MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఇష్టం లేకపోయినా సూపర్ స్టార్ కృష్ణకి విలన్ గా నటించిన లెజెండ్రీ నటుడు.. చరిత్ర సృష్టించిన మూవీ అది

ఇష్టం లేకపోయినా సూపర్ స్టార్ కృష్ణకి విలన్ గా నటించిన లెజెండ్రీ నటుడు.. చరిత్ర సృష్టించిన మూవీ అది

సూపర్ స్టార్ కృష్ణ కెరీర్ లో ఆల్ టైం బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఒక చిత్రంలో విలన్ పాత్ర గురించి ఆసక్తికర విషయాలు తెలిశాయి. ఓ లెజెండ్రీ నటుడు ఆ చిత్రంలో ఇష్టం లేకపోయినప్పటికీ విలన్ గా నటించారట. ఆ వివరాలు తెలుసుకుందాం. 

2 Min read
Author : Tirumala Dornala
Published : May 21 2025, 10:34 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సూపర్ స్టార్ కృష్ణ సాహసాలు
Image Credit : Asianet News

సూపర్ స్టార్ కృష్ణ సాహసాలు

టాలీవుడ్ లో చరిత్రలో నిలిచిపోయే చిత్రాలు అప్పుడప్పుడు వస్తుంటాయి. సూపర్ స్టార్ కృష్ణ ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించారు. టాలీవుడ్ లో కౌబాయ్ చిత్రాల మొదలుపెట్టింది ఆయనే. ఎవరూ చేయని సాహసాలు చేసి చూపించారు. సినిమా మేకింగ్ లో అప్పట్లో కృష్ణ తీసుకున్న నిర్ణయాలు టాలీవుడ్ గతిని మార్చేశాయి. ఒకే ఏడాది అత్యధిక చిత్రాల్లో నటించిన రికార్డు కూడా కృష్ణ పైనే ఉంది.

25
అల్లూరిగా కృష్ణ అద్భుత నటన
Image Credit : google

అల్లూరిగా కృష్ణ అద్భుత నటన

సూపర్ స్టార్ కృష్ణ ఎన్ని అద్భుతమైన చిత్రాల్లో నటించినప్పటికీ అల్లూరి సీతారామరాజు చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రలో సూపర్ స్టార్ కృష్ణ ఎంతలా ఒదిగిపోయారో.. విలన్ గా బ్రిటిష్ అధికారి రూథర్ ఫోర్డ్ పాత్రలో లెజెండ్రీ నటుడు జగ్గయ్య కూడా అంతే అద్భుతంగా నటించారు. అయితే ఈ మూవీలో విలన్ గా నటించడం జగ్గయ్యకి ముందుగా ఇష్టం లేదట. కానీ చిత్ర యూనిట్ ఆయన్ని ఒప్పించారు.

Related Articles

Related image1
అలాంటి కథలతో చిరంజీవి విసిగిపోయారు, మునుపెన్నడూ చూడని మెగాస్టార్ ని చూస్తారు.. రచయిత కామెంట్స్
Related image2
అక్కినేని హీరోలపై రోజా ప్రశ్న.. సమంత, అమల రియాక్షన్ వైరల్ ? ఇద్దరూ ఒకే ఈవెంట్లో..
35
జగ్గయ్యకి ఆ పాత్రలో నటించడం ఇష్టం లేదా ?
Image Credit : our own

జగ్గయ్యకి ఆ పాత్రలో నటించడం ఇష్టం లేదా ?

జగ్గయ్యకి రూథర్ ఫోర్డ్ పాత్రలో నటించడం ఇష్టం లేకపోవడానికి ఓ కారణం ఉంది. ఆ పాత్రలో నటిస్తే నెగిటివ్ షేడ్స్ లో చెడ్డవాడిగా నటించాలి. జగ్గయ్యకి అలా నటించడం ఇష్టం లేదు. తన చిన్నతనంలో బ్రిటిష్ అధికారి రూథర్ ఫోర్డ్ గురించి జగ్గయ్య చాలా మంచి విషయాలు విన్నారట. జగ్గయ్య సొంత జిల్లా గుంటూరులో రూథర్ ఫోర్డ్ కలెక్టర్ గా పని చేశారట. ఆ టైంలో రూథర్ ఫోర్డ్ ఆసుపత్రులు కట్టించడం, పేదలకు అవసరమైన పనులు చేయడం లాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేశారని జగ్గయ్య విన్నారట. అందువల్ల రూథర్ ఫోర్డ్ పై జగ్గయ్యకి మంచి అభిప్రాయం ఉండేది.

45
జగ్గయ్య చేసిన సూచనలు
Image Credit : Asianet News

జగ్గయ్య చేసిన సూచనలు

దీంతో అల్లూరి సీతారామరాజు చిత్రంలో నటించాల్సి వచ్చినప్పుడు రూథర్ ఫోర్డ్ పాత్ర గురించి కొన్ని సూచనలు చేశారట. ఆయన పాత్రని కంప్లీట్ గా ఒక యాంగిల్ లోనే నెగిటివ్ గా చూపించడం కరెక్ట్ కాదు. ఆయన తన దేశానికి కట్టుబడిన సిన్సియర్ అధికారి. ఆయన కోణం నుంచి కూడా కొన్ని మంచి డైలాగులు రాయండి అని సూచించారట.

55
అల్లూరి సీతారామరాజు మూవీ ప్రభావం
Image Credit : Asianet News

అల్లూరి సీతారామరాజు మూవీ ప్రభావం

ఆ విధంగా జగ్గయ్య అల్లూరి సీతారామరాజు చిత్రంలో నటించారు. అల్లూరి సీతారామరాజు మూవీ చరిత్ర సృష్టించిన చిత్రంగా నిలిచిపోయింది. ఈ మూవీ తర్వాత కృష్ణ నటించిన చాలా చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. అల్లూరి సీతారామరాజు చిత్రం పెంచేసిన అంచనాలని ఆ తర్వాత కృష్ణ నటించిన చిత్రాలు ఏవీ అందుకోలేకపోయాయి. అంతలా ఆ మూవీ ప్రభావం ఉండేది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
కృష్ణ ఘట్టమనేని

Latest Videos
Recommended Stories
Recommended image1
Ileana హీరోయిన్‌ కాకపోతే ఏం చేసేదో తెలుసా? ఇంట్లో ఇష్టంగా చేసే పని ఇదే
Recommended image2
Thrice Married Actresses: మూడు పెళ్లిళ్లు చేసుకున్న సౌత్ హీరోయిన్లు వీరే
Recommended image3
మహేష్ బాబు వారణాసి తో పాటు 2026-27లో బాక్సాఫీస్‌ను షేక్ చేయబోయే 3 భారీ సినిమాలు ?
Related Stories
Recommended image1
అలాంటి కథలతో చిరంజీవి విసిగిపోయారు, మునుపెన్నడూ చూడని మెగాస్టార్ ని చూస్తారు.. రచయిత కామెంట్స్
Recommended image2
అక్కినేని హీరోలపై రోజా ప్రశ్న.. సమంత, అమల రియాక్షన్ వైరల్ ? ఇద్దరూ ఒకే ఈవెంట్లో..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved