- Home
- Entertainment
- పెళ్లంటేనే భయంగా ఉంది, తల్లిని కావాలనే కోరిక కూడా ఉంది.. శృతి హాసన్ ఓపెన్ గా చెప్పేసిందిగా..
పెళ్లంటేనే భయంగా ఉంది, తల్లిని కావాలనే కోరిక కూడా ఉంది.. శృతి హాసన్ ఓపెన్ గా చెప్పేసిందిగా..
స్టార్ హీరోయిన్ శృతిహాసన్ తరచుగా వార్తల్లో ఉండటం చూస్తూనే ఉన్నాం. శృతిహాసన్ తెలుగులో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి అగ్ర హీరోలతో అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది.

స్టార్ హీరోయిన్ శృతిహాసన్ తరచుగా వార్తల్లో ఉండటం చూస్తూనే ఉన్నాం. శృతిహాసన్ తెలుగులో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి అగ్ర హీరోలతో అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. తెలుగులో శృతిహాసన్ కి గబ్బర్ సింగ్, రేసుగుర్రం, ఎవడు, సలార్, శ్రీమంతుడు లాంటి సూపర్ హిట్ చిత్రాలు ఉన్నాయి.
శృతిహాసన్ వ్యక్తిగత జీవితం, డేటింగ్ సంబంధించిన విషయాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తన పర్సనల్ లైఫ్ ని శృతిహాసన్ ఎప్పుడు సీక్రెట్ గా ఉంచలేదు. ఓ ఇంటర్వ్యూలో శృతిహాసన్ తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతూ పెళ్లి గురించి ఓపెన్ అయింది.
పెళ్లి అంటేనే నాకు భయం వేస్తుంది. ఇద్దరు వ్యక్తులు కలవడానికి పెళ్లి లేదా పేపర్ ద్వారా అగ్రిమెంట్ చేసుకునే విధానం నాకు భయాన్ని కలిగిస్తోంది. కానీ కమిట్మెంట్, లాయల్టీ పై నాకు నమ్మకం ఉంది. గతంలో ఒకసారి పెళ్లి వరకు వెళ్లాను. కానీ వర్కౌట్ కాలేదు.
పెళ్లి విషయంలో శృతి హాసన్ అభిప్రాయం ఇలా ఉన్నప్పటికీ.. తనకి తల్లిని కావాలనే కోరిక మాత్రం ఉందని శృతిహాసన్ బయటపెట్టింది. అయితే పిల్లల పెంపకానికి తల్లిదండ్రులు ఇద్దరూ ఉండాలి. నాకు సింగిల్ మదర్ గా ఉండిపోవడం ఇష్టం లేదు. ఎందుకంటే పిల్లల ఎదుగుదలకి తల్లిదండ్రులు ఇద్దరూ అవసరం అని తాను బలంగా నమ్ముతానని శృతిహాసన్ పేర్కొంది.
శృతి హాసన్ చివరగా శాంతను అనే వ్యక్తితో డేటింగ్ చేసింది. గత ఏడాది వీరిద్దరూ విడిపోయారు. ప్రస్తుతం తాను సింగిల్ గా ఉన్నట్లు శృతి హాసన్ పేర్కొంది. ప్రస్తుతం శృతి హాసన్ రజనీకాంత్ కూలీ చిత్రంలో నటిస్తోంది.