- Home
- Entertainment
- Jeffrey Epstein: ఎవరీ జెఫ్రీ, ఆ ఐల్యాండ్‌లో ఏం చేశాడు? OTTలో భయంకర సత్యాలను తెలిపే డాక్యుమెంటరీ
Jeffrey Epstein: ఎవరీ జెఫ్రీ, ఆ ఐల్యాండ్‌లో ఏం చేశాడు? OTTలో భయంకర సత్యాలను తెలిపే డాక్యుమెంటరీ
Jeffrey Epstein: ప్రపంచవ్యాప్తంగా జెఫ్రీ ఎప్స్టీన్..పేరు మారుమోగుతోంది. ఇంతకీ ఇతను ఏం చేశాడన్న విషయాలు తెలుసుకోవాలని ప్రతీ ఒక్కరిలో ఆసక్తి పెరుగుతోంది. కాగా ఎప్స్టీన్పై ఇప్పటికే ఓ డాక్యుమెంటరీ విడుదలైందని మీకు తెలుసా.?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న ఫిల్తీ రిచ్
ఇటీవల ప్రపంచవ్యాప్తంగా Epstein Files విడుదలతో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. కోట్ల పేజీలు, వేల ఫొటోలు, వీడియోలతో కూడిన ఈ డాక్యుమెంట్స్ జెఫ్రీ ఎప్స్టీన్ చేసిన భయంకర నేరాలను మరోసారి ప్రజల ముందుకు తెచ్చాయి. ఇదే సమయంలో అతని జీవితంపై ఆధారపడిన ఒక డాక్యుమెంటరీ సిరీస్ మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చింది. అదే Jeffrey Epstein: Filthy Rich.
ఈ డాక్యుమెంటరీ ఎప్పుడు విడుదలైంది.?
ఈ డాక్యుమెంటరీ సిరీస్ 2020 మే 27న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. అప్పట్లో పెద్దగా చర్చకు రాకపోయినా, తాజాగా Epstein Files వెలుగులోకి రావడంతో మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం Netflix Top 10 ట్రెండింగ్ లిస్ట్‌లో తొమ్మిదో స్థానంలో నిలవడం విశేషం. ప్రముఖ రచయిత జేమ్స్ పాటర్సన్ రాసిన ఫిల్తీ రిచ్ అనే పుస్తకం ఆధారంగా ఈ డాక్యుమెంటరీని రూపొందించారు.
మొత్తం ఎన్ని ఎపిసోడ్లు ఉన్నాయి?
జెఫ్రీ ఎప్స్టీన్: ఫిల్తీ రిచ్ డాక్యుమెంటరీలో మొత్తం 4 ఎపిసోడ్లు ఉన్నాయి. ప్రతి ఎపిసోడ్ దాదాపు ఒక గంట నిడివి ఉంటుంది. ఈ డాక్యుమెంటరీకి దర్శకుడిగా లిసా బ్రాయంట్ పనిచేశారు. ఈ సిరీస్ ఎలాంటి డ్రామా లేకుండా, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా నిజాలను నేరుగా చూపిస్తుంది.
ఈ డాక్యుమెంటరీలో ఏమేం చూపించారు?
ఈ డాక్యుమెంటరీ మొదటి ఎపిసోడ్ నుంచే షాకింగ్ విషయాలతో మొదలవుతుంది. బాధిత యువతుల వాంగ్మూలాలు, డబ్బు, పలుకుబడి ఉపయోగించి ఎప్స్టీన్ ఎలా తప్పించుకున్నాడు. పోలీస్ వ్యవస్థలో జరిగిన లోపాలు, ప్రైవేట్ ఐలాండ్ కథ, 2019లో మళ్లీ అరెస్ట్ అయిన విధానం వంటి విషయాలను నిజ జీవిత వీడియోలు, ఓల్డ్ ఫుటేజ్ ద్వారా చూపించారు.
ఎక్కడ చూడొచ్చు?
ఈ డాక్యుమెంటరీ Netflixలో మాత్రమే అందుబాటులో ఉంది. Epstein Files ద్వారా బయటపడుతున్న కొత్త నిజాలను అర్థం చేసుకోవడానికి ఈ సిరీస్ చాలా ఉపయోగపడుతుంది. న్యాయ వ్యవస్థ ఎలా విఫలమైంది, శక్తివంతులు ఎలా తప్పించుకున్నారు అన్నదానికి ఇది స్పష్టమైన నేపథ్యం ఇస్తుంది.

