గారు మీరు ఫోన్ చేశారా.. చాలాసంతోషం అండీ.. నేను వచ్చి కలుస్తాను అని అన్నాడు.. చెప్పినట్టే ఇంటికి వచ్చి కలిశాడు. 

అతడు సినిమాను ఉదయ్ కిరణ్ తోనే ప్లాన్ చేశాము. అతను కూడా చేస్తా అన్నాడు. ఆసినిమా స్టార్ట్ అయ్యే టైమ్ కి చిరంజీవి గారి కూతురితో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అవ్వడం.. ఆతరువాత ఓ కన్ఫ్యూజన్ లో అతను ఉండిపోయాడు. ఆతరువాత అడిగితే.. అయ్యో నేను మర్చిపోయానండి.. ఇప్పుడు డేట్స్ వేరే సినిమాకు ఉన్నాయి.. అన్నాడు. నెక్ట్స్ ఇయర్ వరకు ఆగాల్సి రావడంతో.. ఈ కథ మహేష్ దగ్గరకు వెళ్లింది'' అని మురళీ మోహన్ అన్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
ఉదయ్ కిరణ్
మహేష్ బాబు ఘట్టమనేని
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Prime Video Top 10 Movies: ఓటీటీలో `నారీ నారీ నడుమ మురారి` సంచలనం.. ఇండియా వైడ్‌గా ట్రెండింగ్‌.. టాప్‌ 10 మూవీస్‌
Recommended image2
Rajinikanth MGR: రజినీ జీవితాన్ని మార్చేసిన ఎంజీఆర్ 'మాస్టర్ ప్లాన్'! ఆ స్టైల్ ఎందుకంత నచ్చలేదంటే?
Recommended image3
Zero Flop Record: ఫ్లాప్ ఎరుగని హీరో.. చేసిన 3 సినిమాలు బ్లాక్‌బస్టర్.. ఎవరో తెలుసా?
Related Stories
Recommended image1
BB జోడీ 2 కోసం రీతూ చౌదరి, డిమోన్ పవన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో తెలుసా?
Recommended image2
Mahesh Babu Home Tour : వావ్ అనాల్సిందే.. మహేష్ బాబు ఇంద్రభవనం లోపల ఎలా ఉందో చూశారా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved