MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Top 10 Romantic movies: లవర్స్ తప్పక చూడాల్సిన తెలుగు టాప్‌ 10 బెస్ట్ లవ్‌, రొమాంటిక్‌ మూవీస్‌

Top 10 Romantic movies: లవర్స్ తప్పక చూడాల్సిన తెలుగు టాప్‌ 10 బెస్ట్ లవ్‌, రొమాంటిక్‌ మూవీస్‌

Top 10 Romantic movies: ప్రేమికుల రోజు సందర్భంగా లవ్‌ స్టోరీస్‌కి ఫుడ్‌ డిమాండ్‌ ఉంటుంది. అయితే ఐఎండీవీ ఇచ్చి లిస్ట్ ప్రకారం లవర్స్ తప్పక చూడాల్సిన తెలుగులో వచ్చిన టాప్‌ 10 లవ్‌ అండ్‌ రొమాంటిక్ చిత్రాలేంటో చూద్దాం. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Feb 11 2026, 11:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
1.సీతా రామం
Image Credit : our own

1.సీతా రామం

దుల్కర్‌ సల్మాన్‌, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటించిన చిత్రమిది. హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. రొమాంటిక్‌ లవ్‌ స్టోరీ నేపథ్యంలో సాగే ఈ చిత్రం 2022లో విడుదలైన బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. ఎవరూ లేని ఒక సైనికుడికి, ఒక రాజుల కుటుంబానికి చెందిన ప్రిన్సెస్‌కి మధ్య సాగే లవ్‌ స్టోరీ ఇది.  చూస్తున్నసేపు ఆ ప్రేమలో, రొమాన్స్ లో మునిగిపోతారు.

210
2.హాయ్‌ నాన్న
Image Credit : Asianet News

2.హాయ్‌ నాన్న

నాని, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటించిన చిత్రమిది. శౌర్యువ్‌ దర్శకత్వం వహించారు. కూతురుకి తన లవ్‌ స్టోరీని చెప్పే చిత్రం. ఆద్యంతం ఎమోషనల్‌గా సాగే లవ్‌ అండ్‌ రొమాంటిక్‌ ఫిల్మ్. లవర్స్ మాత్రం చూస్తున్నంత సేపు ఆ ప్రపంచంలో ఉండిపోతారు. 2023లో విడుదలైన ఈ మూవీ పెద్ద హిట్‌ అయ్యింది.

Related Articles

Related image1
Varanasi Movie: మహేష్‌, రాజమౌళి ఎంత కష్టపడ్డా అది సాధ్యం కాలేదు.. వారణాసిపై గ్లోబల్‌ హైప్‌ ఇచ్చిన ప్రియాంక భర్త
Related image2
Jr Ntr: ఆగిపోయిన ఎన్టీఆర్‌ సినిమాని ఇండస్ట్రీ హిట్‌ చేసిన దర్శకుడు ఎవరో తెలుసా? తారక్‌ కెరీర్‌నే మార్చేసిన మూవీ
310
3.ఏ మాయ చేసావె
Image Credit : prime video

3.ఏ మాయ చేసావె

లవ్‌ అండ్‌ రొమాంటిక్‌ మూవీస్‌లో ప్రేమని పీక్‌లోకి తీసుకెళ్లే చిత్రం `ఏ మాయ చేశావె`. నాగచైతన్య, సమంత జంటగా నటించారు. గౌతమ్‌ మీనన్‌ రూపొందించారు. 2010లో విడుదలై బ్లాక్‌ బస్టర్‌ గా, ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది. చైతూ, సమంత ల మధ్య లవ్‌, కెమిస్ట్రీ కట్టిపడేస్తుంది.

410
4.ఫిదా
Image Credit : our own

4.ఫిదా

తెలంగాణ బ్యాక్‌ డ్రాప్‌లో సాగే లవ్‌ అండ్‌ రొమాంటిక్‌ ఫిల్మ్ `ఫిదా`. వరుణ్‌ తేజ్‌, సాయిపల్లవి నటించారు. తెలంగాణ అమ్మాయి, ఎన్‌ఆర్‌ఐ అబ్బాయి మధ్య లవ్‌ స్టోరీని ఆవిష్కరించే చిత్రమిది. పాటలు, లవ్‌ స్టోరీ సరికొత్త అనుభూతిని ఇస్తుంది. సాయిపల్లవి కట్టిపడేస్తుంది.

510
5.గీతాంజలి
Image Credit : Asianet News

5.గీతాంజలి

రొమాంటిక్‌ లవ్‌ స్టోరీస్‌లో మాస్టర్‌ పీస్‌గా చెప్పుకునే చిత్రం `గీతాంజలి`. మణిరత్నం రూపొందించిన చిత్రమిది. 1989లో విడుదలై, పెద్ద హిట్‌ అయ్యింది. నాగార్జునకి బ్రేక్‌ ఇచ్చింది. ఇందులో ఆయన సరసన గిరిజా షెట్టర్‌ హీరోయిన్‌గా నటించింది. మణిరత్నం టేకింగ్‌, నాగార్జున, గిరిజ నటన కట్టిపడేస్తుంది. ఈ మూవీ చూస్తే ఆ హ్యాంగోవర్‌ నుంచి రావడానికి చాలా రోజులు పడుతుంది.

610
6.ఆర్య
Image Credit : SUN NXT

6.ఆర్య

తెలుగులో వచ్చిన రొమాంటిక్‌ లవ్‌ స్టోరీస్‌లో `ఆర్య` ఒకటి. ఇదొక టిఫికల్‌ రొమాంటిక్‌ లవ్‌ స్టోరీ. అల్లు అర్జున్‌, అనురాధా మెహతా జంటగా నటించారు. శివ బాలాజీ కీలక పాత్ర పోషించారు. సుకుమార్‌ రూపొందించారు. 2004లో విడుదలైన ఈ మూవీ అల్లు అర్జున్‌ లైఫ్‌నే మార్చేసింది. ఈ మూవీ చూస్తుంటే మతిపోవాల్సిందే.

710
7.బొమ్మరిల్లు
Image Credit : facebook.com/SriVenkateswaraCreations

7.బొమ్మరిల్లు

సిద్ధార్థ్‌, జెనీలియా జంటగా నటించిన రొమాంటిక్‌ లవ్‌ స్టోరీ `బొమ్మరిల్లు`. భాస్కర్‌ రూపొందించిన ఈ చిత్రం 2006లో విడుదలై బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. అప్పట్లో ఈ మూవీ యూత్‌ని ఓ ఊపు ఊపేసింది. లవర్స్ ఇప్పటికీ దీన్ని బాగా ఎంజాయ్‌ చేస్తారు.

810
8.మళ్లీ మళ్లీ ఇది రాని రోజు
Image Credit : Asianet News

8.మళ్లీ మళ్లీ ఇది రాని రోజు

`మళ్లీ మళ్లీ ఇది రాని రోజు`.. శర్వానంద్‌, నిత్యా మీనన్‌ నటించిన రొమాంటిక్‌ డ్రామా చిత్రమిది. క్రాంతి మాధవ్‌ రూపొందించారు. రొమాంటిక్‌ లవ్‌ స్టోరీలో పీక్‌ ని చూపించే చిత్రమిది. స్లోగా సాగినా, హృదయాన్ని కట్టిపడేస్తుంది. ఎమోషనల్‌ డెప్త్, మ్యూజిక్‌ మిమ్మల్ని మర్చిపోయేలా చేస్తుంది. 2015లో విడుదలై మంచి ఆదరణ పొందింది.

910
9.7/జీ బృందావన కాలని
Image Credit : Asianet News

9.7/జీ బృందావన కాలని

రవి కృష్ణ, సోనియా అగర్వాల్‌ జంటగా నటించిన మూవీ `7/జీ బృందావనం కాలనీ`, సెల్వరాఘవన్‌ రూపొందించారు. సుమన్‌ శెట్టి కామెడీ రోల్‌ చేశారు. ఆద్యంతం నవ్విస్తూ, హృదయాన్ని కదలించే చిత్రమిది. రొమాన్స్ తోపాటు ఎమోషన్స్ కట్టిపడేస్తుంది. గుండె బరువెక్కుతుంది. ఇది 2004లో విడుదలై ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది.

1010
10.శ్యామ్ సింగరాయ్‌
Image Credit : our own

10.శ్యామ్ సింగరాయ్‌

రొమాంటిక్‌ లవ్‌ స్టోరీస్‌లో నాని నటించిన మరో మూవీ `శ్యామ్‌ సింగరాయ్‌` కూడా ఉంది. రాహుల్‌ సాంక్రిత్యన్‌ దర్శకత్వం వహించిన చిత్రమిది. నాని, సాయిపల్లవి, కృతి శెట్టి నటించారు. ఇందులో లవ్‌ స్టోరీ పొయెటిక్‌గా ఉంటూ కట్టిపడేస్తుంది. ఈ మూవీ 2021లో విడుదలై ఆకట్టుకుంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
నాని (నటుడు)
నాగ చైతన్య
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Actress Poorna: రెండోసారి తల్లి కాబోతున్న నటి పూర్ణ, బేబీ బంప్ ఫోటోలు చూసేయండి
Recommended image2
Illu Illalu Pillalu Today Episode Feb 11: అమూల్యను పెళ్లిచేసుకోలేదని వల్లికి చెప్పేసిన విశ్వక్, నర్మద ప్రేమలకు షాకిచ్చిన భాగ్యం
Recommended image3
పవన్ కళ్యాణ్ కోసం పోలీసు దెబ్బలు తిన్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవరో తెలుసా? కారణం ఏంటి?
Related Stories
Recommended image1
Varanasi Movie: మహేష్‌, రాజమౌళి ఎంత కష్టపడ్డా అది సాధ్యం కాలేదు.. వారణాసిపై గ్లోబల్‌ హైప్‌ ఇచ్చిన ప్రియాంక భర్త
Recommended image2
Jr Ntr: ఆగిపోయిన ఎన్టీఆర్‌ సినిమాని ఇండస్ట్రీ హిట్‌ చేసిన దర్శకుడు ఎవరో తెలుసా? తారక్‌ కెరీర్‌నే మార్చేసిన మూవీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved