Rashmika Mandanna: నేను ఆమెకి రెండో అమ్మని.. చెల్లిపై రష్మిక ఎమోషనల్ కామెంట్
సౌత్, బాలీవుడ్ సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా మారిన రష్మిక మందన్న, ఇటీవల టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండను పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించారు. తన చెల్లి గురించి ఆమె ఎమోషనల్ కామెంట్ చేశారు.

నేషనల్ క్రస్‌గా పాపులర్ అయిన రష్మిక
రష్మిక మందన్న పాన్ ఇండియా హీరోయిన్‌గా రాణిస్తోంది. నేషనల్ క్రష్‌గా పాపులర్ అయిన విషయం తెలిసిందే. అలాగే 2026 ఫిబ్రవరి 28న టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండను పెళ్లి చేసుకుని కొత్త జీవితం మొదలుపెట్టారు.
చెల్లిని చూసి రష్మిక ఎమోషనల్
చెల్లికి రెండో అమ్మని
ఆ రెండు ఫోటోలను చూసి రష్మిక ఎమోషనల్ అయ్యారు. `అవును, నా చెల్లి షిమాన్ నాకంటే 16 ఏళ్లకు పైగా చిన్నది. నేను తనకి రెండో అమ్మని. షిమాన్‌ను నా చెల్లి అనడం కన్నా, నా మొదటి బిడ్డ అని పిలవడానికే నేను ఇష్టపడతాను` అని రష్మిక అన్నారు. ఇంటర్వ్యూలో చెల్లి ఫోటో చూడగానే ఆమె ముఖంలో కనిపించిన ఆనందం చూస్తే, తన చెల్లెలు అంటే ఎంత ఇష్టమో అర్థమవుతుంది.
రష్మిక చెల్లికి ఏజ్ గ్యాప్
సాధారణంగా అక్కాచెల్లెళ్ల మధ్య కొన్నేళ్ల వయసు తేడా ఉంటుంది. కానీ రష్మిక, షిమాన్ విషయంలో ఇది వేరు. ఏప్రిల్ 5 నాటికి 29 ఏళ్లు నిండిన రష్మికకు, ఆమె చెల్లి షిమాన్‌కు ఇప్పుడు 13-14 ఏళ్లు. రష్మిక సినిమాల్లో సక్సెస్ అవుతున్న టైంలో, షిమాన్ ఇంకా స్కూల్ విద్యార్థిని. ఈ వయసు తేడాయే వాళ్లిద్దరి బంధాన్ని మరింత బలంగా మార్చింది. అందుకే రష్మిక తన చెల్లిని 'నా మొదటి బిడ్డ' అని పిలుచుకుంటుంది.
చెల్లిని సరిగా చూసుకోలేదని రష్మిక ఆవేదన
కెరీర్‌లో సక్సెస్ అయినా, పర్సనల్ లైఫ్‌లో కొన్ని అందమైన క్షణాలను మిస్ అయ్యానని రష్మిక బాధపడ్డారు.`నా చెల్లి నాకంటే 16 ఏళ్లు చిన్నది. తను పెరిగి పెద్దవ్వడాన్ని నేను సరిగ్గా చూడలేదు` అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
రష్మిక చెల్లి విషయంలో ఆవేదన
`గత ఎనిమిదేళ్లుగా పని వల్ల ఎక్కువగా ఇంటికి దూరంగానే ఉన్నాను. తను చిన్నప్పటి నుంచి టీనేజ్‌లోకి అడుగుపెట్టడాన్ని నేను కళ్లారా చూడలేకపోయాను. ఇప్పుడు తను దాదాపు నాంత ఎత్తు పెరిగింది` అని రష్మిక బాధపడ్డారు. షూటింగ్ బ్రేక్స్‌లో చెల్లితో గడపడమే రష్మికకు పెద్ద పండగ అని కూడా తెలిసింది.

