MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • TV
  • Gunde Ninda Gudi Gantalu: రవి లైఫ్ లోకి మరో అమ్మాయి, శ్రుతికి పోటీ..మీనా తమ్ముడు తెచ్చిన మరో తంటా

Gunde Ninda Gudi Gantalu: రవి లైఫ్ లోకి మరో అమ్మాయి, శ్రుతికి పోటీ..మీనా తమ్ముడు తెచ్చిన మరో తంటా

 Gunde Ninda Gudi Gantalu: చింటూ విషయంలో రోహిణీ కి మరోసారి చిక్కులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు రాజేష్ కి డబ్బులు ఇచ్చిన విషయంలో మీనా, బాలు మధ్య గొడవ కొనసాగుతోంది.నేటి ఎపిసోడ్ టీవీకంటే ముందుగా.. 

3 Min read
Author : ramya Sridhar
Published : Feb 13 2026, 09:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Gunde Ninda Gudi Gantalu
Image Credit : Jio Hotstar

Gunde Ninda Gudi Gantalu

బాలు ఇంకా తన అంతర ఆత్మతో మాట్లాడుతూ ఉంటాడు.‘ పెళ్లాం మాట వినలేదు.. బుద్ధి ఉందా? లక్ష రూపాయలు పోగొట్టావ్.. ఎన్ని రోజులు కష్టపడితే లక్ష సంపాదిస్తావ్? ఎంత మంచి పెళ్లాం దొరికింది నీకు..?మీ లక్షావతి పెడుతున్న కష్టాలను భరిస్తూ...నిన్ను ఎంత బాగా చూసుకుంటోంది.. దేవత లాంటి భార్యను పూలలో పెట్టి చూసుకోవాలి.. వెళ్లి మీనా కి క్షమాపణలు చెప్పు లేకపోతే.. మనోజ్ లాగా అడుక్కుతింటావ్..’అని బాలు తనతో తానే అంటాడు. కోపంతో బాలు తాగుదాం అని తెచ్చుకున్న మందు సీసా పగల కొడతాడు.తర్వాత అయ్యో అనవసరంగా మందు వేస్ట్ చేశానే అని ఫీల్ అవుతాడు.

మీనా తమ్ముడు శివ రాత్రి అయినా ఇంటికి రాలేదని వాళ్ల చెల్లి సుమతి, తల్లి పార్వతి కంగారు పడుతూ ఉంటారు. ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడు. వీళ్లు భయపడుతూ ఉంటారు. అప్పుడే శివ ఇంటికి వస్తాడు. ఏమైంది? ఎందుకు ఆలస్యంగా వచ్చావ్? అని సుమతి అడిగితే... శివ తల బిరుసుగా సమాధానం చెబుతాడు. సుమతి కి కోపం వచ్చి తిడుతుంది. అప్పుడే శివ మందు తాగి వచ్చిన విషయం తెలుస్తుంది. మందు జోలికి వెళ్లొద్దని సుమతి, పార్వతి నచ్చ చెప్పాలని చూసినా శివ వినడు. ‘ నేనేమీ మీ అల్లుడిలాగా తాగుబోతుని కాదు... పార్టీలో గుణ బలవంత పెట్టడం వల్ల ఒక పెగ్గు తాగాను.. ఆ మాత్రానికే తాగుబోతు అయిపోతానా?’ అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడి.. పడుకొని నిద్రపోతాడు. సుమతి.. మీనాకి ఫోన్ చేద్దాం అంటే.. తల్లి ఆపి.. ఈ సమయంలో ఫోన్ వద్దు అని ఆపేస్తుంది.

24
డబ్బులు తిరిగి ఇచ్చేసిన రాజేష్..
Image Credit : Jio Hotstar

డబ్బులు తిరిగి ఇచ్చేసిన రాజేష్..

మరుసటి రోజు ఉదయాన్నే.. రాజేష్.. బాలు ఇంటికి వస్తాడు. బాలు ఇంట్లోకి రమ్మని అంటే.. రాజేష్ చాలా మొహమాట పడతాడు. అంతేకాదు.. తాను చేసిన తప్పుని బాలు, మీనా ముందు రాజేష్ ఒప్పుకుంటాడు. తన వల్ల బాలుకి అప్పు అయ్యిందని రాజేష్ ఫీల్ అవుతాడు. ‘ ఫ్రెండ్ కి అసవరం వచ్చినప్పుడు సహాయం చేయకపోతే అది స్నేహం ఎలా అవుతుంది?’ అని బాలు అంటాడు. ‘ అది స్నేహం కాదు.. ఫ్రెండ్ ని అప్పులపాలు చేయడం స్నేహం కాదు.. అప్పుల పాలు అవ్వకుండా హెచ్చరించడం అసలైన స్నేహం’ అని మీనా పక్క నుంచి సెటైర్లు వేస్తుంది.కానీ.. నీకు టైమ్ దొరికిందని మాట్లాడుతున్నావా? అంటూ మీనా నోరు బాలు మూయిస్తాడు. అయితే..మీనా చెప్పింది కరెక్ట్ అని మాట్లాడిన రాజేష్.. ఫంక్షన్ లో వచ్చిన చదివింపులు మొత్తం ఇచ్చేసి వెళ్లిపోబోతాడు.

వెళ్తున్న రాజేష్ ని మీనా ఆపుతుంది. ‘ అన్నయ్య.. ఆడ పిల్లలకు చదువులు ఎందుకు? ట్యూషన్లు ఎందుకు? అని ఫీజ్ కట్టలేదు అంట కదా.. ఇంకా ఈ కాలంలో ఆడపిల్లలు, మగ పిల్లలు ఏంటి అన్నయ్య? పెళ్లి చేసుకొని వెళ్లిపోయేదానికి చదువు ఎందుకు అన్నావ్ అంట కదా? పెళ్లి చేసుకొని వెళ్లిపోతుంది కాబట్టి.. చదివించాలి. చదువుకుంటే గౌరవం ఇస్తారు.. ఆ చదువుతోనే వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలపడతారు..’ అని మీనా సలహా ఇస్తుంది. పనిలో పనిగా.. బాలు.. మనోజ్ ని ఎంత చదివించినా లాభం లేదు అని తిడతాడు. అయితే.. రాజేష్.. తన ఆలోచన మార్చుకున్నాను అని.. పిల్లలను చదివిస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

రాజేష్ వెళ్లిపోయాక.. బాలు, మీనా వాదించుకుంటూ ఉంటారు. తాను చెప్పిన విషయం సరిగా అర్థం చేసుకోలేదని.. మీనా అంటుంటే.. బాలు.. ఏమో మనోజ్ టాపిక్ తెచ్చి.. అతను చేసిన తప్పులు మాట్లాడుతూ ఉంటాడు. అదంతా మనోజ్ విని.. ఏ విషయం ఎక్కడ మొదలైనా.. తన దగ్గరికే వచ్చి ఆగిపోతుందని మనోజ్ తల బాదుకుంటాడు. ఇక తర్వాత.. రాజేష్ ఇచ్చిన డబ్బులు తీసుకెళ్లి.. అప్పు కట్టేసి వస్తాను అని బాలు వెళ్లిపోతాడు.

Related Articles

Related image1
Gunde Ninda Gudi Gantalu: విద్య కన్నీళ్లకు పడిపోయిన మనోజ్, మరో లక్షకు రోహిణీ టోపీ,తప్పు తెలుసుకున్న బాలు
Related image2
Gunde Ninda Gudi Gantalu: ఫంక్షన్ లో మటన్ ముక్కల కోసం గొడవ, పోయిన బాలు పరువు..రోహిణీ మాజీ భర్త ఎంట్రీ
34
రవికి కొత్త బాస్...
Image Credit : Jio Hotstar

రవికి కొత్త బాస్...

సీన్ కట్ చేస్తే... రవి తన హోటల్ కి వెళతాడు. అక్కడికి వెళ్లే సరికి రవి ప్లేస్ లో మరో అమ్మాయి చెఫ్ గా ఉంటుంది.తన ఉద్యోగం పోయిందని కంగారుపడిన రవి.. వెళ్లి తన బాస్ ని ప్రశ్నిస్తాడు. తీరా తర్వాత తెలిసిన విషయం ఏమిటంటే.. ఆ అమ్మాయి..బాస్ కూతురు అని తెలుస్తుంది. రెస్టారెంట్ ని తన కూతురు చేతిలో పెడుతున్నట్లు వాళ్ల బాస్ చెబుతాడు.ఇక ఆ అమ్మాయి.. రవిని తన మాటలతో బెదరగొడుతుంది. తన పేరు నీతూ అని పరిచయం చేసుకుంటుంది. రవిని బేబీ అని పిలుస్తుంది.. అప్పుడే వచ్చిన శ్రుతి ఈ మాటలు వింటుంది. ఇంటికి వచ్చాక.. నీ సంగతి చెబుతాను అని శ్రుతి అనుకుంటుంది.. అప్పుడే.. లోపలికి వస్తుంది. వెళ్లి.. తాను రవి భార్య అంటూ పరిచయం చేసుకుంటుంది. పనిలో పనిగా.. రవికి శ్రుతి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

44
తల్లి దగ్గరకు మీనా...
Image Credit : Jio Hotstar

తల్లి దగ్గరకు మీనా...

పార్వతి దగ్గరకు మీనా వెళ్తుంది. అప్పుడే.. శివ గురించి మీనాకు చెబుతుంది. గుణతో కలిసి తిరుగుతున్నాడని, మందు తాగుతున్నాడని.. మొత్తం చెబుతుంది. బాధ్యతలు పెరిగితే.. మారిపోతాడులే అని మీనా సర్ది చెబుతుంది. కానీ.. అసలు శివ చదువువైపే వెళ్లడం లేదని.. గ్రూప్ స్టడీస్ పేరున తిరుగుతున్నాడని చెబుతుంది. ఆ మాటలకు మీనా ఫీల్ అవుతుంది.

కమింగప్ లో.. గుణ దగ్గరకు వెళ్లి మీనా గొడవపడుతుంది. ఆ రౌడీ మీనా తలపగలకొడతాడు. అది కాస్త.. బాలు కంట పడుతుంది. వెంటనే అక్కడ గొడవ జరుగుతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Gunde Ninda Gudi Gantalu: ఫంక్షన్ లో మటన్ ముక్కల కోసం గొడవ, పోయిన బాలు పరువు..రోహిణీ మాజీ భర్త ఎంట్రీ
Recommended image2
Karthika Deepam 2 Today Episode: పారుతో ఆడుకున్న కార్తీక్- స్వప్నను లాక్ చేసిన శ్రీధర్- జ్యో నటన
Recommended image3
సినిమా చూసి పేరెంట్స్ నన్ను తిట్టుకుంటారు, రైటర్ సూర్య ప్రకాష్ కామెంట్స్ వైరల్..
Related Stories
Recommended image1
Gunde Ninda Gudi Gantalu: విద్య కన్నీళ్లకు పడిపోయిన మనోజ్, మరో లక్షకు రోహిణీ టోపీ,తప్పు తెలుసుకున్న బాలు
Recommended image2
Gunde Ninda Gudi Gantalu: ఫంక్షన్ లో మటన్ ముక్కల కోసం గొడవ, పోయిన బాలు పరువు..రోహిణీ మాజీ భర్త ఎంట్రీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved