MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • RRR, రంగస్థలం చిత్రాలకి ఏమాత్రం తగ్గదు.. రామ్ చరణ్ తో మూవీపై సొంతూరిలో సుకుమార్ కామెంట్స్

RRR, రంగస్థలం చిత్రాలకి ఏమాత్రం తగ్గదు.. రామ్ చరణ్ తో మూవీపై సొంతూరిలో సుకుమార్ కామెంట్స్

చాలా రోజుల తర్వాత సుకుమార్ తన సొంత గ్రామం మట్టపర్రులో పర్యటించారు. తన సొంతూరిలో రామ్ చరణ్ తో చేయబోయే తదుపరి చిత్రం గురించి సుకుమార్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. 

2 Min read
Author : Tirumala Dornala
| Updated : May 21 2025, 12:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
రామ్ చరణ్ తో సుకుమార్ రెండోసారి
Image Credit : Asianet News

రామ్ చరణ్ తో సుకుమార్ రెండోసారి

పుష్ప 2 షూటింగ్ పూర్తి అయినప్పటి నుంచి దర్శకుడు సుకుమార్ తదుపరి ప్రాజెక్ట్ పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. సుకుమార్ తన కొత్త చిత్రాన్ని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో చేయబోతున్నారనే సంగతి తెలిసిందే. దీని గురించి ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం రామ్ చరణ్.. బుచ్చి బాబు దర్శకత్వంలో పెద్ది అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత సుకుమార్ చిత్రం మొదలవుతుంది.

26
సొంతూరిలో సుకుమార్
Image Credit : Ram charan Sukumar

సొంతూరిలో సుకుమార్

పుష్ప 2 రిలీజ్ అయ్యాక సుకుమార్ కి కాస్త తీరిక సమయం దొరికింది. ఈ నేపథ్యంలో, సుకుమార్ ఇటీవల తన సొంతూరు ఆంధ్రప్రదేశ్ లోని మలికిపురం మండలం, మట్టపర్రు గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ తో చిత్రం గురించి సుకుమార్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రామ్ చరణ్ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్, ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి .

Related Articles

Related image1
కాన్స్ 2025: జాన్వీ కపూర్ స్టన్నింగ్ లుక్ వైరల్, ఆమె డ్రెస్ మోసేందుకు సిబ్బంది కష్టాలు చూడండి
Related image2
ఇష్టం లేకపోయినా సూపర్ స్టార్ కృష్ణకి విలన్ గా నటించిన లెజెండ్రీ నటుడు.. చరిత్ర సృష్టించిన మూవీ అది
36
RRR, రంగస్థలం చిత్రాలని మించేలా.. 
Image Credit : our own

RRR, రంగస్థలం చిత్రాలని మించేలా.. 

షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందనేది త్వరలోనే చెబుతాం అని సుకుమార్ అన్నారు. మా ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం ఆల్ టైం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందని, ఆ తర్వాత రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ చిత్రంతో పాన్ ఇండియా గుర్తింపు పొందారని సుకుమార్ అన్నారు. ఈ రెండు చిత్రాలకు తగ్గకుండా రామ్ చరణ్ తో తాను తీయబోయే చిత్రం ఉంటుందని సుక్కు అంచనాలు పెంచేశారు.  ఈ సినిమాకు RC 17 అనేది వర్కింగ్ టైటిల్. 

46
మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో..
Image Credit : Google

మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో..

ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి, ముఖ్యంగా రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్, సుకుమార్ మళ్లీ చేతులు కలపడంతో ఇండస్ట్రీలో ఈ మూవీపై ఆసక్తి నెలకొంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కూడా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించబోతున్నట్లు తెలుస్తోంది. సుకుమార్ మూవీ అంటే దేవిశ్రీ మ్యూజిక్ ఉండాల్సిందే.

56
థియేటర్లకు ఆదరణ తగ్గలేదు 
Image Credit : our own

థియేటర్లకు ఆదరణ తగ్గలేదు 

సుకుమార్ మాట్లాడుతూ ఇండస్ట్రీపై ఓటీటీ ప్రభావం గురించి కూడా తన అభిప్రాయాన్ని తెలిపారు. థియేటర్ల విషయంలో ప్రేక్షకుల అభిరుచి మారలేదు. పట్టణాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లోని థియేటర్లకు ఎక్కువ ఆదరణ ఉంటుంది. పట్టణాల్లో ఓటీటీ ప్రభావం కొంత పెరిగింది అనేది వాస్తవమని సుకుమార్ తెలిపారు. తాను సుకుమార్ రైటింగ్స్ సంస్థని ప్రారంభించడానికి ముఖ్య ఉద్దేశం టాలెంట్ ఉన్న వారిని ప్రోత్సహించడం కోసమే అని తెలిపారు. ఆ విషయంలో తన సుకుమార్ రైటింగ్స్ సంస్థ విజయవంతం అయింది అని తెలిపారు.

66
ఇకపై ప్రతి ఏడాది వస్తా
Image Credit : our own

ఇకపై ప్రతి ఏడాది వస్తా

ప్రతి ఏడాది తన సొంత ఊరు మట్టపర్రులోనే సంక్రాంతి వేడుకలు జరుపుకోవాలనేది తన కోరిక అని సుకుమార్ అన్నారు. కానీ గత రెండేళ్లుగా పుష్ప 2 షూటింగ్ లో బిజీ షెడ్యూల్ లో ఇరుక్కుపోయానని, అందువల్ల తన సొంత ఊరికి రావడం కుదరలేదని తెలిపారు. ఇకపై క్రమం తప్పకుండా ఇక్కడికి వస్తానని తెలిపారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
రామ్ చరణ్ కొణిదెల

Latest Videos
Recommended Stories
Recommended image1
Thrice Married Actresses: మూడు పెళ్లిళ్లు చేసుకున్న సౌత్ హీరోయిన్లు వీరే
Recommended image2
మహేష్ బాబు వారణాసి తో పాటు 2026-27లో బాక్సాఫీస్‌ను షేక్ చేయబోయే 3 భారీ సినిమాలు ?
Recommended image3
సినిమా చూసి పేరెంట్స్ నన్ను తిట్టుకుంటారు, రైటర్ సూర్య ప్రకాష్ కామెంట్స్ వైరల్..
Related Stories
Recommended image1
కాన్స్ 2025: జాన్వీ కపూర్ స్టన్నింగ్ లుక్ వైరల్, ఆమె డ్రెస్ మోసేందుకు సిబ్బంది కష్టాలు చూడండి
Recommended image2
ఇష్టం లేకపోయినా సూపర్ స్టార్ కృష్ణకి విలన్ గా నటించిన లెజెండ్రీ నటుడు.. చరిత్ర సృష్టించిన మూవీ అది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved