MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 23 ఏళ్ళ క్రితం బాలయ్య, మహేష్ చిత్రాలకు చుక్కలు చూపించిన కుర్ర హీరో.. చైల్డ్ ఆర్టిస్ట్ ఇంత రచ్చ చేస్తాడని..

23 ఏళ్ళ క్రితం బాలయ్య, మహేష్ చిత్రాలకు చుక్కలు చూపించిన కుర్ర హీరో.. చైల్డ్ ఆర్టిస్ట్ ఇంత రచ్చ చేస్తాడని..

నందమూరి బాలకృష్ణ నటించిన చిత్రాలు సంక్రాంతికి విడుదలైతే హిట్ గ్యారెంటీ అనే నమ్మకం ఫ్యాన్స్ లో ఉంటుంది. బాలయ్య కి సంక్రాంతి లక్కీ సీజన్ అని అంతా అంటుంటారు. కానీ గతంలో ఒకసారి సంక్రాంతికి బాలయ్యకి పరాభవం తప్పలేదు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Jun 25 2025, 05:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బాలయ్యకి సంక్రాంతి లక్కీ సీజన్
Image Credit : Asianet News

బాలయ్యకి సంక్రాంతి లక్కీ సీజన్

నందమూరి బాలకృష్ణ నటించిన చిత్రాలు సంక్రాంతికి విడుదలైతే హిట్ గ్యారెంటీ అనే నమ్మకం ఫ్యాన్స్ లో ఉంటుంది. బాలయ్య కి సంక్రాంతి లక్కీ సీజన్ అని అంతా అంటుంటారు. కానీ గతంలో ఒకసారి సంక్రాంతికి బాలయ్యకి పరాభవం తప్పలేదు. బాలయ్య చిత్రానికి పోటీగా ఒక కుర్ర హీరో చిత్రం విడుదలై సంచలనం సృష్టించింది. ఆ కుర్ర హీరో ఎవరో కాదు ఒకప్పుడు లవర్ బాయ్ గా సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్న తరుణ్.

25
2002లో బాలయ్యకి డిజాస్టర్
Image Credit : balakrishna face book

2002లో బాలయ్యకి డిజాస్టర్

బాలకృష్ణ ఆదిత్య 369 చిత్రంలో తరుణ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. కానీ పెద్దయ్యాక బాలయ్య చిత్రానికే ఎసరుపెట్టాడు. 2002 సంక్రాంతికి బాలయ్య నటించిన సీమ సింహం చిత్రం భారీ అంచనాలతో రిలీజ్ అయింది. ఈ చిత్రంలో బాలయ్యకు జోడీగా సిమ్రాన్ నటించింది. జి రాంప్రసాద్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ మూవీ విడుదలైన రెండు రోజులు వ్యవధిలో తరుణ్, ఆర్తి అగర్వాల్ నటించిన నువ్వు లేక నేను లేను చిత్రం రిలీజ్ అయింది.

Related Articles

Related image1
పెళ్లి తర్వాత అఖిల్ చేస్తున్న తొలి చిత్రానికి షాక్.. శ్రీలీల ఇలా ఎందుకు చేసింది ?
Related image2
ఏఎన్నార్ కి నచ్చిన కథ మెగా హీరో చేతుల్లోకి.. తెలివిగా రిజెక్ట్ చేయడం వల్ల అద్భుతం జరిగింది తెలుసా ?
35
బాలయ్య చిత్రాన్ని డామినేట్ చేసిన కుర్ర హీరో
Image Credit : Nandamuri Balakrishna /Facebook

బాలయ్య చిత్రాన్ని డామినేట్ చేసిన కుర్ర హీరో

బాలయ్య సీమ సింహం చిత్రానికి డిజాస్టర్ రాగా, నువ్వు లేక నేను లేను చిత్రం సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోయింది. అన్ని ఏరియాలలో సీమ సింహం కలెక్షన్లని డామినేట్ చేస్తూ నువ్వు లేక నేను లేను చిత్రం వసూళ్ల ప్రభంజనం సృష్టించింది.ఈ చిత్రం నటుడు, దర్శకుడు అయిన కాశీ విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కింది. ప్రస్తుతం ఆయన టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నారు.  

45
మహేష్ సినిమా కూడా నిలబడలేకపోయింది
Image Credit : instagram

మహేష్ సినిమా కూడా నిలబడలేకపోయింది

ఆదిత్య 369 చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన తరుణ్.. పెద్దయ్యాక బాలయ్య చిత్రాన్ని డామినేట్ చేసే స్థాయికి ఎదుగుతాడని ఎవరూ ఊహించి ఉండరేమో. అదే సమయంలో మహేష్ బాబు టక్కరి దొంగ చిత్రం కూడా రిలీజ్ అయింది. ఆ మూవీ కూడా నువ్వు లేక నేను లేను చిత్రం ముందు నిలబడలేకపోయింది.

55
తరుణ్ హిట్ చిత్రాలు
Image Credit : Instagram

తరుణ్ హిట్ చిత్రాలు

ఆ విధంగా తరుణ్ ఒకప్పుడు స్టార్ హీరోల చిత్రాలకు కూడా చెమటలు పట్టించాడు. కానీ ప్రస్తుతం తరుణ్ టాలీవుడ్ లో కనుమరుగైన పరిస్థితి. ఊహించని విధంగా అతడి కెరీర్ డౌన్ ఫాల్ అయింది. దివంగత నటి ఆర్తి అగర్వాల్, తరుణ్ గురించి అప్పట్లో ఇండస్ట్రీలో చాలా రూమర్స్ వినిపించాయి. తరుణ్ తన కెరీర్ లో నువ్వే కావాలి, నువ్వే నువ్వే, ప్రియమైన నీకు, ఎలా చెప్పను, నవవసంతం లాంటి హిట్ చిత్రాల్లో నటించారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
నందమూరి బాలకృష్ణ
మహేష్ బాబు ఘట్టమనేని

Latest Videos
Recommended Stories
Recommended image1
Jr Ntr: ఆగిపోయిన ఎన్టీఆర్‌ సినిమాని ఇండస్ట్రీ హిట్‌ చేసిన దర్శకుడు ఎవరో తెలుసా? తారక్‌ కెరీర్‌నే మార్చేసిన మూవీ
Recommended image2
Gunde Ninda Gudi Gantalu: విద్య కన్నీళ్లకు పడిపోయిన మనోజ్, మరో లక్షకు రోహిణీ టోపీ,తప్పు తెలుసుకున్న బాలు
Recommended image3
Karthika Deepam 2 Today Episode: శ్రీధర్ డ్రైవర్ గా కాశీ- షాక్ నుంచి కోలుకోని జ్యో,పారు- దశరథ డౌట్
Related Stories
Recommended image1
పెళ్లి తర్వాత అఖిల్ చేస్తున్న తొలి చిత్రానికి షాక్.. శ్రీలీల ఇలా ఎందుకు చేసింది ?
Recommended image2
ఏఎన్నార్ కి నచ్చిన కథ మెగా హీరో చేతుల్లోకి.. తెలివిగా రిజెక్ట్ చేయడం వల్ల అద్భుతం జరిగింది తెలుసా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved