సూర్యకాంతంను పట్టించుకోని టాలీవుడ్, మరణం తరువాత కూడా దక్కని గౌరవం
తెలుగు పరిశ్రమలో గొప్ప నటి సూర్యకాంతం. ఆమె చేసిన పాత్రలు ఇప్పటికీ తెలుగువారి మనసుల్లో అలా నిలిచిపోయి ఉంటాయి. అంతటి గొప్ప నటిని టాలీవుడ్ అవమానించిందా? ఆమెకు ఇవ్వాల్సిన గౌవరం ఇవ్వలేదా?

తెలుగు సినీ పరిశ్రమలో వెలుగు వెలిగిన తారలు చాలామంది ఉన్నారు. ఆకాలంలో హీరోలు మాత్రమే కాదు క్యారెక్టర్ రోల్స్ చేసేవారు, విలన్ పాత్రలు వేసేవారు కూడా ప్రేక్షకుల్లో స్టార్ ఇమేజ్ ను కలిగి ఉండేవారు. మరీ ముఖ్యంగా సూర్యకాంతం, ఎస్వీఆర్, రేలంగి, రాజబాబు, రమాప్రభ, రావు గోపాల్ రావు, రాజనాల, మక్కమాల,నాగభూషణ, గుమ్మడి, ప్రభాకర్ రెడ్డి లాంటి క్యారెక్టర్ రోల్స్ చేసే వారు కూడా స్టార్లుగా వెలుగు వెలిగేవారు.
అయితే ఆ కాలం తారల్లో చాలామందికి పరిశ్రమ నుంచి, ప్రభుత్వాల నుంచి తగిన గౌరవం దక్కలేదన్నది అందరికి తెలిసిన సత్యం. కొంత మంది స్టార్స్ మాత్రం అవార్డ్ లు అందుకున్నారు, డాక్టరేట్లు అందుకున్నారు, మరణం తరువాత కూడా ప్రభుత్వ సత్కారాలు పొందారు. కాని కొంత మంది తారలు మాత్రం కనీస మర్యాదకు కూడా నోచుకోలేదు. వారు మరణించిన తరువాత కూడా పరిశ్రమ పట్టించుకోలేదు. ఈ కోవాలోకే వస్తారు సూర్యకాంతం, కైకాల సత్యనారాయణ లాంటి నటీనటులు.
కైకాల కూడా అంతే ఎన్నో పాత్రలతో అద్భుతాలు చేసిన కైకాల సత్యనారాయణకు కనీసం పద్మశ్రీ కూడా ఇవ్వలేదు. ఇక సూర్యకాంతం పాత్రల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె మంచి ఫామ్ లో ఉన్నప్పుడు అందరు మంచిగానే ఉన్నారు. షూటింగ్ ఉందంటే రకరకాల వంటలతో..అక్కడ ఉన్నవారి కడుపు నిండా తిండి పెట్టేవారు సూర్యాకాంతం. కాని ఆతరువాత అవకాశాలు తగ్గి, సినిమాలు చేయలేనిపరిస్థితి వచ్చినప్పుడు మాత్రం సూర్యకాంతంను పట్టించుకునేవారు కరువయ్యారు.
స్టార్ హీరోలకు సమానంగా సూర్యకాంతం స్టార్ డమ్ ఉండేది. గుండమ్మ కథ లాంటి సినిమాల్లో ఎన్టీఆర్, ఎస్వీఆర్, ఏఎన్నార్ లాంటిస్టార్ హీరోలు ఉన్నా కాని.. ఆ సినిమాకు సూర్యకాంత పాత్ర పేరు అయిన గుండమ్మ ను టైటిట్ గా పెట్టారంటే సూర్యకాంతం చేసిన పాత్రలు ఎంత అద్భుతాలో అర్ధం అవుతుంది. అటుంటి ఆమెకు ఎటువంటి ప్రభుత్వ సత్కారాలు అందకపోగా.. ఆమె 1996 లో మరణించినప్పుడు పట్టుమని పదిమంది కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వెళ్లలేదు. అసలు ఆమెను స్టార్స్ ఎవరు పట్టించుకోలేదు.
ఈ విషయాన్ని సీనియర్ నటుడు మురళీ మోహన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇండస్ట్రీలో ఫామ్ లో ఉండి సినిమాలు చేసినప్పుడే గౌరవం ఇస్తారు. సినిమాలు తగ్గిపోయి, ఫేమ్ పోయిన తరువాత ఎవరు పట్టించుకోరు. మన పరిశ్రమ దరిద్రమే అది. సూర్యకాంతం లాంటి అద్భుతమైన నటీమణికి కనీస గౌరవం దక్కలేదు. అవార్డ్ లు ఇవ్వలేదు , డాక్టరేట్ కూడా ఇవ్వలేదనుకుంటా, ఆమె మరణం తరువాత కూడా కనీసాం ఆమె సొంత ఊరు అయిన కాకినాడలో కూడా విగ్రహం పెట్టలేదు అని అన్నారు మురళీమోహన్. ఇక రాజమండ్రి లో పుట్టిపెరిగిన రాజబాబు, శోభన్ బాబు లాంటి స్టార్స్ కు మురళీ మోహన్ విగ్రహాలు పెట్టించారు. ఈ విషయాన్ని కూడా ఆయన గుర్తు చేసుకున్నారు.