- Home
- Entertainment
- Illu Illalu Pillalu Today Episode Feb 10: విశ్వక్ పై పగ తీర్చుకుంటున్న అమూల్య, వల్లి పొర్లు దండాలు
Illu Illalu Pillalu Today Episode Feb 10: విశ్వక్ పై పగ తీర్చుకుంటున్న అమూల్య, వల్లి పొర్లు దండాలు
Illu Illalu Pillalu Today Episode Feb 10: ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్లో అమూల్య స్ట్రాంగ్ గా మారి విశ్వక్ కు నరకం చూపించడం మొదలుపెట్టింది. ఇన్నాళ్లు ఏడుస్తూ కనిపించిన అమూల్య తన మరో రూపాన్ని బయటపెట్టింది. నేటి ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోండి.

అమూల్యకు అండగా నర్మద, ప్రేమ
ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్లో అమూల్య గేటు లోపల నుంచి నర్మద, ప్రేమలను చూస్తూ ఉంటుంది. నర్మద, ప్రేమ ఇద్దరూ అమూల్యను బయటికి పిలుస్తారు. ‘అందరూ నిన్ను బాగా చూస్తున్నారా’ అని అడుగుతారు. దానికి అమూల్య మాట్లాడుతూ ‘రేవతి అత్తమ్మ, జానకి అమ్మమ్మ బాగానే చూస్తున్నారు... కానీ విశ్వక్’ అని ఆపేస్తుంది. దాంతో ప్రేమ ‘వాడు ఏమన్నా కూడా భయపడకు. ఎదిరించు. అవసరం అయితే కొట్టు. లేకుంటే వాడు ఇంకా ఎక్కువ చేస్తాడు. మాటకు మాట ఇచ్చి పడేసి నోరు మూయించు. నిన్ను చూస్తేనే భయపడేలా చేయు’ అని చెబుతుంది.
కానీ అమూల్య ఏడుస్తూ ‘నాకు ఇక్కడ ఉండాలనిపించడం లేదు వదినా.. అమ్మానాన్న బాగా గుర్తొస్తున్నారు. వాళ్లతో మాట్లాడకుండా నావల్ల కావడం లేదు. నరకంలా అనిపిస్తుంది’ అంటూ అమూల్య ఏడుస్తుంది. నర్మద, ప్రేమ కలిసి అమూల్యను ఎంతో ఓదారుస్తారు. అమూల్య మాత్రం తన జీవితం బలైపోయింది అంటూ బాధపడుతూనే ఉంటుంది. నర్మద మాట్లాడుతూ ‘నీ జీవితం ఏమీ బలైపోలేదు. ఇంకా బంగారం లాంటి భవిష్యత్తు ఉంది. పరిస్థితులన్నీ సర్దుమణిగేంత వరకు కాస్త ఓపికగా ఉండు.. మావయ్యకి నచ్చజెప్పాక నిన్ను మన ఇంటికి తీసుకొస్తాము’ అని భరోసా ఇస్తారు. అమూల్య తిరిగి ఇంట్లోకి వెళ్లిపోతుంది. అమూల్యను చూసి నర్మద, ప్రేమ చాలా బాధపడతారు.
విశ్వపై పగ తీర్చుకుంటున్న అమూల్య
ఇక ఇక్కడి నుంచి సీన్ విశ్వక్ దగ్గరికి మారుతుంది. విశ్వక్ వాళ్ళ అమ్మని పిలిచి టిఫిన్ పెట్టమని అడుగుతాడు. అదే సమయం అమూల్య అక్కడికి వస్తుంది. అమూల్యను చూసి ఏయ్ పనిమనిషి ఇక్కడికి రా అని పిలుస్తాడు. టిఫిన్ వడ్డించాలని తెలియదా, అలా చూస్తావేంటి, వడ్డించు అని అంటాడు. దానికి అమూల్య కోపంగా రెండు ఇడ్లీలు తీసి ప్లేటులో వేస్తుంది. సాంబారు వేడిగా ఉందా? లేదా? అని విశ్వక్ అడుగుతాడు. వేడిగా ఉందో లేదో మీరే చూసుకోండి అంటూ వేడి వేడి సాంబార్ విశ్వ చేతి మీద పోస్తుంది. విశ్వ తిడుతుంటే... అతనికి తగ్గట్టే అమూల్య కూడా బాగా గట్టిగా సమాధానాలు ఇస్తుంది.
ఈ లోపు విశ్వక్ కొట్టేందుకు అమూల్య మీద చెయ్యెత్తుతాడు. రేవతి వచ్చి ఆపుతుంది. వెంటనే అమూల్య ప్రేమగా నటిస్తూ అలా సాంబారు చెయ్యి మీద పోసుకుంటారేంటండీ... పాపం కాలిందో ఏంటో అని బాధపడినట్టు నటిస్తుంది. నేను సాంబార్ పోసుకోలేదు అదే నా మీద పోసింది అని చెబుతాడు విశ్వక్. అక్కడికి సేనాపతి, భద్రవతి కూడా అక్కడికి వస్తారు.
భద్రావతి కల్పించుకొని ‘ఏమే నా మేనల్లుడు మీద సాంబార్ పోస్తావా’ అని అడుగుతుంది. అప్పుడు అమూల్య మరీ నటిస్తూ ‘శివా శివా ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నాను పెద్దమ్మ.. సాంబారు వేసుకోవడం కూడా రాదా అని మీరు ఎక్కడ ఏమంటారో అని నా మీదకు తోసేస్తున్నాడు’ అని చెబుతుంది. రేవతి కూడా అమూల్యకు చాలా సపోర్ట్ చేస్తుంది. ఈలోపు పెద్దమ్మ వచ్చి ఆ గొడవను ఆపి ఇద్దరూ రెడీ అవ్వండి గుడికి వెళ్ళాలి అని చెబుతుంది. విశ్వక్ నేను రానని చెబుతాడు. దాంతో పెద్దమ్మ కాలు విరగొట్టి తీసుకెళ్తాను.. పెళ్లయ్యాక భార్యాభర్తలు ఇద్దరు కలిసి గుడికి వెళ్ళాలి.. లేచిపోయి పెళ్లి చేసుకున్నప్పుడు లేని నామోషి గుడికి వెళ్లడానికి ఎందుకు? బయలుదేరమని గట్టిగా చెబుతుంది.
వల్లి పొర్లు దండాలు, విశ్వ మోకాలిపై
ఇక ఇక్కడి నుంచి సీన్ గుడి దగ్గరికి మారుతుంది. గుడిలో నర్మద తండ్రి తన అల్లుడికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందని అందరికీ సంతోషంగా చెబుతాడు. అదే గుడికి రామరాజు కుటుంబం కూడా కొడుకు కోడళ్లతో వస్తారు. మరోపక్క సాగర్ గుడికి వస్తూనే వనజ వాళ్ళు 20 లక్షల ఎక్కడ అడుగుతారోనని భయపడుతూ ఉంటాడు. ప్రసాద్ రావు తన అల్లుడికి గవర్నమెంట్ జాబ్ వచ్చిందని అర్చన చేయిస్తాడు. ఈలోపు అక్కడికి రామరాజు కుటుంబం వస్తుంది. నర్మద తండ్రి గుడి నుంచి వెళ్లిపోతాడు. అదే పూజారి దగ్గరికి రామరాజు కుటుంబం వచ్చి అర్చన చేయించమని అడుగుతుంది. పూజారి పేర్లు చెప్పమని అడుగుతాడు. అప్పుడు అందరి పేర్లు చెబుతుంది నర్మద. చివర్లో అమూల్య పేరు కూడా చెప్పడంతో వేదవతి, రామరాజు షాక్ అవుతారు.
ఈలోపు అదే గుడికి విశ్వక్, అమూల్య, జానకి పెద్దమ్మ కూడా వస్తారు. కానీ అదే గుడిలో వల్లి చేత పొర్లు దండాలు పెట్టిస్తూ ఉంటారు భాగ్యం, ఇడ్లీ బాబాయ్. ఇక అమూల్య విశ్వక్ తో మాట్లాడుతూ ‘మన పెళ్లయితే మోకాళ్ళ మీద ప్రదక్షిణలు చేస్తానని మొక్కుకున్నావు కదా.. ఆ మొోక్కు తీర్చుకో పదా’ అని అంటుంది. ఏమీ మొక్కుకోలేదని చెబుతాడు విశ్వ. అయినా కూడా జానకి పెద్దమ్మ ముందు ఇరికించేస్తుంది అమూల్య. దీంతో తప్పక విశ్వ మోకాళ్ళ మీద ప్రదక్షిణలు మొదలు పెడతాడు. అది చూసి అమూల్య నవ్వుకుంటుంది. మోకాళ్ళ మీద ప్రదక్షిణలు చేయలేక అష్ట కష్టాలు పడుతూ ఉంటాడు.
ప్రేమపై ధీరజ్ ఆప్యాయత
ఓ పక్క విశ్వ మోకాలు మీద ప్రదక్షిణ చేసుకుంటూ వస్తూ ఉంటే.. అతని దారిలోకి పొర్లు దండాలు పెట్టుకుంటూ వల్లి ఎదురు వస్తుంది. ఇద్దరూ ఒకచోటే ఆగుతారు. దాంతో వల్లి నువ్వేంటి మోకాళ్ళ మీద నడుస్తు న్నావ్, మమ్మల్ని టార్చర్ పెట్టినందుకు అమూల్య నీ తాట తీసేసి నిన్ను బాగా చెక్కిస్తున్నట్టు ఉందిగా అని అంటుంది. ఇద్దరూ ఒకరినొకరు తిట్టుకుని ఎవరి మొక్కులు వారు కొనసాగిస్తారు. ఇక్కడ నుంచి సీన్ ధీరజ్, ప్రేమ దగ్గరికి మారుతుంది. గుడి మెట్లపై కూర్చుని మాట్లాడుకుంటారు. ప్రేమ ఎస్ఐ ఎగ్జామ్ రాయనని, ఇంట్లో ఎక్కువ సమస్యలు ఉన్నాయని వద్దని చెబుతుంది. కానీ ధీరజ్ మాత్రం నచ్చజెప్పుతాడు. భార్యపై చాలా ప్రేమ చూపిస్తాడు. నువ్వు కచ్చితంగా ఎగ్జామ్ రాయాలని చెబుతాడు. దీంతో ఎపిసోడ్ ఇక్కడితో ముగిసిపోతుంది.

