- Home
- Entertainment
- హీరోయిన్లతో నాకు పర్సనల్ కంఫర్ట్ అవసరం లేదు, అలాంటి వాళ్లంటే చిరాకు..రియల్ లవర్స్ లా ఉండాలి, చిరు కామెంట్స్
హీరోయిన్లతో నాకు పర్సనల్ కంఫర్ట్ అవసరం లేదు, అలాంటి వాళ్లంటే చిరాకు..రియల్ లవర్స్ లా ఉండాలి, చిరు కామెంట్స్
చిరంజీవి కొందరు హీరోయిన్ల విషయంలో నచ్చని అంశాలు ఉన్నాయి అని తెలిపారు. డ్యాన్స్ పై తన అభిప్రాయం చెబుతూ హీరోయిన్లతో తనకు పర్సనల్ కంఫర్ట్ అవసరం లేదు అని అన్నారు.

వింటేజ్ మెగాస్టార్ ఈజ్ బ్యాక్
మెగాస్టార్ చిరంజీవి ఏడు పదుల వయసులో కూడా తన సత్తా తగ్గలేదని నిరూపిస్తున్నారు. చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు చిత్రం బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయం సాధించింది రీజినల్ ఇండస్ట్రీ హిట్ గా రికార్డ్ సృష్టించింది. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రం 350 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. ఈ మూవీలో చిరంజీవి డ్యాన్సులు, ఫైట్స్, కామెడీ ఇలా అన్ని అంశాలు మునుపటి మెగాస్టార్ ని గుర్తు చేశాయి.
చిరంజీవి డ్యాన్సులు
దీనితో వింటేజ్ మెగాస్టార్ ఈజ్ బ్యాక్ అంటూ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. చిరంజీవి ఎప్పుడు డ్యాన్స్ చేయాలన్నా ఎంతో ఎంజాయ్ చేస్తూ గ్రేస్ ఫుల్ గా చేస్తారు. అందుకే చిరంజీవి డ్యాన్స్ అంటే అందరికీ అంత ఇష్టం ఉంటుంది. ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి తన డ్యాన్స్ గురించి మాట్లాడుతూ హీరోయిన్ల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
60 మందికి పైగా హీరోయిన్లతో..
చిరంజీవి తన కెరీర్ లో 60 మందికి పైగా హీరోయిన్లతో నటించారు. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో 12 మంది హీరోయిన్లతో నటించారు. వీరిలో మీకు బాగా కంఫర్టబుల్ గా అనిపించిన హీరోయిన్ ఎవరు అని మిల్కీ బ్యూటీ తమన్నా ప్రశ్నించింది. చిరంజీవి సమాధానం ఇస్తూ కంఫర్ట్ అంటే.. హీరోయిన్ల విషయంలో నాకు పర్సనల్ కంఫర్ట్ అవసరం లేదు.
పర్సనల్ కంఫర్ట్ అవసరం లేదు
నేను ప్రొఫెషనల్ కంఫర్ట్ మాత్రమే చూస్తాను. ప్రొఫెషనల్ గా బెస్ట్ అనిపించిన హీరోయిన్లు, కంఫర్ట్ గాఫీలైన హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. ఇంకా క్లియర్ గాచెప్పాలి అంటే నేను నటించిన వారిలో శ్రీదేవి ది బెస్ట్. నాతో పాటు అద్భుతంగా డ్యాన్స్ చేసిన హీరోయిన్లు చాలా మంది ఉన్నారు.
నిజమైన లవర్స్ లాగా ఉండాలి
కొంతమంది హీరోయిన్లు సాంగ్ లో నాతో డ్యాన్స్ చేసేటప్పుడు దానిని ఒక కాంపిటీషన్ గా భావించి చేస్తారు. నాతో పోటీ పడుతున్నట్లు వాళ్ళ డ్యాన్స్ ఉంటుంది. అలాంటి హీరోయిన్లు నాకు ఇష్టం లేదు. హీరో హీరోయిన్లు డ్యాన్స్ చేసేటప్పుడు లయబద్దంగా ఉండాలి. నిజమైన ప్రేమికులు అనే ఫీలింగ్ ఆడియన్స్ కి కలగాలి. విషయంలో శ్రీదేవి ది బెస్ట్ అని చిరంజీవి అన్నారు.

