MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • TV
  • Illu Illalu Pillalu: నోరు జారి.. లంచం ఇచ్చి ఉద్యోగం కొన్న నిజం బయటపెట్టిన సాగర్, వల్లి మరో కుట్ర

Illu Illalu Pillalu: నోరు జారి.. లంచం ఇచ్చి ఉద్యోగం కొన్న నిజం బయటపెట్టిన సాగర్, వల్లి మరో కుట్ర

Illu Illalu Pillalu: రైస్ మిల్లు వల్లి చేతికి వచ్చేసింది. ప్రేమ ఎస్ఐ పరీక్ష రాయడానికి వేదవతి అంగీకరిస్తుంది. మరి, నేటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో టీవీ కంటే ముందుగా మీ కోసం.. 

3 Min read
Author : ramya Sridhar
Published : Feb 14 2026, 09:10 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఇల్లు, ఇల్లాలు పిల్లలు..
Image Credit : Jio Hotstar

ఇల్లు, ఇల్లాలు పిల్లలు..

సాగర్ ఆఫీసుకు వెళ్లడానికి రెడీ అవుతూ ఉంటాడు.అప్పుడే నర్మద వచ్చి సరదాగా ఏడిపిస్తుంది. అయితే.. సాగర్ తాను టెన్షన్ లో ఉన్నాను అని చెబుతాడు. దీంతో.. నర్మద.. ఆఫీసులో ఎలా ఉండాలో , ఎలా పని చేయాలో అర్థం అయ్యేలా చెబుతుంది. తర్వాత..ఖర్చులకు ఉంచుకోమని చెప్పి.. సాగర్ కి డబ్బులు ఇచ్చి మరీ ఆఫీసుకు పంపిస్తుంది. ‘ నేను రైస్ మిల్లులో పని మానేశాను అనే కోపం తప్ప.. నాకు ఉద్యోగం వచ్చిందన్న సంతోషం మా నాన్నలో లేదు.. నువ్వు కూడా అలానే ఉంటావ్ ఏమో అనుకున్నాను. కానీ.. నన్ను ఇంత లా అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది.’ అని సాగర్ అంటాడు. అయితే... ‘ నీకు ఉద్యోగం వచ్చిందని నాకన్నా ఎక్కువ సంతోషించేవారు ఇంకెవరూ లేరు. కాకపోతే.. నా బాధంతా నువ్వు మీ నాన్న గారికి, మీ కుటుంబానికి దూరం అవ్వకూడదని, మీ కారణంగా నీ కన్నవాళ్లు బాధ పడకూడదు’ అని చెబుతుంది. ‘ ప్రేమించే భార్య దొరకడం అదృష్టం.. దానితో పాటు అర్థం చేసుకునే భార్య దొరకడం ఇంకా అదృష్టం.. నేను చాలా హ్యాపీ’ అని సాగర్ ప్రేమగా నర్మదను హత్తుకుంటాడు.

24
ప్రేమను అందంగా రెడీ చేసిన ధీరజ్...
Image Credit : Jio Hotstar

ప్రేమను అందంగా రెడీ చేసిన ధీరజ్...

ఇక.. ప్రేమ రెడీ అవుతూ ఉంటుంది. అప్పుడు కూడా ధీరజ్ తనతో ప్రేమగా ఉన్న సందర్భాన్ని గుర్తుచేసుకొని మురిసిపోతుంది. ఈ లోగా ధీరజ్ వచ్చి.. టైమ్ అవుతుందని.. పరీక్షకు లేటు అవుతుందని హడావిడి చేస్తాడు.తర్వాత.. ప్రేమ వేసుకున్న డ్రెస్ బాలేదని.. మరో డ్రెస్ ఇచ్చి వేసుకోమని అడుగుతాడు. ప్రేమ కూడా ధీరజ్ ఇచ్చిన డ్రెస్ వేసుకొని రెడీ అవుతుంది. ఈ డ్రెస్ లో అద్భుతంగా ఉన్నావని పొగుడుతాడు. ధీరజ్ పొగడ్తలకు ప్రేమ మురిసిపోతుంది. తర్వాత ప్రేమ హెయిర్ లూజ్ గా వదిలేస్తే... ధీరజ్ స్వయంగా జడ అల్లుతాడు. తర్వాత మళ్లీ ఇంకో హెయిర్ స్టైల్ వేస్తాడు. అది ప్రేమకు బాగా సూట్ అవుతుంది.

బయలు దేరుతుండగా ప్రేమకు డౌట్ వచ్చి ఆగిపోతుంది. ‘ మామయ్య గారికి అబద్ధం చెప్పి వెళ్లాలి.. ఈ విషయం వల్లీ అక్క కి తెలిస్తే మన పరిస్థితి ఏంటి?’ అని ప్రేమ అడుగుతుంది.

Related Articles

Related image1
Gunde Ninda Gudi Gantalu: రవి లైఫ్ లోకి మరో అమ్మాయి, శ్రుతికి పోటీ..మీనా తమ్ముడు తెచ్చిన మరో తంటా
Related image2
Gunde Ninda Gudi Gantalu: విద్య కన్నీళ్లకు పడిపోయిన మనోజ్, మరో లక్షకు రోహిణీ టోపీ,తప్పు తెలుసుకున్న బాలు
34
నోరు జారి నిజం చెప్పిన సాగర్...
Image Credit : Jio Hotstar

నోరు జారి నిజం చెప్పిన సాగర్...

సీన్ కట్ చేస్తే... వల్లి.. ఇంకా తనను నర్మద కొట్టిన విషయమే ఆలోచిస్తూ ఉంటుంది.‘ సాగర్ కి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేంత టాలెంట్ లేదు.. దీని వెనక కుట్ర కచ్చితంగా తెలుసుకోవాలి’ అని భాగ్యం.. వల్లితో అంటుంది. ‘ ఆ నర్మద నా చెంప మీద కొట్టింది’ అని వల్లి అంటే.. ‘ వాళ్లు.. మన చెంప మీద కొడితే, మనం వాళ్ల బతుకు మీద కొట్టాలి.. అంతేకానీ బాధపడుతూ కూర్చోవద్దు’ అని కూతురిని రెచ్చగొట్టి.. లోపలికి తీసుకువెళ్తుంది. సాగర్ కి ఉద్యోగం ఎలా వచ్చిందే కూపీ లాగుతాం అని భాగ్యం, ఇడ్లీ వెళతారు. ఇద్దరూ మొదట కంగ్రాట్స్ చెప్పి.. డబ్బులు ఇచ్చి ఉద్యోగం కొన్నావా? అని అడుగుతారు. ఫ్లూలో నిజం చెప్పబోయి.. సాగర్ తేరుకొని ఆగిపోతాడు. నేను కష్టపడి పరీక్ష రాసి ఉద్యోగం సంపాదించాను అని మళ్లీ కవర్ చేస్తాడు. అయినా.. వీళ్లు ఆగరు.. పరీక్ష ఎప్పుడు రాశావు..? అని అడుగుతారు. సాగర్ ఏదో కవర్ చేయడానికి ప్రయత్నిస్తాడు.

ఈలోగా.. నర్మద అక్కడికి వచ్చేస్తుంది. అది చూసి వల్లి నెమ్మదిగా జారుకుంటుంది. ఇక భాగ్యం వాళ్లు కూడా నర్మదను చూసి.. అక్కడి నుంచి జారుకుంటారు. సాగర్ కి ఆల్ ద బెస్ట్ చెప్పి వెళ్లిపోతారు. సాగర్ లంచం ఇచ్చే ఉద్యోగం కొన్నాడని.. భాగ్యం అంటే.. అంత డబ్బు సాగర్ కి ఎలా వచ్చిందో తేల్చాలని వల్లి అంటుంది.

44
తండ్రి ఆశీర్వాదం....
Image Credit : Jio Hotstar

తండ్రి ఆశీర్వాదం....

ఈ లోగా.. మొదటి రోజు తండ్రి దగ్గర ఆశీర్వాదం తీసుకోవడానికి సాగర్ వస్తాడు. కానీ.. ధైర్యం సరిపోక ఆగిపోతాడు. సాగర్ నోరు తెరవడం లేదని... నర్మద విషయం చెబుతుంది.సాగర్ ఆశీర్వదించమని అడిగితే.. రామరాజు కాళ్లు పక్కకు జరిపేస్తాడు.దీంతో.. నన్ను ఈ ఇంట్లో అర్థం చేసుకునేవాళ్లే లేరు.. ఇక ఆశీర్వదిస్తారా అంటూ సెంటిమెంట్ డైలాగులు కొడతాడు. భార్యకు చెప్పి వెళ్లిపోవాలని అనుకుంటాడు. అప్పుడే వేదవతి ఆపి.. వాళ్ల నాన్న గొప్పతనం మీద రెండు భారీ డైలాగులు చెప్పి.. ఆశీర్వదిస్తుంది. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode: జ్యోను ఎడాపెడా వాయించిన పారు- ఇంట్లో నుంచి వెళ్లిపోతానన్న కాంచన
Recommended image2
Karthika Deepam 2 Today Episode: డాక్టర్ ని కలిసిన దశరథ- తప్పించుకున్న దాసు- జ్యోను ఫాలో అయిన పారు
Recommended image3
Gunde Ninda Gudi Gantalu: రవి లైఫ్ లోకి మరో అమ్మాయి, శ్రుతికి పోటీ..మీనా తమ్ముడు తెచ్చిన మరో తంటా
Related Stories
Recommended image1
Gunde Ninda Gudi Gantalu: రవి లైఫ్ లోకి మరో అమ్మాయి, శ్రుతికి పోటీ..మీనా తమ్ముడు తెచ్చిన మరో తంటా
Recommended image2
Gunde Ninda Gudi Gantalu: విద్య కన్నీళ్లకు పడిపోయిన మనోజ్, మరో లక్షకు రోహిణీ టోపీ,తప్పు తెలుసుకున్న బాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved