2017 అక్టోబర్‌లో నటుడు నాగ చైతన్యను సమంత వివాహం చేసుకున్నారు. అయితే, నాలుగేళ్ల తర్వాత వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఈ విడాకుల అనంతరం సమంత తన వెడ్డింగ్ గౌనుగౌను బ్లాక్ కలర్ డిజైనర్ డ్రెస్సుగా మార్చేసింది.

సమంత రివెంజ్ గౌను 

సమంత చాలా రోజుల క్రితం ఓ బ్లాక్ డ్రెస్ ధరించి ఆ ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సమంత, నాగ చైతన్యతో జరిగిన పెళ్ళిలో ఆమె ధరించిన వెడ్డింగ్ గౌను అది. నాగ చైతన్యతో విడిపోయాక పెళ్ళికి సంబంధించినవి చేదు జ్ఞాపకంలా మిగిలాయి. అందుకే ఆ వెడ్డింగ్ గౌనుని సమంత డిజైన్, కలర్ మార్చేసి వేరే డ్రెస్ లాగా చేయించుకుంది. సమంత రివేంజ్ గౌను అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయింది కూడా. ఆ గౌనుని మార్చి డిజైన్ చేసిన డిజైనర్ క్రెషా బజాజ్ తాజాగా ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. 

2017 అక్టోబర్‌లో నటుడు నాగ చైతన్యను సమంత వివాహం చేసుకున్నారు. ఈ వేడుక క్రైస్తవ సంప్రదాయంలో, హిందూ సంప్రదాయంలో ఘనంగా జరిగింది. అయితే, నాలుగేళ్ల తర్వాత వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఈ విడాకుల అనంతరం సమంత తన వెడ్డింగ్ గౌనుగౌను బ్లాక్ కలర్ డిజైనర్ డ్రెస్సుగా మార్చేసింది. ప్రముఖ డిజైనర్ క్రేషా బజాజ్ ఈ బ్లాక్ డ్రెస్సును రూపొందించారు. 

పెళ్లి బట్టలని అందుకే అలా మార్చేసింది 

ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో క్రేషా బజాజ్ ఈ విషయం పై స్పందించారు. “ఈ గౌన్ మార్పు వెనక ఉద్దేశం రివెంజ్ కాదు. ఇది గతాన్ని తుడిచేయాలన్న ఆలోచన కానే కాదు. అందుకే సమంత ఆ డ్రెస్ ని దూరం చేసుకోవాలి అని అనుకోలేదు. ఒక ఎమోషనల్ మెమొరీ గా కొత్తగా ప్రారంభించాలనే ఉద్దేశంతో పెళ్లి గౌనుని సమంత పార్టీ వేర్ గా మార్పించుకుంది అని క్రెషా బజాజ్ పేర్కొన్నారు.

సమంత వ్యక్తిగత జీవితం కొత్త దశలోకి ప్రవేశించగా, నాగ చైతన్య ఇప్పటికే నటి శోభిత ధూళిపాళను వివాహం చేసుకున్నట్టు పలు కథనాలు వెలువడుతున్నాయి. మరోవైపు సమంతకు దర్శకుడు రాజ్ నిడిమోరుతో సంబంధం ఉందన్న వార్తలు కూడా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.సమంత పెళ్లి గౌను డిజైన్ మార్చుకోవడం కేవలం ఫ్యాషన్ స్టేట్‌మెంట్ కాదని, వ్యక్తిగత స్వీకరణకు సంకేతంగా ఉండటమే ప్రధాన ఉద్దేశమని డిజైనర్ స్పష్టత ఇచ్చారు.

View post on Instagram

నిర్మాతగా సమంత 

సమంత ఇటీవల నిర్మాతగా మారి శుభం చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ పర్వాలేదనిపించే విజయం సాధించింది. ఓటిటిలో అయితే దూసుకుపోతోంది. ఫన్నీ కాన్సెప్ట్ తో భార్య భర్తల మధ్య బంధం ఎలా ఉండాలి అనే చిన్న సందేశంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ మూవీలో సమంత మాయ అనే పాత్రలో నటించింది.