MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఇంకా పెళ్లే కాలేదు, అప్పుడే ఇద్దరు పిల్లలకు తల్లి అయిన శ్రీలీల.. ఏం జరిగిందో తెలుసా?

ఇంకా పెళ్లే కాలేదు, అప్పుడే ఇద్దరు పిల్లలకు తల్లి అయిన శ్రీలీల.. ఏం జరిగిందో తెలుసా?

యంగ్‌ సెన్సేషన్‌ శ్రీలీల వరుస సినిమాలతో బిజీగా ఉంది. నేడు తన 24వ పుట్టిన రోజుని జరుపుకుంటోంది. ఈ క్రమంలో శ్రీలీలకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్‌ విషయం బయటకు వచ్చింది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Jun 14 2025, 08:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
టాలీవుడ్‌లోకి దూసుకొచ్చిన శ్రీలీల
Image Credit : sreeleela insta

టాలీవుడ్‌లోకి దూసుకొచ్చిన శ్రీలీల

శ్రీలీల టాలీవుడ్‌లో యంగ్‌ సెన్సేషన్‌. తొలి చిత్రంతోనే టాలీవుడ్‌లోకి దూసుకొచ్చిన హీరోయిన్‌. రెండు మూడేళ్లలోనే టాలీవుడ్‌లో ఓ ఊపు ఊపేసింది. యంగ్‌ హీరోల నుంచి స్టార్‌ హీరోల వరకు ఓ రౌండ్‌ చుట్టేసింది. తనదైన డాన్సులతో అలరించింది.

అయితే వరుసగా ఆఫర్లు వచ్చినా చాలా వరకు సినిమాలు ఆడకపోవడంతో ఒక్కసారిగా డౌన్‌ అయ్యింది శ్రీలీల. ఆమె ఎంత వేగంగా దూసుకొచ్చిందో, అంతే వేగంగా డౌన్‌ అయిపోయింది. తన క్రేజ్‌ మొత్తం పడిపోయింది.

25
వరుస ఫెయిల్యూర్స్ తో శ్రీలీల కెరీర్‌ డౌన్‌
Image Credit : sreeleela insta

వరుస ఫెయిల్యూర్స్ తో శ్రీలీల కెరీర్‌ డౌన్‌

శ్రీలీల `పెళ్లి సందడి` చిత్రంతోనే టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో శ్రీకాంత్‌ తనయుడు రోషన్ కి జోడీగా చేసింది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో వచ్చిన ఈ మూవీలో తనదైన డాన్సులతో ఆకట్టుకుంది. ఆ వెంటనే రవితేజతో `ధమాఖా` చిత్రంలో నటించి హిట్‌ అందుకుంది. ఈ మూవీలో శ్రీలీల డాన్సులకు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. 

అంతే ఒక్కసారిగా శ్రీలీలకి ఆఫర్లు కుప్పలు తెప్పలుగా అవకాశాలు వచ్చాయి. `స్కంద`, `భగవంత్‌ కేసరి`, `ఆదికేశవ`, `ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్‌`, `గుంటూరు కారం`, `రాబిన్‌హుడ్‌` వంటి చిత్రాల్లో నటించింది. ఈ మూవీస్‌లో `భగవంత్‌ కేసరి` ఒక్కటే ఆకట్టుకుంది. మిగిలిన అన్నీ పరాజయం చెందాయి.

Related Articles

Related image1
Kannappa Trailer: `కన్నప్ప` మూవీ ట్రైలర్‌ ఎలా ఉందంటే? ప్రభాస్, మంచు విష్ణు మధ్య ఎమోషనల్‌ డ్రైవ్‌.. అసలు కథ ఇదే
Related image2
సౌందర్య తన కెరీర్‌లో అత్యంత కష్టంగా ఫీలైన మూవీ ఏంటో తెలుసా? ఏకంగా తండ్రికి డెడికేట్‌
35
మళ్లీ పుంజుకున్న శ్రీలీల
Image Credit : sreeleela insta

మళ్లీ పుంజుకున్న శ్రీలీల

అల్లు అర్జున్‌తో కలిసి `పుష్ప 2`లో స్పెషల్ సాంగ్‌ చేసింది. `కిస్సిక్‌` అంటూ ఆమె అదరగొట్టింది. ఈ పాటతో నేషనల్‌ వైడ్‌గా ఫేమస్‌ అయ్యింది. దీంతో ఇతర భాషల్లోనూ ఆఫర్లని అందుకుంటోంది. ప్రస్తుతం శ్రీలీల మళ్లీ బిజీ అవుతోంది. తెలుగులో `మాస్‌ జాతర`, `ఉస్తాద్ భగత్‌ సింగ్‌`, `లెనిన్‌` చిత్రాలు చేస్తోంది.

 ఇక తమిళంలో `పరాశక్తి`, హిందీలో `ఆషిఖి 3`, కన్నడలో `జూనియర్‌` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అయితే ఈ సినిమాలు హిట్‌ అయితేనే ఆమె స్టార్‌ హీరోయిన్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకుంటుంది. లేదంటే కథ మళ్లీ మొదటికొస్తుంది. అయితే ఈ సారి మాత్రం ఆచితూచి వ్యవహరిస్తోంది శ్రీలీల. కంటెంట్‌ ఉన్న చిత్రాలకే ప్రయారిటీ ఇస్తోంది.

45
పెళ్లికి ముందే తల్లి అయిన శ్రీలీల
Image Credit : sreeleela insta

పెళ్లికి ముందే తల్లి అయిన శ్రీలీల

ఇదిలా ఉంటే శ్రీలీల నేడు తన 24వ పుట్టిన రోజుని జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ఆమె నటిస్తోన్న కొత్త సినిమాల కొత్త లుక్‌లు వచ్చాయి. ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. ఈ సందర్భంగా శ్రీలీలకి సంబంధించిన ఒక ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. 

ఆమె పెళ్లి చేసుకోక ముందే తల్లి అయ్యింది. ఇద్దరు పిల్లలకు తల్లి కావడం విశేషం. అదేంటో చూస్తే, శ్రీలీల కన్నడలో `బై టూ లవ్‌` అనే సినిమాలో నటించింది. ఈ మూవీ షూటింగ్‌ చేస్తున్నప్పుడు ఒక అనాథ శరణాలయానికి వెళ్లింది. అక్కడ అనాథలను చూసి చలించిపోయింది శ్రీలీల. వారికోసం ఏదైనా చేయాలని భావించింది. 

అందులో భాగంగా బుద్ధి మాంద్యం ఉన్న ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుంది. తన గొప్ప హృదయాన్ని చాటుకుంది. ఇప్పుడు వారి పోషణ, థెరఫీకి సంబంధించిన అన్నీ తానే చూసుకుంటుంది. ఓ రకంగా వారికి తల్లిలా మారిపోయింది శ్రీలీల. కానీ ఈ విషయాన్ని ఆమె ఎప్పుడూ బయటకు చెప్పలేదు.

55
శ్రీలీల జీవితంలోనే బెస్ట్ మూమెంట్‌
Image Credit : sreeleela insta

శ్రీలీల జీవితంలోనే బెస్ట్ మూమెంట్‌

ఇలా పెళ్లి చేసుకోకముందే ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యింది శ్రీలీల. ఆ పిల్లలను దత్తత తీసుకోవడంపై శ్రీలీల స్పందిస్తూ తన జీవితంలో అత్యంత సంతోషకరమైన మూమెంట్‌ ఏదైనా ఉందంటే అది ఇదే అని ఆమె తెలిపింది. స్వతహాగా డాక్టర్‌ ఫ్యామిలీ నుంచి వచ్చిన శ్రీలీల కూడా డాక్టరే. 

ఆ మధ్యనే ఎంబీబీఎస్‌ ఫైనల్‌ ఎగ్జామ్స్ రాసింది. అందుకోసం సినిమాలకు కూడా బ్రేక్‌ ఇచ్చింది. ఇప్పుడు డాక్టర్‌ ప్రాక్టీస్‌ కంటే సినిమాలపైనే ఫోకస్‌ పెట్టింది. వరుసగా సినిమాలుండటంతో డాక్టర్‌ వృత్తిలో కొనసాగలేకపోతుంది. అయితే భవిష్యత్‌లో మాత్రం ఆ దిశగా ప్లాన్స్ చేసే అవకాశం ఉందట.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Funky First Review: `ఫంకీ` మూవీ ఫస్ట్ రివ్యూ.. థియేటర్లో నవ్వుల సునామీ.. కానీ మైనస్‌ ఏంటంటే?
Recommended image2
బాహుబలిని డామినేట్ చేసిన 70 ఏళ్ళ నాటి సినిమా.. జనాలు ఎప్పుడో మరచిపోయారు అంటూ రాజమౌళిపై కామెంట్స్
Recommended image3
Mahesh Babu Home Tour : వావ్ అనాల్సిందే.. మహేష్ బాబు ఇంద్రభవనం లోపల ఎలా ఉందో చూశారా?
Related Stories
Recommended image1
Kannappa Trailer: `కన్నప్ప` మూవీ ట్రైలర్‌ ఎలా ఉందంటే? ప్రభాస్, మంచు విష్ణు మధ్య ఎమోషనల్‌ డ్రైవ్‌.. అసలు కథ ఇదే
Recommended image2
సౌందర్య తన కెరీర్‌లో అత్యంత కష్టంగా ఫీలైన మూవీ ఏంటో తెలుసా? ఏకంగా తండ్రికి డెడికేట్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved