MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రజనీకాంత్‌కి తన రేంజ్‌ ఏంటో చూపించిన శోభన్‌ బాబు.. `దళపతి`ని ఢీ కొన్న సోగ్గాడి మూవీ ఏంటో తెలుసా?

రజనీకాంత్‌కి తన రేంజ్‌ ఏంటో చూపించిన శోభన్‌ బాబు.. `దళపతి`ని ఢీ కొన్న సోగ్గాడి మూవీ ఏంటో తెలుసా?

సోగ్గాడు శోభన్‌ బాబు.. సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ కి తన రేంజ్‌ ఏంటో చూపించారు. తనకు పోటీగా వచ్చిన రజనీ మూవీకి చుక్కలు చూపించారు. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Aug 12 2025, 09:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
శోభన్‌ బాబుతో పోటీ పడ్డ రజనీకాంత్‌
Image Credit : Asianet News

శోభన్‌ బాబుతో పోటీ పడ్డ రజనీకాంత్‌

శోభన్‌ బాబు ఫ్యామిలీ కథలతో తెలుగు ఆడియెన్స్ ని ఆకట్టుకున్నారు. ఆయన ఎక్కువగా కుటుంబ కథా చిత్రాలతోనే స్టార్‌గా ఎదిగారు. మధ్య మధ్యలో యాక్షన్‌ సినిమాలు, పౌరాణికాలు చేసినా, ప్రేమ కథలు, కుటుంబం, భార్యాభర్తల, ప్రేమికుల చుట్టూ తిరిగే కథలే ఆయన్ని స్టార్‌ని చేశాయి. సూపర్‌ స్టార్‌గా నిలిపాయి. తిరుగులేని సోగ్గాడిగా కీర్తించేలా చేశాయి. అయితే ఫ్యామిలీ స్టోరీతోనే సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌కి చుక్కలు చూపించారు సోగ్గాడు. ఆ కథేంటో చూద్దాం.

DID YOU
KNOW
?
రజనీ పారితోషికం
`కూలీ` సినిమాకి సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ రూ.150కోట్ల పారితోషికం తీసుకున్నారని సమాచారం. సన్‌ పిక్చర్స్ ఈ మూవీని నిర్మిస్తోంది.
25
రివేంజ్‌ స్టోరీతో సూపర్‌ హిట్‌ కొట్టిన శోభన్‌ బాబు
Image Credit : suresh productions

రివేంజ్‌ స్టోరీతో సూపర్‌ హిట్‌ కొట్టిన శోభన్‌ బాబు

శోభన్‌ బాబు సూపర్‌ హిట్‌ చిత్రాల్లో ఒకటి `సర్పయాగం`. తన రెగ్యూలర్‌ జోనర్‌కి భిన్నమైన జోనర్‌ మూవీ ఇది. రివేంజ్‌ క్రైమ్‌ డ్రామాగా వచ్చింది. తన కూతురు రేప్‌కి గురికావడంతో తట్టుకోలేని తండ్రి ఈ ఘటనకు కారణమైన వారిని అంతం చేసేందుకు సీరియల్‌ కిల్లర్‌గా మారిన కథాంశంతో ఈ మూవీ రూపొందింది. ఈ చిత్రానికి పరుచూరి బ్రదర్స్ దర్శకత్వం వహించారు. రామానాయుడు నిర్మించిన ఈ చిత్రంలో వాణి విశ్వనాథ్‌, రేఖ, రోజా హీరోయిన్లుగా నటించారు. 1991, నవంబర్‌ 1న విడుదలైన ఈ మూవీ సూపర్‌ హిట్‌ గా నిలిచింది.

Related Articles

Related image1
`వార్ 2` మూవీ ఫస్ట్ రివ్యూ.. ఎన్టీఆర్‌, హృతిక్‌ నటించిన సినిమాలో కళ్ళు తిప్పుకోలేని ఎలిమెంట్‌ ఏంటంటే?
Related image2
హీరోయిన్‌తో ప్రభాస్‌ మ్యారేజ్‌.. పెద్దమ్మ రియాక్షన్‌ ఇదే.. ఆయన చేతుల్లోనే డార్లింగ్‌ పెళ్లి
35
`దళపతి`తో సంచలనాలు సృష్టించిన రజనీకాంత్‌
Image Credit : imdb

`దళపతి`తో సంచలనాలు సృష్టించిన రజనీకాంత్‌

ఈ మూవీకి విడుదలైన నాలుగు రోజుల్లోనే రజనీకాంత్‌ సినిమా వచ్చింది. రజనీకాంత్‌తోపాటు మమ్ముట్టి హీరోలుగా నటించిన `దళపతి` మూవీ 1991 నవంబర్‌ 5న విడుదలైంది. ఈ సినిమాలో అరవింద్‌ స్వామి కీలక పాత్ర పోషించగా, భాను ప్రియా, శోభన, శ్రీ విద్య హీరోయిన్లుగా నటించారు. మణిరత్నం రూపొందించిన ఈ గ్యాంగ్‌ స్టర్‌ డ్రామా సంచలన విజయం సాధించింది. తెలుగులోనూ సూపర్‌ హిట్‌గా నిలిచింది. కాసుల వర్షం కురిపించింది. ఇప్పటికీ ఈ సినిమా ఎవర్‌ గ్రీన్‌ గా నిలిచిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

45
`దళపతి`కి బాక్సాఫీసు వద్ద చుక్కలు చూపించిన `సర్పయాగం`
Image Credit : Facebook/శోభన్ బాబు గారి భక్తులం

`దళపతి`కి బాక్సాఫీసు వద్ద చుక్కలు చూపించిన `సర్పయాగం`

అయితే శోభన్‌ బాబు నటించిన `సర్పయాగం` మూవీ వచ్చిన నాలుగు రోజుల గ్యాప్‌తోనే రజనీకాంత్‌ `దళపతి` విడుదలైంది. ఏక కాలంలో తమిళంతోపాటు తెలుగులోనూ రిలీజ్‌ అయ్యింది.  తెలుగులో ఇది సోగ్గాడి `సర్పయాగం`తో పోటీపడాల్సి వచ్చింది. `దళపతి` సునామీ ముందు తట్టుకొని నిలబడింది. అదే సమయంలో కొంత వరకు `దళపతి`ని దెబ్బకొట్టింది.  అప్పట్లో శోభన్‌ బాబు రేంజ్‌ ఏంటో చూపించింది. ఆడియెన్స్ రజనీ మూవీకి క్యూ కడుతున్నా, `సర్పయాగం` సైతం ఆ పోటీని తట్టుకుని నిలబడి బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. ఇలా రజనీకాంత్‌కి సోగ్గాడు తన రేంజ్‌ ఏంటో చూపించిందని చెప్పొచ్చు.

55
`కూలీ`తో రాబోతున్న రజనీకాంత్‌
Image Credit : Facebook/Rajinikanth

`కూలీ`తో రాబోతున్న రజనీకాంత్‌

ఇక ప్రస్తుతం  `కూలీ` సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు రజనీకాంత్‌. లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీలో నాగార్జున, అమీర్‌ ఖాన్‌, శృతి హాసన్‌ నటిస్తుండటం విశేషం. ఈ చిత్రం ఆగస్ట్ 14న విడుదల కాబోతుంది. అటు ఎన్టీఆర్‌, హృతిక్‌ రోషన్‌ల `వార్‌ 2`తో తలపడుతుంది. ఈ రెండింటి మధ్య క్లాష్‌లో ఏది నిలబడుతుందో చూడాలి. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
శోభన్ బాబు
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
తమిళ సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
తరుణ్ బిజీగా ఉండటంతో.. ఉదయ్ కిరణ్ కు దక్కిన బ్లాక్ బస్టర్ సినిమా ఏదో తెలుసా?
Recommended image2
ఆ డైరెక్టర్ తో సూపర్ హిట్ సినిమాలు చేసి ఇండస్ట్రీలో కనిపించకుండా పోయిన నలుగురు హీరోలు..కానీ ఒక్కడు మాత్రమే
Recommended image3
Jeffrey Epstein: ఎవ‌రీ జెఫ్రీ, ఆ ఐల్యాండ్‌లో ఏం చేశాడు? OTTలో భయంకర సత్యాలను తెలిపే డాక్యుమెంటరీ
Related Stories
Recommended image1
`వార్ 2` మూవీ ఫస్ట్ రివ్యూ.. ఎన్టీఆర్‌, హృతిక్‌ నటించిన సినిమాలో కళ్ళు తిప్పుకోలేని ఎలిమెంట్‌ ఏంటంటే?
Recommended image2
హీరోయిన్‌తో ప్రభాస్‌ మ్యారేజ్‌.. పెద్దమ్మ రియాక్షన్‌ ఇదే.. ఆయన చేతుల్లోనే డార్లింగ్‌ పెళ్లి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved