MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఏఎన్నార్ కి నచ్చిన కథ మెగా హీరో చేతుల్లోకి.. తెలివిగా రిజెక్ట్ చేయడం వల్ల అద్భుతం జరిగింది తెలుసా ?

ఏఎన్నార్ కి నచ్చిన కథ మెగా హీరో చేతుల్లోకి.. తెలివిగా రిజెక్ట్ చేయడం వల్ల అద్భుతం జరిగింది తెలుసా ?

టాలీవుడ్ లో ఒక హీరో చేయాల్సిన సినిమా మరో హీరో చేతుల్లోకి వెళ్లిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఏఎన్నార్ కి నచ్చిన కథ ఒకటి మెగా హీరో చేతుల్లోకి వెళ్లిందట.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jun 25 2025, 10:24 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అక్కినేని ఫ్యామిలీ
Image Credit : X

అక్కినేని ఫ్యామిలీ

తెలుగు చిత్ర పరిశ్రమ లెజెండ్రీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు తన నటనతో వెండితెరపై ఎన్నో అద్భుతాలు సృష్టించారు. మరణించే వరకు కూడా ఆయన సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. ఏఎన్నార్ తర్వాత ఆయన లెగసీని నాగార్జున నాగచైతన్య, అఖిల్ కొనసాగిస్తున్నారు. టాలీవుడ్ లో ఒక హీరో చేయాల్సిన సినిమా మరో హీరో చేతుల్లోకి వెళ్లిన సందర్భాలు చాలా ఉన్నాయి.

25
ఏఎన్నార్ కి నచ్చిన కథని రిజెక్ట్ చేసిన నాగార్జున
Image Credit : X

ఏఎన్నార్ కి నచ్చిన కథని రిజెక్ట్ చేసిన నాగార్జున

ఏఎన్నార్ కి నచ్చిన కథ ఒకటి మెగా హీరో చేతుల్లోకి వెళ్లిందట. నాగార్జున తన తండ్రి ఏఎన్నార్ తో కలిసి కొన్ని చిత్రాల్లో నటించారు. కానీ అక్కినేని ఫ్యామిలీ మొత్తం ఒక చిత్రంలో కలిసి నటించాలని ఏఎన్నార్, నాగార్జున ప్లాన్ చేశారు. అక్కినేని ఫ్యామిలీ సినిమా కోసం కథలు వింటున్న క్రమంలో డైరెక్టర్ కృష్ణవంశీ ఏఎన్నార్ కి ఒక కథ చెప్పారట.

ఆ కథ ఎమోషనల్ గా బాగుందని ఏఎన్నార్ ఏఎన్నార్ కు అనిపించింది. ఆయనకి కృష్ణవంశీ చెప్పిన కథ నచ్చింది. నాగార్జున కూడా ఆ కథను విన్నారు. నాగార్జున కి కూడా స్టోరీ నచ్చింది. కానీ నాగార్జునకి ఈ కథపై మనసులో ఏదో మూల అనుమానం వస్తోంది. అక్కినేని ఫ్యామిలీ మొత్తం నటించే చిత్రం రెగ్యులర్ ఎమోషనల్ డ్రామాగా ఉండకూడదు అనేది నాగార్జున ఆలోచన. కథలో ఏదో ఒక వైవిధ్యమైన అంశం ఉండాలని నాగార్జున అన్నారు.

Related Articles

Related image1
గద్దర్ అవార్డులు కాదు, దిల్ రాజు ఫ్యామిలీ అవార్డులు అంటూ కామెంట్స్.. స్టార్ ప్రొడ్యూసర్ రియాక్షన్
Related image2
పెళ్లి బట్టలని అందుకే సమంత అలా చేసింది.. రివెంజ్ గౌనుపై డిజైనర్ క్లారిటీ
35
విక్రమ్ కుమార్ కి గ్రీన్ సిగ్నల్
Image Credit : X

విక్రమ్ కుమార్ కి గ్రీన్ సిగ్నల్

అందుకే నాగార్జున తెలివిగా కృష్ణవంశీ చెప్పిన కథని రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత డైరెక్టర్ విక్రమ్ కుమార్ చెప్పిన పునర్జన్మల నేపథ్యంలోని కథ నాగార్జునకి చాలా బాగా నచ్చింది. ఈ కథ అయితే ఆడియన్స్ కి ఫ్రెష్ ఫీలింగ్ ఇస్తుందని నాగార్జున భావించారు. విక్రమ్ కుమార్ చెప్పిన ఆ కథే మనం చిత్రంగా తెరకెక్కి సంచలన విజయం సాధించింది. ఈ చిత్రంలో నాగార్జున, ఏఎన్నార్, నాగచైతన్య వైవిద్యమైన పాత్రలో నటించారు.

45
నాగార్జున రిజెక్ట్ చేసిన కథ రామ్ చరణ్ చేతుల్లోకి
Image Credit : X

నాగార్జున రిజెక్ట్ చేసిన కథ రామ్ చరణ్ చేతుల్లోకి

ఇంతకీ నాగార్జున రిజెక్ట్ చేసిన చిత్రం మరేదో కాదు.. గోవిందుడు అందరివాడేలే. నాగార్జున ఈ కథని రిజెక్ట్ చేయడంతో కృష్ణవంశీ రామ్ చరణ్ తో ఆ మూవీ చేశారు. ఈ చిత్రంలో కృష్ణవంశీ ప్రకాష్ రాజ్ పాత్రని ఏఎన్నార్ కోసం, శ్రీకాంత్ పాత్రని నాగార్జున కోసం, రామ్ చరణ్ పాత్రని నాగచైతన్య కోసం రాసుకున్నారు. తెలివిగా నాగార్జున ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేయడమే మంచిదయింది అని అక్కినేని ఫ్యాన్స్ అంటున్నారు. ఒకవేళ ఈ చిత్రాన్ని నాగార్జున ఓకే చేసి ఉంటే మనం లాంటి అద్భుతం అక్కినేని ఫ్యామిలీకి మిస్ అయ్యేది.

55
ఏఎన్నార్ చివరి మూవీ
Image Credit : X

ఏఎన్నార్ చివరి మూవీ

మనం చిత్రమే ఏఎన్నార్ నటించిన చివరి మూవీ. ఈ మూవీ రిలీజ్ కాకముందే ఆయన మరణించారు. ఈ చిత్రంలో నాగార్జున, శ్రీయ నా కొడుకుగా ఏఎన్నార్.. నాగచైతన్య, సమంత కొడుకుగా నాగార్జున నటించారు. వివిధ టైమ్ పీరియడ్స్ లో జరిగే ఈ కథకి విక్రమ్ కుమార్ అద్భుతమైన ఎమోషన్స్ జోడించి మ్యాజిక్ చేశారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
అక్కినేని నాగార్జున
నాగ చైతన్య
రామ్ చరణ్ కొణిదెల

Latest Videos
Recommended Stories
Recommended image1
రామ్ చరణ్ కోసం మలయాళ హీరోయిన్ ను సెట్ చేస్తోన్న సుకుమార్, నిజమెంత..?
Recommended image2
Top 10 Romantic movies: లవర్స్ తప్పక చూడాల్సిన తెలుగు టాప్‌ 10 బెస్ట్ లవ్‌, రొమాంటిక్‌ మూవీస్‌
Recommended image3
Actress Poorna: రెండోసారి తల్లి కాబోతున్న నటి పూర్ణ, బేబీ బంప్ ఫోటోలు చూసేయండి
Related Stories
Recommended image1
గద్దర్ అవార్డులు కాదు, దిల్ రాజు ఫ్యామిలీ అవార్డులు అంటూ కామెంట్స్.. స్టార్ ప్రొడ్యూసర్ రియాక్షన్
Recommended image2
పెళ్లి బట్టలని అందుకే సమంత అలా చేసింది.. రివెంజ్ గౌనుపై డిజైనర్ క్లారిటీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved