MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చివరి మూవీ టైంలో తన కెరీర్ పతనం గురించి ఉదయ్ కిరణ్ ఏం మాట్లాడారో తెలుసా.. తప్పు జరిగింది అక్కడేనా ?

చివరి మూవీ టైంలో తన కెరీర్ పతనం గురించి ఉదయ్ కిరణ్ ఏం మాట్లాడారో తెలుసా.. తప్పు జరిగింది అక్కడేనా ?

చివరి మూవీ టైంలో ఉదయ్ కిరణ్ తన కెరీర్ డౌన్ ఫాల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కెరీర్ పతనం కావడానికి ఉదయ్ కిరణ్ ఏం కారణాలు చెప్పారో ఈ కథనంలో తెలుసుకోండి. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Sep 06 2025, 12:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Image Credit : Asianet News

దివంగత నటుడు ఉదయ్ కిరణ్ కెరీర్, జీవితం విషాద భరితంగా ముగిసింది. 2014లో ఉదయ్ కిరణ్ మరణించారు. ఉదయ్ కిరణ్ సినీ జీవితం సంచలనాలతో మొదలైంది. మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఉదయ్ కిరణ్ 2000 సంవత్సరంలో తేజ దర్శకత్వంలో చిత్రం మూవీలో నటించే ఛాన్స్ దక్కించుకున్నాడు. ఉదయ్ కిరణ్ కెరీర్ కి తొలి టర్నింగ్ పాయింట్ అదే.

25
Image Credit : google

ఆ తర్వాత నువ్వు నేను, మనసంతా నువ్వే చిత్రాలు కూడా బ్లాక్ బస్టర్ అయ్యాయి. దీనితో ఉదయ్ కిరణ్ టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు. లవర్ బాయ్ గా విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఉదయ్ కిరణ్ నటించిన చివరి చిత్రం జై శ్రీరామ్. ఈ మూవీ టైంలో తన కెరీర్ పతనం గురించి ఉదయ్ కిరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆరంభంలో జోరు ప్రదర్శించిన ఉదయ్ కిరణ్ కి ఆ తర్వాత వరుస పరాజయాలు ఎదురయ్యాయి. ఈ విషయంలో చిత్ర పరిశ్రమలో, అభిమానుల్లో చాలా రూమర్స్ ప్రచారం లో ఉన్నాయి. 

Related Articles

Related image1
బాలకృష్ణ ఇంట్లో అసలేం జరిగింది, వెక్కి వెక్కి ఏడ్చిన హీరోయిన్.. రెండున్నరేళ్లు భరించాను అంటూ కామెంట్స్
Related image2
కృష్ణంరాజుని తక్కువ అంచనా వేసి చావుదెబ్బ తిన్న బాలయ్య, బొబ్బిలి బ్రహ్మన్నకి పోటీగా వెళ్లడంతో అట్టర్ ఫ్లాప్
35
Image Credit : google

ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ.. నా కెరీర్ ని అద్భుతమైన జర్నీగా భావిస్తాను. తొలి మూడు చిత్రాలు హ్యాట్రిక్ హిట్స్ కావడంతో నా కెరీర్ మారిపోయింది. అలాంటి చిత్రాల్లో నటించడం నా అదృష్టం. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన నేను ఇంత సాధిస్తానని అనుకోలేదు. 

45
Image Credit : our own

ఆ తర్వాత వరుస ఫ్లాపులు పడడంపై ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ.. సమస్య ఎక్కడ వచ్చింది అంటే తొలి మూడు చిత్రాలతో హిమాలయాల అంత ఎత్తైన సక్సెస్ సాధించాను. ఆ సక్సెస్ ముందు మిగిలిన చిత్రాలు తేలిపోయాయి. ఫ్లాపులు పడ్డ సమయంలో కూడా నా కెరీర్ లో చాలా బ్యూటిఫుల్ మూమెంట్స్ ఉన్నాయి. కానీ అవి ఎవరికీ కనిపించలేదు. ఎందుకంటే చిన్న దెబ్బ తగిలినా మీడియా ముందుకు వచ్చి పబ్లిసిటీ చేసుకునే వ్యక్తిని నేను కాదు. 

55
Image Credit : our own

లెజెండ్రీ డైరెక్టర్ బాలచందర్ గారి దర్శకత్వంలో నటించాను. అదొక బ్యూటిఫుల్ మూమెంట్. చిత్రం తర్వాతే నాకు తమిళంలో నటించే అవకాశం కూడా వచ్చింది. కానీ కెరీర్ ఆరంభంలోనే రెండు పడవల మీద ప్రయాణం చేయాలని అనుకోలేదు. అందుకే ఆరేళ్ళ వరకు తమిళ చిత్రాలు అంగీకరించలేదు. కానీ తమిళ చిత్రాలు చేయడం ప్రారంభించాక తన కెరీర్ డౌన్ ఫాల్ మొదలైంది అన్నట్లుగా ఉదయ్ కిరణ్ తెలిపారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
ఉదయ్ కిరణ్
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
తరుణ్ బిజీగా ఉండటంతో.. ఉదయ్ కిరణ్ కు దక్కిన బ్లాక్ బస్టర్ సినిమా ఏదో తెలుసా?
Recommended image2
ఆ డైరెక్టర్ తో సూపర్ హిట్ సినిమాలు చేసి ఇండస్ట్రీలో కనిపించకుండా పోయిన నలుగురు హీరోలు..కానీ ఒక్కడు మాత్రమే
Recommended image3
Jeffrey Epstein: ఎవ‌రీ జెఫ్రీ, ఆ ఐల్యాండ్‌లో ఏం చేశాడు? OTTలో భయంకర సత్యాలను తెలిపే డాక్యుమెంటరీ
Related Stories
Recommended image1
బాలకృష్ణ ఇంట్లో అసలేం జరిగింది, వెక్కి వెక్కి ఏడ్చిన హీరోయిన్.. రెండున్నరేళ్లు భరించాను అంటూ కామెంట్స్
Recommended image2
కృష్ణంరాజుని తక్కువ అంచనా వేసి చావుదెబ్బ తిన్న బాలయ్య, బొబ్బిలి బ్రహ్మన్నకి పోటీగా వెళ్లడంతో అట్టర్ ఫ్లాప్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved