MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • జగదేక వీరుడు అతిలోక సుందరిని మించేలా ప్లాన్.. డిజాస్టర్ అయిన శోభన్ బాబు, బాలయ్య చిత్రం ఏంటో తెలుసా

జగదేక వీరుడు అతిలోక సుందరిని మించేలా ప్లాన్.. డిజాస్టర్ అయిన శోభన్ బాబు, బాలయ్య చిత్రం ఏంటో తెలుసా

Sobhan Babu and Balakrishna : జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్ర రికార్డులు తిరగరాయాలనే ఉద్దేశంతో శోభన్ బాబు, బాలకృష్ణ కాంబోలో ఒక చిత్రం వచ్చింది. ఆ మూవీ రిజల్ట్ ఏంటో తెలుసుకుందాం. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Sep 20 2025, 12:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Nandamuri Balakrishna and Sobhan Babu
Image Credit : Asianet News

Nandamuri Balakrishna and Sobhan Babu

మెగాస్టార్ చిరంజీవి, అతిలోక సుందరి శ్రీదేవి నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం ఎప్పటికీ టాలీవుడ్ చరిత్రలో ఒక దృశ్య కావ్యంలా నిలిచిపోతుంది. దర్శకుడు రాఘవేంద్ర రావు అంతటి అద్భుతంగా ఆ చిత్రాన్ని రూపొందించారు. చిరంజీవి, శ్రీదేవి జంట పర్ఫార్మెన్స్ ఈ చిత్రంలో నెక్స్ట్ లెవల్ లో ఉంటుంది. అగ్ర నిర్మాత అశ్విని దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచి రికార్డులు తిరగరాసింది. 

25
బాలయ్య, శోభన్ బాబు కాంబినేషన్
Image Credit : x/production house

బాలయ్య, శోభన్ బాబు కాంబినేషన్

అశ్విని దత్ ఆ తర్వాత జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రాన్ని మించే సినిమా చేయాలని పాన్ చేశారు. వెంటనే మరోసారి రాఘవేంద్ర రావు దర్శకుడిగా కొత్త ప్రాజెక్టు సెట్ చేయించుకున్నారు. జగదేక వీరుడు అతిలోక సుందరి తర్వాత వైజయంతి బ్యానర్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో అశ్విని దత్ బడ్జెట్ కి వెనుకాడలేదు. ఈ చిత్రం వైవిధ్యంగా ఉండాలని నందమూరి బాలకృష్ణ, శోభన్ బాబు కాంబినేషన్ లో మల్టీస్టారర్ చిత్రానికి రంగం సిద్ధం అయింది.

Related Articles

Related image1
శర్వానంద్ దంపతులు విడిపోతున్నారా ?.. పెళ్లై రెండేళ్లు, కూతురు కూడా ఉంది
Related image2
ఫ్లాపుల్లో ఉన్న హీరోయిన్ గ్లామరస్ లుక్, వైట్ డ్రెస్ లో మెరిసిపోతున్న నభా నటేష్.. వైరల్ ఫోటోస్
35
రికార్డులు తిరగరాస్తుంది అనే అంచనాలు 
Image Credit : Asianet News

రికార్డులు తిరగరాస్తుంది అనే అంచనాలు 

 జగదేక వీరుడు అతిలోక సుందరి తర్వాత అశ్విని దత్ నిర్మిస్తున్న చిత్రం.. పైగా రాఘవేంద్ర రావు, బాలకృష్ణ, శోభన్ బాబు కాంబినేషన్.. దీనితో టాలీవుడ్ రికార్డులు తిరగరాసే చిత్రం అవుతుందని అంతా భావించారు. ఈ కాంబినేషన్ లో వచ్చిన మూవీ అశ్వమేథం. 1992లో ఈ చిత్రం విడుదలయింది. మీనా, నగ్మా హీరోయిన్లుగా నటించారు. 

45
అప్పట్లోనే 3 కోట్ల భారీ బడ్జెట్
Image Credit : google

అప్పట్లోనే 3 కోట్ల భారీ బడ్జెట్

జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రానికి పెట్టిన బడ్జెట్ 2 కోట్లు. అశ్వమేథం చిత్రం కోసం అశ్విని దత్ 3 కోట్లు ఖర్చు చేశారు. క్రేజీ కాంబినేషన్ కావడంతో కలెక్షన్స్ కి డోకా ఉండదనేది అశ్విని దత్ నమ్మకం. ఆయన ఆశించినట్లుగానే ఈ చిత్రానికి ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. 

55
డిజాస్టర్ అయిన అశ్వమేథం 
Image Credit : Asianet News

డిజాస్టర్ అయిన అశ్వమేథం 

 కానీ సినిమా మాత్రం ప్రేక్షకులని మెప్పించలేకపోయింది. ఫలితంగా అశ్విని దత్ కి నష్టాలు తప్పలేదు. అశ్వమేథం చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. బాలయ్య, శోభన్ బాబు కాంబినేషన్ లో వచ్చిన ఏకైక చిత్రం ఇదే. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
నందమూరి బాలకృష్ణ
శోభన్ బాబు
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
పవన్ కళ్యాణ్ కోసం పోలీసు దెబ్బలు తిన్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవరో తెలుసా? కారణం ఏంటి?
Recommended image2
Jr Ntr: ఆగిపోయిన ఎన్టీఆర్‌ సినిమాని ఇండస్ట్రీ హిట్‌ చేసిన దర్శకుడు ఎవరో తెలుసా? తారక్‌ కెరీర్‌నే మార్చేసిన మూవీ
Recommended image3
Gunde Ninda Gudi Gantalu: విద్య కన్నీళ్లకు పడిపోయిన మనోజ్, మరో లక్షకు రోహిణీ టోపీ,తప్పు తెలుసుకున్న బాలు
Related Stories
Recommended image1
శర్వానంద్ దంపతులు విడిపోతున్నారా ?.. పెళ్లై రెండేళ్లు, కూతురు కూడా ఉంది
Recommended image2
ఫ్లాపుల్లో ఉన్న హీరోయిన్ గ్లామరస్ లుక్, వైట్ డ్రెస్ లో మెరిసిపోతున్న నభా నటేష్.. వైరల్ ఫోటోస్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved