- Home
- Entertainment
- TV
- Illu Illalu Pillalu:మొన్న ప్రేమ, ఇప్పుడు నర్మద.. ఇల్లు ఇల్లాలు సీరియల్ నుంచి ఔట్, ఏం జరుగుతోంది?
Illu Illalu Pillalu:మొన్న ప్రేమ, ఇప్పుడు నర్మద.. ఇల్లు ఇల్లాలు సీరియల్ నుంచి ఔట్, ఏం జరుగుతోంది?
Illu Illalu Pillalu: బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న సీరియల్స్ లో ఇల్లు ఇల్లాలు పిల్లలు ముందు వరసలో ఉంది. కాగా, ఈ సీరియల్ నుంచి ప్రధాన పాత్రధారులందరూ ఒక్కొక్కరుగా తప్పుకుంటున్నారు.

ఇల్లు ఇల్లాలు పిల్లలు..
Illu Illalu Pillalu: స్టార్ మా ఛానెల్ లో టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్స్ లో ఇల్లు ఇల్లాలు పిల్లలు కూడా ఒకటి. ఈ సీరియల్ కథ ఆసక్తికరంగా ఉండటంతో పాటు.. ఆ కథకు తగినట్లు పాత్రకు ప్రాణం పోసిన నటీనటులు కూడా సీరియల్ హిట్ అవ్వడానికి మెయిన్ రీజన్.
మరీ ముఖ్యంగా ప్రేమ, నర్మద క్యారెక్టర్లను ప్రేక్షకులు చాలా ఓన్ చేసుకున్నారు. ప్రేమ పాత్రలో కన్నడ బ్యూటీ లావణ్య నటిస్తుండగా.. నర్మద పాత్రలో మన తెలుగు అమ్మాయి అన్షూ రెడ్డి నటిస్తోంది. వీరిద్దరి నటనకు, వారి క్యారెక్టరైజేషన్ కి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అయితే.. ఇప్పుడు ఈ ఇద్దరూ సీరియల్ నుంచి తప్పుకోవడం బాధాకరం.
తల్లి కాబోతున్న లావణ్య..
ప్రేమ పాత్ర పోషిస్తున్న లావణ్య.. తన జీవితంలో కొత్త అడుగువేస్తోంది. ఆమెకు ఆల్రెడీ పెళ్లై నాలుగు సంవత్సరాలు కాగా.. ఇప్పుడు తల్లి కాబోతుంది. ఈ విషయాన్ని తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో ప్రకటించింది. తన బేబీ బంప్ తో ఉన్న వీడియో షేర్ చేసి.. తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది. అయితే... తాను తల్లికాబోతున్నానని తెలిసిన వెంటనే.. ఆమె ఈ సీరియల్ నుంచి తప్పుకుంది. ప్రేమ క్యారెక్టర్ లో లావణ్య నటించదు అనే వార్త బయటకు రాగానే అభిమానులు చాలా బాధపడ్డారు. ఆమె పాత్రలో కొత్తగా ఎవరు వస్తారు? వచ్చిన ఆమెను అభిమానులు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనే సందేహంలో ఉండగానే... అన్షూ రెడ్డి కూడా షాకిచ్చింది.
సీరియల్ నుంచి తప్పుకున్న అన్షూ..
నర్మద పాత్రలో నటించి అందరి మనసులు గెలిచిన అన్షూ రెడ్డి కూడా తాజాగా ఈ సీరియల్ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే.. అన్షూ ఏ కారణంతో తప్పుకుంది అనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. మరి.. ఎంతగానో అభిమానించే ఈ ఇద్దరు లేకుండా.. వారి స్థానంలో కొత్త వారిని తీసుకుంటే.. అభిమానులు అంగీకరిస్తారా? కొత్త వారిని ఆదరిస్తారా? వీరిద్దరూ వెళ్లిపోవడం వల్ల సీరియల్ రేటింగ్ ఏమైనా పడిపోతుందా? అనే విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

